DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులకు ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ బ్యాంకు బంపర్ ఆఫర్

*ఎన్ని కోట్లు లోను అయినా వెంటనే ఇచ్చేస్తా: చైర్మన్ ప్రసాద్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 15, 2024 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో బ్రాహ్మణులకు ఏపీ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు సంస్థ చైర్మన్ అమ్మ ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనలో

భాగంగా విశాఖ వచ్చిన ఆయన DNS మీడియా కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఈ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ బ్రాహ్మణులూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు బ్రాహ్మణులకు ఈ ఋణమేళా నిర్వహిస్తున్నామన్నారు. 

తమ బ్యాంకు

కు 75 వేలమంది ఖాతాదారులు ఉన్నారని, అందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎవ్వరి నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాలేదన్నారు. సీనియర్ సిటిజన్లకు అధిక శాతం వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. 

బ్యాంకు లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి వారి అవసరాల మేరకు రూ. 10 వేల నుంచి రూ. 50 కోట్ల వరకూ ఋణాలు కేవలం ఐదు రోజుల్లోగా మంజూరు

చేస్తామన్నారు. బ్రాహ్మణులూ ఒక బృందంగా ఏర్పడి ఇళ్ల స్థలం కొనుక్కోవాలంటే అదే స్థలాన్ని తనఖా పెట్టుకుని 75 శాతం నిధులు ఋణం గా ఇస్తామన్నారు. సభ్యుడు కేవలం 25 శాతం నిధులు ముందస్తుగా కట్టాలన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ సదుపాయం కల్పించామన్నారు.
అదే విధంగా వ్యాపారం

చేసుకునే వారికీ ఋణాలు, బంగారు ఆభరణాల తాకట్టు ఋణాలు, వ్యవసాయ ఋణాలు, ఫిక్సెడ్ డిపాజిట్ లపై ఋణాలు మంజూరు చేస్తామన్నారు. 
తమ సంస్థ నుంచి ఋణ సదుపాయం పొందాలి అనుకునే సభ్యులు వారికి సమీపంలో ఉన్న తమ బ్యాంకు కార్యాలయాన్ని సందర్శించి, మేనేజర్ లేదా అధికారులను కలవాలన్నారు. ముగ్గురు సభ్యులు కలిస్తే వ్యక్తిగత ఋణాలు

ఇస్తామన్నారు. 
తమ బ్యాంకు నుంచి ఋణం పొందాలి అంటే ఇతర బ్యాంకు లు పెట్టె కఠిన నిబంధనలు తరహా రూల్స్ లేవన్నారు. వేసుకున్న చొక్కా ఇస్త్రీ నలగకుండా ఉండే సమయంలోగా ఋణం పొందవచ్చని తెలియచేసారు. 
ఈ సదుపాయం పొందే వారికీ ఉద్యోగం, వ్యాపారం, విద్య, హోమ్ ఫుడ్స్, స్టాల్ కౌంటర్లు, తదితర అన్ని వ్యాపారాలకు ఇవ్వడం

జరుగుతుందన్నారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ లోని బ్రాహ్మణులూ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. 
తమ బ్యాంకు కేంద్ర కార్యాలయం విజయవాడ లోని గొల్లపూడి లో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ తమ శాఖలు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు మీ

సమీపంలోని ఏపీ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ను సందర్శించాలన్నారు. 

త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల తేదీ లోగా ఋణాల కోసం ఎన్ని దరఖాస్తులు వస్తే. . అన్నింటినీ వెంటనే అనుమతిస్తామని తెలిపారు. ఈ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలపరచాలని అమ్మ ప్రసాద్ కోరారు. 
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam