DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతన వ్యతిరేకులకు షేకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన హిందూ మహిళలు

*పూణే గణేష్ కి 35 వేల మహిళలు ఒకేసారి అథర్వశీర్ష పారాయణ* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, సెప్టెంబర్ 21, 2023  (DNS Online ):* ఇటీవల సనాతన ధర్మాన్ని నిర్ములిస్తాం అంటూ కొందరు హిందూ వ్యతిరేక అసురులు చేస్తున్న ప్రగల్బాలు నిరసనగా దేశ విదేశాల్లో హిందూ సమాజం మరింత చైతన్యవంతంగా మారింది అనడానికి

పూణే సాక్షిగా నిలిచింది. 

దేశ, విదేశాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పూణే అత్యంత ప్రాధాన్యత చోటుచేసుకుంది. పూణే లోని  శ్రీమంత్ దుగ్దసేత్ హల్వాయి గణపతి ఆలయ ప్రాంగణం లో ఉత్సవాల్లో రెండవరోజు మంగళవారం ఉదయం నగరానికి చెందిన 35 వేలమంది మహిళలు 'అథర్వశీర్ష' స్తోత్రాన్ని ఒకేసారి

పారాయణ చేశారు. ఇది ఒక రికార్డు గా కూడా నమోదు అయినట్టు తెలుస్తోంది.     

ఉత్సవ్ మండపం నుంచి హుతాత్మ చౌక్ వరకు ( 2.3 కిలోమీటర్లు)  మహిళలు క్రమశిక్షణతో మహిళలు ఓంకారాన్ని పఠిస్తూ, ప్రధాన అథర్వశీర్ష స్తోత్రాన్ని పఠిస్తూ గణేశుడికి నీరాజనం అందించారు. మహిళలు చేతులెత్తి చప్పట్లు కొడుతూ వినాయకుడికి నమస్కారం

చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల బృందం దేశ స్వాతంత్య్ర సమరయోధులను తమ చేతుల్లో సమాచార బోర్డులతో అభినందించారు. హారతితో కార్యక్రమం ముగిసింది. మొత్తం నగరమంతా ఇక్కడే ఉందా అనిపించేలా దర్శనమిచ్చింది. దీంతో దుగ్దసేత్ హల్వాయి గణపతి ఆలయ ప్రాంగణం పవిత్ర మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. 

గణపతి టెంపుల్ ట్రస్ట్

ద్వారా నిర్వహించబడిన ఋషి పంచమి సందర్భంగా గణేశోత్సవ వేడుకలో భాగంగా. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు, వేలాది మంది భక్తులు గణేశుని దర్శనం కోసం దేవాలయాలు మరియు పండాల్లోకి తరలివస్తారు. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాలు సెప్టెంబర్ 19న ప్రారంభమై అనంత చతుర్దశి రోజున విగ్రహాన్ని సంగీతం మరియు

మంత్రోచ్ఛారణలతో బహిరంగ ఊరేగింపుగా తీసుకెళ్లి నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది.

ఇదే ఆలయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ వినాయక చవితి రోజున మొదటి పూజలు చేసి, ఉత్సవాలను ప్రారంభించారు.    
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam