DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతన ధర్మరక్షణకై దేశవ్యాప్తంగా శౌర్య జాగరణ యాత్ర : విహెచ్ పి

*లవ్ జిహాద్, సనాతన ధర్మ వ్యతిరేక శక్తులకు అడ్డుకట్ట వేస్తాం* 

*విహెచ్ పి తెలంగాణ ప్రచార ప్రముఖ్ బాలస్వామి వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2023 (DNS ):* సమాజంలో ప్రక్కదారి పడుతున్న యువతను మేల్కొల్పి, సనాతన ధర్మం వైపు నడిపించేందుకు దేశవ్యాప్తంగా శౌర్య

జాగరణ యాత్ర చేపట్టినట్టు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 14 వరకు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర దేశంలోని దాదాపు 5 లక్షలకు పైగా గ్రామాల్లో యువతను జాగృతం చేసేందుకు బజరంగ్దళ్ యాత్రలు బయలుదేరుతున్నాయన్నారు. ప్రధానం gaa కొన్ని డిమాండ్లను

తెలిపారు.

కర్తవ్యభావన -  దేశభద్రత ప్రతి యువకుడి బాధ్యత ఉందన్నారు. 

భారతీయ వాస్తవ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

కామన్ సివిల్ కోడ్ సాధించి సమన్యాయం పొందాలి

మతాలకు అతీతంగా జనాభా సమతూల్యత పాటించాలి

మెజారిటీ - మైనారిటీ అనే తేడా లేకుండా తప్పు చేసిన వారికి

కఠినంగా శిక్షలు విధించాలి

దేశం అభివృద్ధి చెందాలంటే యువత జాగృతం కావాలి

హక్కులతో పాటు సమాజంపై యువత బాధ్యతగా నడుచుకోవాలి

దేశం కోసం .. ధర్మం కోసం బలిదానాలు చేసిన వీరుల ధీర చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. మన పూర్వీకుల త్యాగం.. మన దేశ నాయకుల

గొప్పతనం.. వీరమాతల స్ఫూర్తిని నేటి యువతకు అవగాహన పరచడమే లక్ష్యంగా "శౌర్య జాగరణ యాత్ర"  సాగుతుందన్నారు. 

కులాలకు అతీతంగా ప్రతి హైందవ సోదరుడు యాత్ర లను ఆదరించి దేశ రక్షణకు కంకణం కట్టాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిస్తోంది. హిందూ సంఘటనతోనే దేశం పురోగతి సాధిస్తుంది. విధర్మీయుల కుట్రలతో నేడు అనేక

విధాలుగా ధర్మంపై దాడి జరుగుతోంది. కాబట్టి దాడిని ఎదుర్కొని.. ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి హిందువులపై ఉంది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కదం తొక్కుతూ పదం పాడుతూ.. బజరంగ్దళ్ యాత్రలో పాల్గొందాం. హిందూ సంఘటనతో ధర్మ రక్షణ చేద్దాం.

అరాచక శక్తులకు అడ్డుకట్ట వేస్తాం: 
నేడు సమాజంలో భారతీయతపై..

హిందుత్వంపై అరాచకవాదులు దాడులకు తెగబడుతున్నారు. సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి అరాచక, ఉగ్రముఖలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి. ధర్మరక్షణలో ఎంతటి త్యాగానికైనా బజరంగ్ దళ్ సంసిద్ధమే. హేతువాదులు, లౌకిక వాదుల ముసుగులో ధర్మాన్ని కించపరిస్తే

 ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. 

యువతను జాగృతం చేస్తాం : 
దేశంలోని యావత్ యువతను మేల్కొల్పేందుకు విశ్వహిందూ పరిషత్ - బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో  శౌర్య జాగరణ యాత్ర చేపట్టడం నేడు అత్యవసరం అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి

జిల్లాలో యాత్ర కొనసాగడం శుభ పరిణామం. ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల (అక్టోబర్ )14 వరకు శౌర్య జాగరణ యాత్ర నిర్వహించి, భారతీయ యువతను మేల్కొల్పి దేశ చరిత్ర, భద్రత విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు విశ్వహిందూ పరిషత్ నిర్ణయించిందన్నారు.

భారత దేశ వాస్తవ చరిత్ర ప్రచారం:
/> భారతీయం కోసం.. సనాతన ధర్మం కోసం పోరాడిన పరాక్రమ వీరుల చరిత్రను నేటి సమాజానికి తెలియజేసి, జాగృతం చేయడం.. వక్రీకరించిన చరిత్ర కాకుండా, వాస్తవ చరిత్రను నేటి సమాజానికి అవగాహన కల్పించి, దేశభక్తిని రగిలించడమే లక్ష్యంగా యాత్ర కొనసాగడం గొప్ప విషయం. మన పుణ్యభూమి.. వేద భూమి.. కర్మభూమి అయినా భరత భూమి గొప్ప చరిత్ర కలిగి ఉంది.

 మహా పురుషులు, స్వాతంత్ర సమరయోధులు, వీర వనితలు, వీరమాతల ధైర్య శౌర్య పరాక్రమాలు నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దేశంపై దండెత్తి వచ్చిన దుర్మార్గుల అన్యాయాలు వివరించి, ధర్మంపై జరిగిన దాడి గురించి అవగాహన పరచడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నేటి సమాజాన్ని స్వాగతం చేయడం బజరంగ్దళ్ ప్రధాన

కర్తవ్యం.

లవ్ జిహాద్ లకు అడ్డుకట్ట వేస్తాం :
ఈ దేశ సమగ్రతకు పెనుముప్పుగా సంక్రమిస్తున్న పలు ప్రమాదకర విషయాలపై యువతను మేల్కోల్పడం.. ఈ దేశ పౌరులందరూ సమానమే అయినప్పుడు, సమన్యాయం కోసం పోరాడాలనే విషయాలు అవగాహన పరచడం అవసరం. మెజారిటీ- మైనారిటీ అంటూ ఒకే దేశంలోని ప్రజలు రెండు రకాలుగా రెండు న్యాయవ్యవస్థలను,

రెండు చట్టాలను కలిగి ఉండటం  అసహజం. దేశ ప్రజలందరూ ఒకటే అనే భావన తీసుకొచ్చేందుకు కామన్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చే విషయంలో మద్దతుగా ఉండటం.. వర్గాల వారిగా, మతాలవారీగా పనిగట్టుకొని జనాభాను పెంచుతున్న వారిని అదుపు చేసి జనాభా సమతుల్యం పాటించడం అత్యవసరం. జిహాదీల ముసుగులో చేస్తున్న అరాచకాలు.. ఆడపిల్లల అవహరణ (లవ్ జిహాద్)..

మతమార్పిడులు.. దేవాలయల భూకబ్జాలు.. గోహత్యలు.. తదితర విషయాలపై అవగాహన పరచడంతో పాటు యువతను చైతన్యం చేసి తీరాల్సిందేనన్నారు.

దేశం అభివృద్ధి చెందాలంటే యువత జాగృతం కావాలి. జరుగుతున్న పరిణామాలపై సంపూర్ణ సమాచారం తెలిసి ఉండాలి. రాజ్యాంగంలోని హక్కులు పొందడంతో పాటు, దేశ భద్రతను బాధ్యతగా మసులుకోవడం యువత కర్తవ్యం.

ఇదే సందర్భంగా దేశంలోని అనేక విషయాలను, పూర్వ చరిత్రను అవగాహనపరిచి యువతను జాగృతం చేసేటందుకోసమే బజరంగ్ దళ్  "శౌర్య జాగరణ యాత్ర "  ప్రధాన లక్ష్యం అన్నారు. .

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam