DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమవరం లో అర్చకునిపై ట్రస్టీ భర్త దాడి అమానుషం: జనసేనాని

*దాడితో పటు యజ్ఞోపవీతం తెంచేస్తారా?: పవన్ మండిపాటు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 09, 2023 ( DNS Online):* భీమవరంలో పంచారామ క్షేతాలలో ఒకటైన భీమారామం క్షేతంలో పనిచేసే సహాయ అర్చకుడు (పురోహితులు)  పి.నాగేంద్ర పవన్ పై ఈ ఆలయ ట్రస్టుబోర్డు మహిళా చైర్మన్ లక్ష్మి భర్త యుగంధర్ (వై ఎస్ ఆర్

కాంగ్రెస్ నాయకుడు) భౌతిక దాడి చేసి యజ్ఞోపవీతం తెంచిన ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారు? అని పత్రిక ప్రకటనలో తెలిపారు. ఒక బ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా పరిరక్షించుకుంటారు. అలాంటిది బ్రాహ్మణుని పై దాడి చెయ్యడం ఒక

తప్పు, యజ్ఞోపవీతం తెంచడం అంత కంటె పెద్ద తప్పు అన్నారు. ఈ ఘటనకు పాల్గొపడిన యుగంధర్ పై తక్షణం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇటీవల కలం లో హిందూ దేవాలయాల్లో అనుమతస్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకుంటున్న బ్రాహ్మణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.  పైగా బాధిత బ్రాహ్మణుడి

మొబైల్ ఫోన్ ను సైతం పొలిసు వర్గాలు స్వాధీనం చేసుకుని ఎటువంటి సమాచారం బయటకు వెళ్లకుండా దోషులకు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు.  

ఆగ్రహించిన బ్రాహ్మణా సంఘాలు. . .

భీమవరం ఆలయ ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగ బ్రాహ్మణా సంఘాలు, ఉత్తరాంధ్ర అర్చక పురోహిత మిత్ర, బ్రాహ్మణా సంఘాలు మండిపడుతున్నాయి.

ఆలయాల్లో ఇతరుల ఆధిపత్య పైత్యం బాగా పెరిగిపోయిందని, తక్షణం ఆలయాల్లోని ట్రస్ట్ బోర్డు లను రద్దు చేసి, రాజకీయ పార్టీల పేరుతొ ఆలయానికి వచ్చేవారికి ఆలయ ప్రవేశం ఇవ్వరాదన్నారు. 

అధికార పార్టీకు వెన్నుముక గా నిలిచినా బ్రాహ్మణా ప్రతినిధులు ఇంతవరకూ స్పందించక పోవడం గమనార్హం. 

ఈ ట్రస్ట్ బోర్డ్

చైర్మన్ భర్త కోడె యుగంధర్ ఇటీవలే ఆలయ ఈఓ. చాగంటి సురేష్ నాయుడు పై కూడా బౌతికదాడి చేసినట్టు తెలుస్తోంది. దాంతో కొన్ని రోజులు ఈవో దేవాలయానికి రావడం మానేసినట్టు భక్తులు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం బాధిత అర్చకుడు పవన్ స్థానిక హాస్పటల్లో వున్నాడు, 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam