DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యే: జనసేనాని  

*బాబు ను అరెస్ట్ చేసిన విధానం సక్రమంగా లేదు : బీజేపీ*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, సెప్టెంబర్ 09, 2023 (డి ఎన్ ఎస్):* ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను నంద్యాలలో శనివారం తెల్లవారుఝామున ఆంధ్ర ప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పై పలు రాజకీయ

పార్టీలు స్పందించాయి. 

అరెస్ట్ చేసిన విధానం సరి కాదు: బీజేపీ 

తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన విధానం సరి అయినది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా,

ప్రొసీజర్ ఫాలో కాకుండా  చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుందన్నారు. 

బాబు అరెస్ట్ ను ఖండిస్తున్నాం : విష్ణుకుమార్ రాజు 

ఏపీలో అరాచక పాలన సాగుతుందని, ఈ పరిణామాలకు అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ

ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.  జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుధ్ధి చెబుతారన్నారు. 

చంద్రబాబు అరెస్ట్ చేయడం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యే : జనసేన 

చంద్రబాబు నాయుడును ను అరెస్ట్ చేయడం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యే అని జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.

శనివారం విడుదల చేసిన లేఖలో ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టారు. 

రాష్ట్రాన్ని నెగిటివ్ గ్రోత్లోకి నెట్టేశారు : నాదెండ్ల  
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ పని తీరుతో రాష్ట్రాన్ని నెగిటివ్ గ్రోత్లోకి నెట్టేశారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

అన్నారు. తెనాలి లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని  అరెస్టు చేయించారన్నారు. 
ఎప్పుడో మూడేళ్ల క్రితం రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ పేరుతో చంద్రబాబుని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత వ్యవహార

శైలికి పరాకాష్టగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించి, మాట్లాడే విపక్షాల గొంతు నొక్కేందుకు మొదటి నుంచిప్రయత్నిస్తున్న ప్రభుత్వం, పాలనా వ్యవస్థలను వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటుందని తెలిపారు. 

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్, రివెంజ్ పాలన: సిపిఐ 

ఆంధ్ర ప్రదేశ్ లో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం రివర్స్ టెండరింగ్ జరుగుతోందని, రివెంజ్ పరిపాలన సాగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ అరెస్ట్ తో అధికార పార్టీ కక్ష సాధింపు చర్య పరాకాష్టకు చేరిందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam