DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కంటతడి పెట్టిస్తున్న అమరగాయకుని జీవిత గాథ నాటకం 

*ఉత్తరాంధ్ర జిల్లాల్లో సురభి చే ఘంటసాల సాంఘిక నాటకం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మే 30, 2023 ( DNS Online):* ప్రపంచ దేశాలను ఉర్రుతలూగించిన అమర గాయకులూ ఘంటసాల వెంకటేశ్వర జీవిత చరిత్రను నాటకం రూపంలో చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది అందం అతిశయోక్తి కాదు. జానపద నాటకాలకు ప్రసిద్ధి

కెక్కిన సురభి నాట్య మండలి బృందం మొట్ట మొదటి సారిగా ఘంటసాల జీవిత చరిత్రను రంగస్థలం పైకి ఎక్కించారు. గత మూడు రోజులుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం  పట్టణాల్లో ప్రదర్శిస్తున్నారు. విశాఖపట్నం నగరంలో ప్రముఖ నాటక ప్రియులు, బాదం గిర్ సాయి నేతృత్వం లోని రంగసాయి నాటక గ్రంథాలయం, నిర్వహణలో రెండు ప్రదర్శనలు అందించారు.

 
స్టేషన్ ఘనపూర్ కు చెందిన  శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి బృందం రంగసాయి నాటక గ్రంథాలయం శాశ్వత నిధి కోసం ఈ నాటకం ను విశాఖలో ప్రదర్శించింది. 

నాటక ప్రదర్శన అనంతరం రచయిత, గుణ నిర్ణేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఏయు పూర్వ రిజిస్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి గుంట సూర్య

ప్రకాశరావు, ప్రసారభారతి పూర్వ ఏ.డి.జి. డాక్టర్ సుధాకర్ రావు లు కళాకారుల ప్రతిభను కొనియాడుతూ, ఘంటసాల జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో ఘటనలు ఆహుతులను కన్నీటి పర్యంతం చేశాయన్నారు. 

అనంతరం ప్రముఖ నటులు, దర్శకులు, శిక్షకులు ఉస్మానియా యూనివర్సిటీ రంగస్థల విభాగం పూర్వ విభాగాధిపతి జిఎస్ ప్రసాద్ రెడ్డి ని రంగస్థల

జీవన సాఫల్య పురస్కారంతో  సత్కరించారు. 

లవకుశ పాట ప్రార్ధనా గీతంగా ప్రారంభమైన ఈ నాటకం. .ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత విద్య కోసం కృష్ణ జిల్లా చోటుపల్లి నుంచి విజయనగరం రావడం నుంచి ప్రారంభమవుతుంది. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం వెంకట స్వామి నాయుడు,  పట్రాయని సీతారామశాస్త్రి వంటి గురువుల సారధ్యంలో

సంగీత శిక్షణను అభ్యసించారు. ఈ క్రమంలోనే భోజన ఏర్పాటు కోసం మాదాకోళం ( వీధి యాచక) సైతం చేసిన దృశ్యాలు కంటతడి పెట్టించాయి. అనంతర కాలం లో సంగీత విద్యను పూర్తి చేసుకుని, చోటుపల్లి చేసి సంగీత పాటలు చెప్పడం మొదలు పెట్టారు. అదే సమయంలో గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొని, జనాన్ని కుర్రోతలూగించి, చైతన్యం

కల్గించేలా స్వాతంత్య్రమే నా జన్మ హక్కని చాటండి అంటూ గీతాలను గ్రామగ్రామాలా ప్రచారం చేసారు. దీనిలో భాగంగా అలీఘర్ జైల్లో 19 నెలలు శిక్ష కూడా అనుభవించారు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ పొట్టి శ్రీరాములు అమరులైన సందర్భం లో  విషయం తెలుసుకుని, దీక్ష శిబిరాన్ని చేరుకున్నారు ఘంటసాల. కనీసం

మరో మనిషి అక్కడ లేకపోవడం చూసి, ఈ మద్రాసు నగరం తెలుగు వాళ్ళు ఉన్నారా. . .చచ్చారా అంటూ ఆవేదనతో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా. అంటూ గీతాలాపల చేస్తూ. . .శ్రీరాములు భౌతిక శరీరానికి స్వయంగా  అంతిమ సంస్కారం చేయించారు. ఈ దృశ్యం నాటక ప్రదర్శన హాలు లోని వారి నందరిని కన్నీటి పర్యంతం చేసింది.

అటు నుండి సినీ రంగ ప్రవేశం

ఇలా వివిధ అంశాలతో నాటకం సాగింది. సామాజిక బాధ్యతగా ఆయన ప్రజల నుండి విరాళాల సేకరణ, విదేశాలలో సంగీత కచేరీలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకునుగా నియామకం, భగవద్గీత పఠనం, చివరిగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక, తుది శ్వాస విడవడం  ఇలా విభిన్న అంశాలు ప్రదర్శించారు. 
ఘంటసాల తిరుగాడిన సమయంలో ఎంతమంది ప్రత్యక్షంగా

వారిని చూసారో తెలియదు కానీ. .సురభి బృందం కళ్ళకి కట్టినట్టు ప్రతీ దృశ్యాన్ని ఆహూతులకు చూపించారు. 

నాటకానికి ఆదరణ అవసరం:

ఇంత అద్భుతమైన నాటకాన్ని ఊరూరా ప్రదర్శిస్తుంటే ఆదరించే ప్రేక్షకులు రాకపోవడం కడు బాధాకరం. సినీ పోకడలతో పెచ్చుమీరిపోయిన జనం లో అవగాహనా పెంచవలసిన భాద్యత అందరిపై ఉంది. సినీ రంగం

లోకి, టీవీ రంగంలోకి ప్రవేశించాలి అనుకునే యువతకు ఇలాంటి నాటక ప్రదర్శనలు చూపించినట్టు అయితే. . వారికి ముఖ కవళికలు, హావభావాలు, ఆహార్యం, ఆంగికం వంటివి ఎదురుగా రంగస్థల వేదికపై చూసి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam