DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశీ వీసాల మోజు లో పడి మోసపోకండి: న్యాయవాది శ్రీనివాస్ హెచ్చరిక

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జులై 20, 2023 ( DNS Online):* విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం విదేశీ మోజు లో పడి దళారుల చేతిలో మోసపోవద్దని, ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సీతమ్మధారలో గల ఓ ప్రయివేటు లా కళాశాల లో ఇంటర్నేషనల్, ఇమ్మిగ్రేషన్ లా అంశంపై ఏర్పాటు చేసిన

సదస్సు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలని, ఉద్యోగం చెయ్యాలి అనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులే లక్ష్యంగా ఆ రంగంలో నిత్యం జరుగుతున్న చాలా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన నకిలీ వీసాల పట్ల అప్రమత్తంగా

ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో తగిన విచారణ చేయాలన్నారు. సదరు సంస్థ గుర్తింపు, జాబ్ ఆఫర్ లెటర్ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. 

ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలన్నారు. వెళ్లే ప్రాంతం పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలన్నారు. 
నైజీరియా, ఆఫ్రికా దేశాలకు

చెందిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్నారన్నారు. వీటి పట్ల అందరూ ముందు జాగ్రత్త గా వుండాలన్నారు. ఈ మేరకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో లా కళాశాల సిబ్బంది , అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam