DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 28 నుంచి రమ్య తిరుమల దేవాలయ వార్షికోత్సవాలు  

*శ్రీకాకుళం లో వెలసిన శ్రీనివాసునికి వైభవోపేత వేడుకలు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 26, 2023 (డిఎన్ఎస్ ):* కోరిన కోర్కెలు తీర్సుస్తూ భక్తులను అన్నివేళలా ఆదుకునే శ్రీ రమ్య తిరుమల శ్రీనివాసుని 13 వ వార్షికోత్సవ  తిరుకల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు అత్యంత

వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాధ వేణుమాధవాచార్యులు తెలియచేసారు. అత్యంత సామాన్యులను సైతం ఆదుకుంటూ అందరికి అభయాన్ని అందిస్తున్నఈ వెంకటనాధుని వార్షికోత్సవ వేడుకలను శ్రీపాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహించనున్నామన్నారు. సింహాచల క్షేత్రం లోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి వేదపాఠశాల

పూర్వ ప్రిన్సిపాల్ శతాధిక దేవాలయ ప్రతిష్ఠాపకులు ముప్పిరాల నారాయణ మూర్తి శిష్య బృందం చే వైభవంగా జరుగుతాయని వివరించారు. 
12 ఏళ్ళ క్రితం అత్యంత సామాన్య ప్రార్ధన మందిరంగా ప్రారంభమైన ఈ ప్రాంగణం నేడు శ్రీనివాసుని కరుణ కటాక్షాలతో నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా విరాజిల్లుతోందన్నారు. ప్రతి రోజు ఉదయం సుప్రభాతం, ఆరాధనలు

అనంతరం బాలభోగం నివేదిన తదుపరి విశేష అర్చనలు జరుగుతున్నాయి. ఆలయంలో జరిగే ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిరుప్పావై పాశుర విన్నపం చేయడం ద్వారా ఆలయ వైభవాన్ని మరింతగా విస్తరింప చేస్తున్నారు. కల్యాణోత్సవాల్లో జరిగే తిరువీధి ఉత్సవంలో సుమారు 200 మందికి పైగా భక్తులు పాల్గొని, కోలాటాలు,

భజనలు, నృత్యాలతో శ్రీకాకుళం వీధులలో వెంకటేశ్వర వైభవాన్ని చాటి చెప్తున్నారు.  

వార్షికోత్సవాలు:

ఈ నెల 28 వ తేదీ నుంచి ఆలయ 13 వ వార్షికోత్సవాల్లో ప్రతి రోజూ వైభోగమే అనే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు.  

28 వ తేదీ సాయంత్రం 4 గంటలకు పెద్ద సంఖ్యలో భక్తులచే సామూహిక శ్రీ

మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఉత్సవాంగీకారం, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ, మంటప ఆవాహనం తో వేడుకలు ఆరంభమవుతాయన్నారు. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకూ సౌభాగ్య abhivruddi కోసం, dhana సంపత్తికోసం శ్రీ మహాలక్ష్మి హవనం నిర్వహిస్తున్నామన్నారు. తదుపరి మంగళాశాసనం,

తీర్ధ ప్రసాద వినియోగం ఉంటుందన్నారు. 

రెండవ రోజు : 29 వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధనా, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చనలు, ప్రధాన కళాశావాహనం, నిత్య హోమం, ప్రభాత గోష్టి జరుగుతుందన్నారు. తదుపరి ఉదయం 6 :30 గంటల నుంచి 81 కళాశాలతో శ్రీ రమ్య తిరుమల శ్రీనివాసునికి విశేష స్నాపన తిరుమంజనం, పంచామృత అభిషేకం, విశేష

అలంకారం, లఘు అర్చన, సహస్ర నామార్చన, విశేష హోమాలు అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, తదుపరి శ్రీ స్వామి వారి తిరుకల్యాణం నభూతో నభవిష్యత్ అనే రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మహదాశీర్వచనం, నీరాజన మంత్రం పుష్పం, మహా నీరాజనం, శాత్తుమురై, అనంతరం కల్యాణ కర్తలకు సత్కారం

జరుగుతుందన్నారు.
సాయంత్రం  సదస్యం నిర్వహిస్తున్నామని, తదుపరి ఆయుష్యు, ఆరోగ్యం, సంప్రాప్తి కోసం శ్రీ లక్ష్మి నారాయణ హోమం నిర్వహిస్తున్నామని, అనంతరం  నివేదనం, మంగళాశాసనం, తీర్ధ ప్రసాద వినియోగం ఉంటుందన్నారు.

మూడవ రోజు ఈ నెల 30 న ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, చతుస్థానార్చన, శేష హోమం, ప్రభాత గోష్టి,

మంగళాశాసనం, అనంతరం చూర్ణోత్సవం, వసంతోత్సవం, అవభృత స్నానం, చక్రవరి స్నానం జరుగుతాయన్నారు. ఉదయం 10 గంటలకు ఆరోగ్య ప్రాప్తి కోసం, శత్రుజయం కోసం, విద్యాభివృద్ధి కోసం, విదేశీయానం కోసం, సంతాన ప్రాప్తి కోసం శ్రీ సుదర్శన - నృసింహ హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
 మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి, మహా నివేదనం, మంగళాశాసనం,

జరుగుతాయని, అనంతరం తీర్ధ ప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. ఉత్సవాల ముగింపు ను పురస్కరించుకుని సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ పుష్ప యాగం, ద్వాదశారాధనలు, దీపారాధనలు, ఊంజల్ సేవ, దర్పణం సేవ, మహదాశీర్వచనం, ఋత్విక్ సమ్మానం, మంగళ శాసనం, తీర్ధ ప్రసాద వినియోగం తో కార్యక్రమం  ముగుస్తుందన్నారు.

ఆలయ వార్షికోత్సవాలను

పురస్కరించుకుని ఈ నెల30 న మధ్యాహ్నం 12 30 గంటల నుంచి భక్తులందరికి తదీయారాధన (మహా anna ప్రసాద వితరణ ) జరుగుతుందని తెలిపారు.

మూడు రోజుల వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి రోజూ పాల్గొని, శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల కరుణ కటాక్షాలను పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

ఈ వార్షికోత్సవాల్లో

జరిగే కార్యక్రమాల్లోయజమానులుగా పాల్గొనదలచిన భక్తులు ఆలయ అర్చకులు వేణు మాధవ్ ( ఫో :9440061940 నెంబర్ ) ను సంప్రదించవచ్చని తెలియచేస్తున్నారు. 

ఆదాయ మినహాయింపు రాయితీ కలదు:

రమ్య తిరుమల దేవాలయం శ్రీశ్రీ సంప్రదాయ సాహిత్య రంగం సంస్థ ద్వారా నిర్వహించబడుతోంది, ఈ దేవాలయ అభివృద్ధి కి భక్తులు ఇచ్చే విరాళాలపై

ఆదాయ పన్ను రాయితీ ( 80 జి) కూడా అమలు అవుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam