DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వ దోష పరిహారం కోసం ప్రతీ బ్రాహ్మణుడూ  చేయాల్సిన యజ్ఞమే...ఉపాకర్మ

*ఋగ్వేదీయులకు 29 న, యజుర్వేదీయులకు 31 న  ఉపాకర్మ*  

*శ్రావణ పౌర్ణమి న చేయాల్సిన ఉపాకర్మ పై DNS ప్రత్యేక కధనం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

విశాఖపట్నం,  ఆగస్టు 28, 2023 (డిఎన్ఎస్): సర్వ మానవాళి శుభప్రదం గా జీవనం సాగించాలి అని నిత్యం కోరుకునే వాడు బ్రాహ్మణుడు. ఎదుటి వారికి ఇబ్బంది

కల్గించే  ఎటువంటి దోషాలు చెయ్యరాదు. అందునా బ్రహ్మచారి అస్సలు తప్పు చేయరాదు. ఈ విధమైన నిబంధనలు తప్పని సరిగా పాటించాలి. పురాణం కాలం నుంచి వస్తున్నా నిబంధన. వాటిని పరిహారం చేసుకోవాల్సిన భాద్యత వీరిదే. . . 

ఉపాకర్మ అంటే ఏంటి:. . .
ఒక వేళా తెలిసో తెలియకో వీరి వల్ల జరిగే దోషాలకు పాప పరిహారం చేసుకోవాల్సిన భాద్యత

వీరిదే. దీనికోసం ఏడాది లో ఒకరోజున వీటిని పరిహారం చేసుకునేందుకు యజ్ఞ ప్రక్రియను నిర్వహిస్తుంటారు. దీనికి ఉపాకర్మ అని పేరు.  

యజ్ఞోపవీత ధారణ అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరూ (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రి సహా అందరూ) ఈ ఉపాకర్మ ను నిర్వహించుకోవాల్సి ఉంది.  అయితే. . .కచ్చితంగా జరుపుకోవాల్సిన నిబంధన, భాద్యత మాత్రం

బ్రాహ్మణునిపై ఉంది. నూతన విద్యను అభ్యసించే వారు, గృహస్తులైనా, బ్రహ్మచారులైనా, తప్పని సరిగా నిర్వహించుకోవాల్సి ఉంది. అయితే కాలక్రమేణా మారుతున్నా విధానాల దృష్ఠ్య. .గృహస్తులు ఉపాకర్మ ఆచరించడం లేదు. ప్రస్తుత కాలంలో వేద పాఠశాలల్లో ఉండే వేదవిద్యార్థులు మాత్రం ఈ విధానాన్ని క్రమం తప్పకుండా అమలు

చేస్తున్నారు. 

సంప్రదాయాన్ని యధాతధంగా కొనసాగిస్తున్న గృహస్తుల్లో సైతం కొందరు తమ ఇళ్లల్లోనే ఉపాకర్మ ను ఆచరిస్తున్నారు. 

ఎందుకు చేయాలి : . .. 
ఏడాది కాలం లో జరిగే దోషాలకు పరిహారం గా ఉపాకర్మ చేయడం జరుగుతుంది. జాత, మృత, ఇతర శౌచ్యం లను పాటించక పోయినా, ఇతరులతో కలిసి పనిచేసిన సమయాల్లో పొరపాటున

ఇలాంటి దోషం తగిలినా అవి తెలియక పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా యజ్ఞోపవీతం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి దోషం తో కూడిన యజ్ఞోపవీత నిత్యకృత్యాలకు పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. అందుకే ప్రతి మూడు నెలలకో మారు ప్రతి ఒక్కరూ యజ్ఞోపవీతం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత కాలంలో చాలామంది పాటించడం

లేదు. 

పూర్వం బ్రహ్మచారులు గురుకులం లో ఉంది వేదపఠనం చేయడం జరిగేది. ఆ సమయాల్లో వీరి గృహం లో సంభవించిన జాత, మృత శౌచ్య సమాచారం వీరికి అందదు. అయినా వీరికి దోషం ఉంటుంది. కనుక నూతనంగా వేదపాఠం ఆరంభించే ముందు నూతన యజ్ఞోపవీతం ధరించి, యజ్ఞ యాగాదులు నిర్వహించి, దోష పరిహారం చేసుకోవడం కోసం దేవ, ఋషి తర్పణాలు అర్పించడం

జరుగుతుంది. దీనికే ఉపాకర్మ అని పేరు.  ఇది వేదపాఠశాలలో ఉండే వారు యధావిధిగా నిర్వహిస్తుంటారు.  

అయితే గురుకులం లో ఉండకుండా, సాధారణ విద్య చదివే వారు సైతం ఈ విధమైన యజ్ఞ, తప, తర్పణలతో దోష పరిహారం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ విధమైన ప్రక్రియను జరపడం దాదాపుగా మానుకున్నారు. 

సంప్రదాయం ఇంకా జీవించే ఉంది :. . .

యాంత్రిక జీవనానికి పూర్తిగా అలవాటు పడిన గత తరం వరకూ వైదిక సంప్రదాయ అలవాట్లలో మార్పులు కారణంగా 7 వ సంవత్సరం లో జరపవలసిన ఉపనయనాన్ని కేవలం వివాహం ముందు ( 27 ఏళ్ళ వయసులో) ఉపనయనం మాత్రం జరుపుకుని తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. 

అయితే ప్రస్తుత తరం యువత వైదిక సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా ఉపనయనం 7 వ

సంవత్సరంలో జరుపుకోవడంతో పాటు, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సంద్యావందనాది వైదిక క్రియలను నిర్వహిస్తూ, ఏడాది కోమారు ఉపాకర్మ వంటి అత్యంత ప్రాధాన్యమైన వైదిక ప్రక్రియ ను కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా పాటించడం శుభప్రదం. వీరిలో అధికశాతం సాధారణ విద్యను అభ్యసించి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు కావడం

గమనార్హం,

ఉపాకర్మ కేవలం వేద విద్యార్థులు మాత్రమే కాక, లౌకిక విద్య అభ్యసిస్తున్న వారు కూడా ఆచరించడం శుభపరిణామం. 

అత్యంత ప్రాశస్త్యమైన ది శ్రావణ మాసం:

ఏడాది కాలం లో అత్యంత ప్రాశస్త్యమైన మాసం శ్రవణం కావడంతో, పౌర్ణమి రోజున ఉపాకర్మ ను నిర్వహించి, తదుపరి ప్రాయశ్చిత్త ప్రక్రియను

అగ్నిముఖంగా చేసుకుంటారు. ఈ రోజున శుచిగా తెల్లవారు ఝామునే స్నానాదికాలు ముగించి, స్వరూపం ధరించి, మంత్రం పూర్వకంగా నూతన యజ్ఞోపవీతాన్ని ఆరాధనలు చేసి, ఆపై ధరించి, సంధ్యావందనం జరిపి, అగ్నికార్యం నిర్వహించిన అనంతరం దేవతలకు, వంశంలోని ఋషులకు, (తండ్రి జీవించి లేనివారు అయితే పితృ దేవతలకు) తర్పణాలు ఇవ్వడం

జరుగుతుంది. 

ఒక్కో వేదం అనుసరించేవారు, ఆయా రోజుల నిర్దేశం ప్రకారం ఆ రోజున ఉపాకర్మ జరపడం ఆనవాయితీగా అశాస్త్రం తెలియచేస్తోంది. ఋగ్వేదీయులు అందరికంటే ముందుగా శ్రవణం నక్షత్రం రోజున ఈ నెల 29 న, శ్రావణ మాసం లో పౌర్ణమి రోజున ఈ నెల 31 న యజుర్వేదీయులు ఉపాకర్మ జరుపుకుంటారు. సామవేదీయులు సెప్టెంబర్ 16 న

నిర్వహించుకుంటారు. 

ఉపనయనం జరిగిన తర్వాత మొదటి సారి జరుపుకునే ప్రక్రియను మౌంజ్ఞీ అని, తదుపరి ఏడాది నుంచి ఉపాకర్మ అని పేరు. 

అగ్ని కార్యం (హోమం) జరిపిన సమయంలో పురుష సూక్త, శ్రీసూక్త, సహితంగా హోమ జపం తో ఆవునెయ్యి తో స్వాహా చేయడం సంప్రదాయం. 

వాతావరణం పవిత్రం. . .
వేదస్వరం తో

మంత్రోచ్చారణ, ఆవునెయ్యి తో హోమం జరపడం ద్వారా వాతావరణం లో స్వచ్ఛత ఏర్పడుతుంది. ఈ హోమం లో వినియోగించే ద్రవ్యం వల్ల వచ్చే పొగ వలన, ఎటువంటి వైరస్ లు, అంటు వ్యాధులు ఈ ప్రాంగణ పరిసరాల్లోకి చేరవు. 

కొసమెరుపు : . . . . ఈ ఉపాకర్మ క్రియను బ్రాహ్మణ బ్రహ్మచారులు నిర్వహించడం సమాజ శ్రేయస్సు కోసమే తప్ప, వారికి స్వార్థం కోసం

ఉపయోగపడదు. వారు చేసే జప, తపాదులు దోష రహితంగా ఉండడం కోసమే ఈ ఉపాకర్మ. సర్వేజనా సుఖినో భవంతు అన్న ఇక వాక్యం ఆధారంగానే బ్రాహ్మణ బ్రహ్మచారి జీవించాల్సి ఉంది. అయితే కాలానుగుణంగా చాలామంది ఈ ప్రక్రియను నిర్వహించడమే మానుకున్నారు. 

పైగా వీరు తప్పని సరిగా నిర్వహించవలసిన ఉపాకర్మ పేరు చెప్పగానే. .

చాలామంది బ్రహ్మచారులు చెప్పే సమాధానం ఉపాకర్మ అంటే ఏంటి? , , ఎప్పుడు ఈ పేరు వినలేదే. . .

ప్రస్తుత తరం లో చాల మార్పులు కనిపిస్తున్నాయి. సామాజిక జీవనం లో ఉన్నప్పటికీ పురాతన వైదిక సంప్రదాయ విధానాలను కొనసాగించడం శుభ పరిణామం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam