DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్కడ అతివృష్టి - ఇక్కడ అనావృష్టి, వీళ్ళ మార్పుకేనా షా రాక?

త్వరలో మారనున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష పదవులు?

*(DNS Report : P. Raja, Bureau Chief,  Amaravati)*
  
*Amaravati, june 11, 2023 ( DNS Online):* మోటు భాయ్ గా బీజేపీ లో ఖ్యాతిగాంచిన అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన పార్టీలో సమ్మూల మార్పులు తెచ్చేందుకేనా అంటే అవుననే సమాధానం వస్తోంది.  అతివృష్టి బండి సంజయ్ ని, అనావృష్టి సోము వీర్రాజు ని intiki

పంపే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆచితూచి స్పందించాల్సిన విషయాలకు కూడా అతిగా స్పందిస్తుంటారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకు పూర్తి భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి ఉంది. అత్యంత వేగంగా స్పందించాల్సిన విషయాల పై కూడా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు

అస్సలు స్పందించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఇతను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు పూర్తి అనుకూలం అనే వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ నుంచే వినిస్తున్నాయి. 

ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ కు ముందు..లేదా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందుగానే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో

పాటుగా తెలుగూ రాష్ట్రాల  పార్టీ అధ్యక్షుల మార్పు నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పుకు నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఏపీ ,తెలంగాణ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు పార్టీ నేతలు

చెబుతున్నారు.

ఈ సారి ప్రక్షాళణలో ఏపీ, తెలంగాణ నుంచి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు తప్పదని చెబుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం

సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలన..పార్టీలో మార్పుల దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రుల్లో పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనుంది

కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రుల మార్పు పైనా కసరత్తు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో

ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను తప్పించి, ఐటీ..కమ్యూనికేషన్ల శాఖకు పరిమితం చేయాలనేది పార్టీ నాయకత్వం ఆలోచనగా సమాచారం. క్రీడల శాఖ నుంచి అనురాగ్ ఠాకూర్ ను తప్పించే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుపైన భారం తగ్గించి..పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసేలా కేబినెట్

మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికలకు పూర్తి సంసిద్దత దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. త్వరలో జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన మార్పులకు సిద్దం అవుతోంది. ఎన్టీఏ ను మరిన్ని పార్టీలతో విస్తరించే ప్రక్రియ పైన ఆలోచన చేస్తోంది.

కొందరు

సీనియర్లకు పూర్తిగా ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఒక్కరే తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మంత్రిగా కేంద్ర కేబినెట్ లో కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డిని కొనసాగిస్తేనే తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.తెలంగాణ అధ్యక్షుడిగా బండి

సంజయ్ ను కొనసాగిస్తే ఏపీకి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇస్తారనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి జీవీఎల్ నర్సింహారావు...సీఎం రమేష్ పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జీవీఎల్ ఏపీకి చెందిన వారే అయినా యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం

వహిస్తున్నారు. జీవీఎల్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. సామాజిక సమీకరణాల్లో జీవీఎల్ కు అవకాశం తక్కువ.

సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చిన నేత కావటంతో బీజేపీ నిర్ణయం ఏంటనేది చూడాలి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తున్నా..ఆయనకు ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా

బాధ్యతలు అప్పగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇటు పొత్తులు..భవిష్యత్ కార్యాచరణలో భాగంగా మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ కొత్త బీజేపీ చీఫ్ పైన ఉత్కంఠ నెలకొంది. టీడీపీతో పొత్తు పైన నిర్ణయం తీసుకున్న తరువాత నే ఏపీ నుంచి .కొత్త అధ్యక్షుడిపైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam