DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీలో విద్యా కానుక తీగ లాగితే ఏపీ లో డొంక కదులుతోంది: నాదెండ్ల

*విద్యా కానుక లో స్కూళ్లల్లో పిల్లలు 35 లక్షలు - ఆర్డర్ 42 లక్షలు*  

*జగనన్న విద్యా కానుక  పేరు మామయ్యదీ... ఖర్చు కేంద్రానిదీ* 

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati )*

*విశాఖ పట్నం/ అమరావతి, నవంబర్ 14, 2023 (డి ఎన్ ఎస్):* ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్తున్న జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి జరిగిందని జనసేన పార్టీ

పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన వికె విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ పాఠశాలలు అయిపోయాయని జగన్ మామయ్య ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటారు. అయితే దానికి ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు.

దీనిపై లెక్కలు అడగాల్సిన భాద్యత బీజేపీదేనన్నారు. 

నవంబరు 14వ తేదీ, నేటి నుంచి ప్రతి రోజూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పాపాలను మీడియా సమక్షంలో ప్రజల ముందు బయటపెడతామని చెప్పామన్నారు. దానిలో భాగంగా మొదటిగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో జరిగిన

భారీ అవినీతి దోపిడీను బయటపెడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. 

ఈ పధకం లో రూ. 120 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు.  పేదల పేరు చెప్పి... విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ అనే మాయ మాటలు చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా కాదన్నారు. పైకి అంతా పారదర్శకం అంటూ ప్రచారం చేసుకొని, లోలోపల మాత్రం వేల

కోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏ శాఖలో చూసినా వేల కోట్ల ప్రజా ధనాన్ని పోటీపడి మరీ  వైసీపీ నాయకులు ఎలా కాజేస్తున్నారో జనసేన లెక్కలు, ఆధారాలతో సహా బయటపెడుతుందని చెప్పారు. 

జగనన్న విద్యా కానుక పేరుతో ఇచ్చే బూట్లు, యూనిఫాం, బ్యాగు తదితర వస్తువులతో కూడిన ఓ కిట్ లో ప్రాథమిక

అంచనా మేరకు రూ.120 కోట్లు స్కామ్ చేశారన్నారు.

ఒక కేసులో యూపీ, ఢిల్లీల్లో ఈడీ దాడులతో తాజాగా ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఈ కేసు విచారణలో బూట్లు, బ్యాగులు సరఫరా  చేస్తున్న 5 కంపెనీలపై ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ పలు చోట్ల దాడులు చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.120 కోట్ల మేర అవకతవకలు గుర్తించారు. దీనిపై కేసు

నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్రలో దాని డొంక కదలింది. ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి వరకు ఆ డొంకలో ఉన్నవారి జాబితా ఈడీ వద్ద ఉందన్నారు. 

ఒక కాలుకి ఒక సైజు, ఇంకో కాలుకు మరోసైజు : 
కమీషన్ల కక్కుర్తితో నాసిరకం సామగ్రిని పిల్లలకు నాసిరకం బూట్లు, చిరిగిపోయిన బ్యాగులు సరఫరా

చేసారన్నారు. ఎడమ కాలుకి మూడో నెంబర్, కుడి కాలుకి అయిదో నెంబర్ బూట్లు ఇచ్చారు. అన్నారు. 
ఇదీ జగన్ చిత్తశుద్ధి అన్నారు. 

• 5 కంపెనీలు... రూ.2400 కోట్లు  :
జగనన్న విద్యాకానుక టెండర్లలో 5 కంపెనీలు మాత్రమే ఎప్పుడూ పాల్గొనేవి. ఈ 5 కంపెనీలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన కంపెనీలు. మొత్తం 4 ఏళ్ల పాలనలో రూ.2400 కోట్ల

టెండర్లను ఈ 5 కంపెనీలు సిండికేట గా మారి కొట్టేశాయి. ఇంకెవరు టెండరు ప్రక్రియలోకి రాకుండా వీరు చూసుకునేవారు. దీనికి ప్రభుత్వం వత్తాసు పలికింది. ఇప్పుడు ఈ కంపెనీలపైనే ఈడీ దాడులు చేసింది. రూ.120 కోట్లు దారి మళ్లినట్లు గుర్తించిందన్నారు .

రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థుల కోసం కొనుగోళ్ల ఆర్డరు ఇచ్చారు.

వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులే. మరి మిగిలిన ఆర్డర్లు ఎవరి కోసం పెట్టినట్లు అనేది ప్రశ్నార్ధకం అన్నారు.  

నాడు-నేడు పథకంలో పాఠశాలల నిర్మాణానికి గాను కేంద్రం రూ.2,500 కోట్లు, నాబార్డు రుణం రూ.1800 కోట్లు, ప్రపంచబ్యాంకు నుంచి రూ.700 కోట్లు, సమగ్ర శిక్ష నుంచి రూ.1000

కోట్లు మొత్తంగా రూ.6 వేల కోట్లు రాష్ట్రానికి అందాయన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఖర్చు చేసింది సున్నా.

- నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి వచ్చిన నిధులు రూ.6 వేలు కోట్లు అయితే... పథకంలో పనులు చేసిన వారికి రూ. 3,850 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి మిగిలిన 2,150 కోట్లు

ఎక్కడికి వెళ్లాయి..? దేనికి దారి మళ్లించారు.  పథకంలో భాగంగా పనులు పూర్తి చేశాం మా బిల్లులు మాకు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు మొత్తుకొంటున్నారు. వారికి రూ.1350 కోట్లు ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. బడ్జెట్ లో మీరు ఇస్తామన్న నిధులు ఏం అయ్యాయి...? అని ప్రశ్నించారు. 

బడ్జెట్ లో దమ్మిడీ కేటాయింపు

లేదు: 
రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకానికి గాను బడ్జెట్ లో చూపించిన నిధుల్లో రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్ కేటాయింపులకు వాస్తవంగా విడుదల చేసిన నిధులకు ఎక్కడా పొంతన కూడా కనిపించడం లేదన్నారు. 

మేం ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం... ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేసారు. 

ఈ సమావేశంలో

పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వివిధ నగరాలూ, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam