DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణుల పునర్వైభవం కోసం వేలాదిమందితో ఉద్యమిద్దాం: జివిఎల్

*అర్చక, పురోహిత సదస్సులో ఎంపీ జివిఎల్ సంచలన  ప్రకటన*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూలై 8, 2023 ( డిఎన్ఎస్) :* రాష్ట్రంలో బ్రాహ్మణుల పునర్వైభవం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బ్రాహ్మణులంటే కలిసి ఐకమత్యంతో ఉద్యమించి పోరాటం చెయ్యడానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు జి వి

ఎల్ నరసింహరావు పిలుపునిచ్చారు. శనివారం విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాజ్యసభ సభ్యులు జీ వి ఎల్ నరసింహరావు తో  బ్రాహ్మణ, అర్చక, ఆత్మీయ పురోహితుల తో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన అర్చక, పురోహిత ప్రతినిధులు గత దశాబ్దాలుగా తాము పడుతున్న దుర్భర జీవితాలను సభాముఖంగా

తెలియచేసారు. 

చాలీచాలని ఆదాయంతో దుర్భర జీవితాలను గడుపుతున్న బ్రాహ్మణుల స్థితి మెరుగు పడడంకోసం పోరాటం చెయ్యవలసిన అవసరం ఉందన్నారు. భారీ ఎత్తున బ్రాహ్మణా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో జివిఎల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, పురోహితులు, జీవితాలు దుర్భర స్థితి లో

ఉండడానికి గల కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమేనని రాజ్యసభ సభ్యులు జి వి ఎల్ నరసింహరావు అభిప్రాయం పడ్డారు. 

బ్రాహ్మణుల సమస్య ల పట్ల అవగాహన లేకుండా వివిధ రాజకీయ పార్టీల వారు పరిష్కారం చేసేస్తాం  అని చెప్పడం సరికాదన్నారు. గతంలో బ్రాహ్మణా వ్యతిరేక పాలకులు చేసిన కొన్ని చట్టాలు, కమిషన్లు ఇచ్చిన

తీర్పుల కారణంగా ఈ రాష్ట్రంలో దేవాలయాలు బ్రష్టు పట్టాయని, అర్చక సంఘాల నేతలు చెప్పిన అంశంపై స్పందిస్తూ ఆయా చట్టాలు, తీర్పులను పూర్తిగా అవలోకనం చేసుకుని, దీనిపై పోరాటానికి సిద్దపడతామన్నారు. 

ముందుగా అర్చక, పురోహితుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహనా చేసుకుని తదుపరి పరిష్కారం అయేంత వరకూ కృషి చేద్దాం అన్నారు.

సమస్య తన దృష్టికి వస్తే  .ఎవ్వరూ చెప్పక పోయినా దాన్ని పరిష్కారం కోసం వెంటనే కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.  బ్రాహ్మణుని అని చెప్పుకోడానికి ఎంతో గర్వపడతా అన్నారు.

సంఘాల ప్రతినిధులు అందరూ ఒకే వేదికపైకి వచ్చి, బలమైన నాయకత్వం ఏర్పడేలా కృషి చేయాలన్నారు.  సంఘంలో

సమావేశం కోసం ఒక్కరు పిలుపు ఇస్తే వందల సంఖ్యలో సభ్యులు వచ్చే విధంగా మనం బలోపేతం కావాలన్నారు

సమాజం లో భక్తి భావం పెరిగింది. ఆలయాల్లో అర్చకులు భక్తులకు మరింత భక్తి పెరిగేలా కృషి చేయాలన్నారు. ఆలయాలను ఆధ్యాత్మికతతో పాటు, సమాజ చైతన్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం లో అర్చకులు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రతి చోటా

సరైన నిర్వహణ, ఆదరణ లేక వేద పాఠశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. అర్చక పురోహితులకు, కుటుంబ సభ్యులకు వైద్య, విద్య సదుపాయాలు కల్పించే విధంగా కమిటీ వేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా అర్చక సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి ఆయిలురి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు దుర్భర స్థితిలో

జీవితాన్ని  గడుపుతున్నారని తెలిపారు.  అర్చకులు ఉంటేనే దేవాలయాలు వృద్ది లో ఉండి వైభవంగా ఉంటాయని అలాంటిది అధికారులు, పాలకులు అర్చకులు పాత నిర్లక్ష్య వైఖరి తో ఉన్నారన్నారు. దేవాలయాల్లో జరిగే అవకతవకల ను అర్చకులను భాద్యుల్ని చెయ్యడం బాధాకరం అన్నారు.

ఉత్తరాంధ్ర అర్చక సంఘం అధ్యక్షులు కొత్తలంక మురళి కృష్ణ

మాట్లాడుతూ అన్ని గుళ్ల నీ, అందరూ అర్చకులను ఒకే త్రాటికి కట్టకూడదని, అన్ని గుళ్ల లోనూ ఆదాయం ఒకేలా ఉండదన్నారు. అర్చకుల పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయన్నారు.   

ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ టోలీ, సింహాచలం గ్రామా పురోహిత సంఘం ప్రతినిధి పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ అర్చకుల అధీనంలో

ఉండవలసిన దేవాలయాల్లో ఇతరుల ప్రమేయం ఎక్కువై, అర్చకులను అత్యంత నీచంగా చూస్తున్నారన్నారు. దేవాలయాల హుండీ లో భక్తులు వేస్తున్న  ముడుపులు, ఏయే విధంగా ఖర్చు చేస్తున్నారో భక్తులకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసారు. హిందూ దేవాలయాల్లో భక్తులు వేస్తున్న నిధులను ఇతర మాటలకూ ఏ యధేచ్చచగా ఖర్చు చేస్తున్నారని

మండిపడ్డారు. 

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రభుత్వ కబంద హస్తాల నుంచి విముక్తి కల్గించి, ప్రతి జిల్లాలోని పెద్ద దేవాలయాల ఆదాయాన్ని చిన్న దేవాలయాల నిర్వహణకు వినియోగించాలన్నారు. తద్వారా భక్తులు వేసే ముడుపులు సద్వినియోగం అవుతాయన్నారు. 

ప్రముఖ దినపత్రిక విశాఖ సమాచారం సంపాదకులు సూరంపూడి

వీరభద్ర రావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమం లో సింహాచలం ప్రాంత మునిసిపల్ కార్పొరేటర్ రాపర్తి కన్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె సుహాసిని ఆనంద్, ఉత్తరాంధ్ర అర్చక సంఘం, వివిధ పురోహిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా DNS మీడియా వ్యవహరించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam