DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ టికెట్ లో డిపి కె జనసేన ఓటు, జివిఎల్ కు స్థానచలనమేనా?

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 19, 2023 ( DNS Online):* రానున్న ఎన్నికల్లో విశాఖ నగరం నుంచి లోక్ సభ కు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరే స్వయంగా పోటీలో ఉండబోతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఈమెకు జనసేన పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదే విషయాన్నీ జనసేన సీనియర్ నాయకులూ సైతం తెలియచేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంపై పూర్తి పట్టు ఉన్న విషయం తెలిసిందే. విశాఖ నుంచి టికెట్ ఇవ్వడంలో జనసేన పురంధేశ్వరి వైపే మ్రొగ్గు చూపే అవకాశం ఉంది. బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం లో

పురంధేశ్వరి ని కలిసిన జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కలిసి అభినందనలు తెలియచేసిన సందర్భంలో ఇదే అంశం ప్రస్తానాకు వచ్చినట్టు తెలుస్తోంది.   

అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇదే బీజేపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహ రావు తనదైన స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి

విశ్వ ప్రయత్నం చేస్తూ వివిధ వర్గాల ప్రతినిధులతో ఆత్మీయ సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు. జివిఎల్ ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త కావడం, స్థానికులతో ఎటువంటి అనుబంధం లేకపోవడం తో పాటు, బీజేపీ నేతలు, క్యాడర్ కలిసి రాకపోవడం పెద్ద డ్రా బ్యాక్ గా మారింది. ఈ నేపథ్యంలో జివిఎల్ తనదైన పథకం తో వివిధ కుల సంఘాలతో ప్రత్యేక

 సమావేశాలు ఏర్పాటు చేసి, వారి మద్దతు కోరుతుండడం గమనార్హం. ఇదే క్రమంలో బిసి విభాగం లో వర్గాలకు చెందిన మూడు కుల సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో వారి సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం చేసే ప్రయత్నం చేసి, వీళ్ళని తనవైపు త్రిప్పుకునే ప్రయత్నం చేసారు. అయితే ఈయన సొంత సామజిక వర్గం నుంచి పెద్దగా

మద్దతు లభించక పోవడంతో అంతర్మధనం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్నీ విశాఖ లో జరిగిన రెండు సమావేశాల్లో బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తానూ స్థానికుణ్ణి అని తెలియచేసేందుకు విశాఖ లోనే ఒక అపార్ట్మెంట్ లో ఆన్ ఫ్లాట్ కొనుగోలు chear

పురందేశ్వరి సామాజిక వర్గం తో పాటు, ఇతర వర్గాల ప్రతినిధులతో సైతం

ఈమెకు సత్సంబంధాలు ఉండడం అదనపు బలం. పైగా ఆర్ధిక బలం, అంగబలం కూడా అదనపు సహకారం ఉండనుంది. గతంలో పనిచేసిన ఇదే లోక్ సభ స్థానం నుంచి ఎన్నికై, ఐదేళ్ల కలం పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు, ప్రతి నియోజక వర్గం లోనూ ఈమెకు ప్రత్యేక క్యాడర్ ఉండడం గమనార్హం. ఈమె సామాజికవర్గానికి చెందిన మీడియా సంస్థలు సైతం అనధికారిక సహకారం కూడా

లభించనుంది. 

ఈ అంశాల్లో జివిఎల్ ఎట్టి పరిస్థితుల్లోనూ దరిదాపుల్లో ఉండే అవకాశం లేదు. ఈయన సామాజిక వర్గం వారు సైతం వీరికి మద్దతు ఇస్తారా అంటే అనుమానమే. ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ స్థానిక బలం లేదు, కనీసం పార్టీ క్యాడర్ సైతం మద్దతు లేదు. పైగా నాయకులూ ఒక్కొక్కరు ఒక్కో వర్గంగా మారిపోయి, క్యాడర్ ను

అయోమయం లోకి నెట్టేశారు. ఈయనకు ప్రత్యేకంగా ప్రచార కమిటీ గానే, నిధుల సమీకరణ టీమ్ గానీ, ఫండింగ్ ఇచ్చే నాధుడే కనపడడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభ కు ఎన్నికవ్వడం అంటే సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరం వచ్చింది. 
  
అన్ని పార్టీల దృష్ఠి విశాఖనగరం పైనే ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ

నగరానికి లోక్ సభ లో ప్రాతినిధ్యం వచించె వ్యక్తి అత్యంత కీలకం కానున్నారు. దీని కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సహా అందరూ అవిశ్రాంతంగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam