DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల ఆలయంలో ఆద్యంతం అనాచారమే: వైష్ణవాగమ పండితులు

*చందనోత్సవాన్ని ధనార్జన ఉత్సవం గా మార్చేశారు : హైందవ సంఘాలు*

*సహస్రఘటాభిషేకం లోనూ అనాచారమే..తీర్ధం తో వచ్చే స్వాములను నెట్టేసి..*
 
*ఆ మహిళలకు గర్భాలయంలో డ్యూటీ- బయట భక్తులకు లాఠీ ఛార్జి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2023 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లాల

ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం లో ఆద్యంతం అనాచారం చేయడంపై శ్రీపాంచరాత్ర ఆగమ మండితులు ఉత్సవ నిర్వహణ కమిటీ పతీరుపై మండిపడుతున్నారు. ఈ ఆలయం శ్రీపాంచరాత్ర ఆగమ విధానం లో ఆరాధనములు నిర్వహించబడుతుంది. గర్భాలయంలో ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. మూల విరాట్ ను ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోరాదు. అలాంటిది

నిన్న జరిగిన ఉత్సవం లో నేరుగా గర్భాలయంలో నేరుగా మహిళలు తిష్ట వేసి హంగామా  చేస్తున్న వీడియోలు విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఈ ఆలయం లో వీడియో లు, ఫోటోలు తియ్యడం పూర్తిగా నిషేధం. అలాంటిది ఈ వీడియో లు ఎలా వచ్చాయి ? వీడియోలో ఉన్న ఆలయం సింహాచల క్షేత్రమేనని, అది ఎప్పుడు తీసిన ఘోర తప్పిదమేనన్నారు. 

రెవెన్యూ కి

దేవాలయ వ్యవస్థతో సంబంధం ఏంటి?

దేవాలయ వ్యవస్థతో ఏమాత్రం సంబంధం లేని, రెవిన్యూ అధికారులకు ఉత్సవ నిర్వహణ అప్పగించడం వల్లనే ఈ ఉత్సవం లో చేయరాని అనాచారం చేసారని అందువల్లనే ఉత్సవం విఫలం అయ్యిందని హైందవ సంఘాలు మండిపడుతున్నాయి. 

చందనోత్సవాన్ని ధనార్జన ఉత్సవం గా మార్చేశారు..
 
అత్యంత పవిత్రంగా

ఆరాధనలు నిర్వహించే ఈ దేవాలయంలో అస్సలు దేవాలయం గురించి ఏమాత్రం తెలియని, సంబంధం లేని రెవిన్యూ విభాగానికి ఉత్సవ భాద్యతలు అప్పగించడం ఏంటని ఆలయ వైదిక మండిపడుతున్నారు. వీళ్ళు దీన్ని దేవాలయ ఉత్సవం గా కాక, ధనార్జన ఉత్సవం గా మార్చేశారన్నారు.  

పరిమితికి మించి రూ. 1500 టికెట్లు అమ్మకం. 

రూ. 1500 ప్రత్యేక

దర్శనం టికెట్లు కేవలం 15000 మాత్రమే అమ్ముతామని ఉత్సవ నిర్వహణ కమిటీ చర్మన్ ప్రకటించినా వేలాదిగా లెక్కకు మించి టికెట్లు అమ్మడం జరిగిదని ఆలయ వైదిక సిబ్బంది మండిపడుతున్నారు. లెక్క ప్రకారం గర్భాలయ దర్శనం ఉదయం 7 గంటల లోగా పూర్తి కావాల్సి ఉండగా, రెవెన్యూ, పొలిసు అధికారులు, కుటుంబాల సభ్యులకు గర్భాలయ దర్శనం చేయించడంలోనే

కమిటీ సర్వశక్తులు ఒద్దడంతో మధ్యాహ్నం 11.30 గంటల సమయం దాటినా గర్భాలయ దర్శనాలు కొనసాగించారని వైదిక సిబ్బంది మీడియాకు తెలియచేసారు.  

గర్భాలయంలో మహిళలకు డ్యూటీలా?

పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం ఈ గర్భాలయంలో కేవలం అర్చకులకు తప్ప మరొకరు ప్రవేశించడం పూర్తిగా నిషేధం. అలాంటిది స్వామి నిజరూప దర్శన ఉత్సవం

రోజున ఏకంగా మహిళలు స్వామి మూలవిరాట్ ప్రక్కనే నుంచుని డ్యూటీలు చేయడాన్ని పూర్తిగా అపచారం గా భావిస్తున్నారు. అదేదో తమ హక్కుల భావిస్తూ భక్తులపై అజమాయిషీ చేయడం ఈ వీడియో లో స్పష్ఠంగా కనిపిస్తోంది. 

మహిళా భక్తులపై లాఠీ ఛార్జి:

ఒక ప్రక్క అధికార గణానికి అనుయాయులుగా ఉన్న ఇద్దరు మహిళలకు గర్భాలయంలో

డ్యూటీ వెయ్యగా, మరోప్రక్క దర్శనం కోసం వచ్చిన మహిళా భక్తులపై పోలీసులు అత్యంత పాశవికంగా లాఠీ ఛార్జి చెయ్యడం ఘోర తప్పిదం. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామి పై భక్తితోనే వస్తారు. అలాంటిది ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫ్రీ దర్శనం క్యూలో జరిగిన ఈ ఘటన పై పోలీసుల తీరుకు భక్తులు మండిపడుతున్నారు. 

ఉచిత

క్యూల్లో కి వచ్చిన భక్తులు ఆలయంలో స్వామిని దర్శించేందుకు వచ్చిన భక్తులే తప్ప వారు నేరం చేసిన నేరగాళ్లు కాదని వైష్ణవ స్వాములు ఆవేదన చెందారు. 

ఈ ఘటన రాత్రి సహస్ర ఘటాభిషేకం జరుగుతున్నా సమయంలో శ్రీ వైష్ణవ స్వాములు గంగాధర నుంచి తీర్ధం తీసుకు వెళ్తున్న మార్గం లో జరగడం తో స్వాములు సైతం ఈ ఘటనకు తీవ్ర అభ్యంతరం

చెప్పారు.

వైష్ణవ స్వాముల పట్ల ఘోర అపచారం:..

ఇదిలా ఉంటె. . గంగాధర నుంచి మూల విరాట్ స్వామికి అభిషేకం చేసేందుకు తీర్ధం తీసుకు వచ్చిన రైష్ణవ స్వాములను సైతం అంతరాలయం లో ప్రవేశించే సమయంలో ఆలయ సిబ్బంది నెట్టివేయడం బాధాకరం. ఈ స్వాముల్లో చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకూ ఏంటో దూర ప్రాంతాల నుంచి రావడం

గమనార్హం. ఈ సమయంలోనే త్రిదండి చిన్న జీయర్ స్వామి గర్భాలయంలోనే ఉండడం గమనార్హం. తమ అధికారాగాణానికి, బంధువులకు దర్శనం చెసించడం కోసం పూర్తి దీక్షతో తీసుకు వచ్చే స్వాములను నెట్టేసి మరీ అధికార దర్పాన్ని ప్రదర్శించిన నిర్వహణ కమిటీ, ఆలయ ఈఓ, ఇతర సిబ్బంది పై స్వాములు మండిపడ్డారు. 

అనాచారాలను సహించేది లేదు:

వైష్ణవ స్వాములు. 

ఘటాభిషేకం అనంతరం స్వాములందరితోనూ చిన్న జీయర్ స్వామి సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే స్వాములు ఆలయంలో జరిగితినా, జరుగుతున్నా ప్రతి అనాచారాన్ని జీయర్ స్వామికి వివరించారు. సమీక్ష అనంతరం స్వాములు చేపట్టవలసిన కార్యాచరణ తెలియచేసారు. అదే సమయంలో ఆలయ వ్యవస్థ తో ఏమాత్రం సంబంధం లేని అధికారగణం

దేవాలయ వ్యవస్థ పై ఆధిపత్యం చేసి, అనాచారాలు చేస్తుంటే. .వైదిక వ్యవస్థ ఉంది ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేసారు. 

చందన యాత్ర మొదటి క్షణం నుంచి ఆఖరి క్షణం వరకూ ఆద్యంతం అనాచారాలతో నిర్వహించిన ఈ ఉత్సవం  వైఫల్యం చెందినట్టు ఆలయ వైదిక వర్గాలు తెలియచేస్తున్నాయి.

ఈ అనాచారాలపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

సైతం విమర్శించినా విషయం తెలిసిందే.  

పురాణకాలం నాటి వైభవం కల్గిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం గురించి కనీస అవగాహన కూడా  లేకుండానే నిర్వహణ భాద్యతలు చేపట్టిన అధికారగణం ఈ రోజున జరిగిన అన్ని తప్పిదాలపై ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రధాన భాద్యతలు వహించిన అధికారులు పూర్తిగా భాద్యత వహించాల్సి

ఉందని యావత్ హైందవ సమాజం డిమాండ్ చేస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam