DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షర్మిల చేరికతో కాంగ్రెస్..స్థానిక సెంటిమెంట్ తో వైకాపా, ఇరకాటం లో జివిఎల్

*తార్మార్ తక్కిడమార్ వ్యూహాత్మకంగా మారుతున్న విశాఖ ఎంపీ స్థానం*

*(DNS Report: Ganesh Reddy BVS, Visakhapatnam)*

*విశాఖ పట్నం, జనవరి 15, 2024 (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం .. ఇటీవల కాలం లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న నగరం. ఇన్నాళ్లు రాజధాని అవుతుంది అనే పేరుతొ సంచలనంగా మారిన విశాఖ నేడు ఎంపీ సీటు టికెట్ ల్లో తెరపైకి వస్తోంది.

ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న ఈ లోక్ సభ స్థానం ఎంపిక ఒక్కసారిగా ఆదివారం వ్యూహాత్మకంగా మారింది. గత రెండేళ్లుగా బీజేపీ తరపున టికెట్ ఆశిస్తున్నరాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్శింహారావు చాపక్రింద నేరుగా ప్రచారం చేసుకుంటున్నా. .టికెట్ లభించినా గెలుపు సాధ్యమవుతుందన్న విశ్వాసం పార్టీ క్యాడర్ లోనే కనపడడం లేదు. విశాఖ నగర బీజేపీ

లోనే వీధికో గ్రూప్ ఉండడం ప్రధాన కారణంగా కనపడుతోంది. ఏ ఇద్దరు నాయకుల మాట ఒక్కటి కాకపోవడం ప్రధాన కారణం. గత రెండేళ్లుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పడికి ఆశించిన ఫలితం లభిస్తున్న గ్యారంటీ కనపడడం లేదు. 

షర్మిల గమనంతో గందరగోళం..
 
ఆదివారం జరిగిన రాజకీయ పరిణామం ఫలితం విశాఖ ఎంపీ టికెట్ పై విస్తృతంగా

చూపనుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ని షర్మిల కు ఆ పదవి కట్టబెట్టేందుకు గిడుగు రుద్రరాజు తో ఆ పదవికి రాజీనామా చేయించింది. విశాఖ ప్రాంతం లో వైకాపా ప్రభావం ఎక్కువగా ఉండడంతో దానికి బ్రేక్ వేసేందుకు షర్మిల తో ఈ ప్రాంతంలో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయి. అనిల్ ఇప్పడికే పలు దఫాలుగా క్రైస్తవ ప్రతినిధులతో

చర్చలు జరపడం, కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు పలికించే యత్నాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఓట్లు విస్తృతంగా చీలే అవకాశం ఉంది. 

ఎత్తుకు పై ఎత్తులతో రంగంలోకి వైకాపా: . .
 
సరిగ్గా ఈ అవకాశాన్ని అందిపుచుచుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టనుంది.

ఉత్తరాంధ్రలో రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా పేరున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ ( మాజీ ఎంపీ) ని విశాఖ నుంచి లోక్ సభ కు పోటీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఇదే జరిగితే ఈ ప్రాంతం పై పూర్తి పట్టు ఉన్న బొత్స తన అనుభవాన్ని రంగరించి తిమ్మిని బమ్మి చేసి,  సద్వినియోగం చేసుకుని, విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశం

మెండుగా ఉన్నాయి. దీనికి అతని కి ఉన్న అనుభవంతో పాటు క్రైస్తవ సామాజిక వర్గంతో పాటు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ కి ఓటు వేసే అవకాశం లేదు. తద్వారా ప్రతిపక్షాలపై పూర్తి ఆంక్షలు విధించే అవకాశం ఉంది. 

గతంలో విశాఖ నగరం నుంచి ఎంపీ గా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ఓటమి పాలవ్వడం జగన్

జీర్ణించుకోలేక పోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలకు వదులుకునేందుకు వైకాపా సిద్ధంగా లేదు. 
ఇప్పడికే వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు సిద్ద పడుతున్న .. వై నాట్  విశాఖ ఎంపీ అనే వాదం కూడా జోడించినట్టు తెలుస్తోంది. 

అవకాశాలను చేజార్చుకుంటున్న

బీజేపీ:

కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ఆంధ్ర లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే స్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పూర్తి అనుమతులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన అనుయాయులు జి వి ఎల్ నర్శింహారావు ను విశాఖ పంపారు. అయితే ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త అయినా జివిఎల్ గత రెండేళ్లుగా అన్ని వర్గాలనూ కలుపుకుంటూ

వెళ్లడంలో కొన్ని తప్పటడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 
ప్రధానంగా స్థానిక బీజేపీ నాయకులూ, క్యాడర్ ఏమాత్రం సహకరించక పోవడం ప్రధాన కారణం. కేవలం ఒకరిద్దరికి ప్రాధాన్యత ఇవ్వడం, పైగా ఇతరులను ఏమాత్రం పట్టించుకునే ప్రయత్నం కూడా చెయ్యక పోవడం పూర్తిగా మైనస్. ప్రజల్లో బీజేపీ పట్ల, ప్రధాని మోడీ పట్ల అభిమానం ఉన్నా. .

.దాన్ని ఓట్లు గా మలచుకోవడం లో జివిఎల్ ఘోరంగా విఫలం అవుతున్నారన్నది అందరికి తెలిసిన నిజం. 

బీజేపీ ప్రధాన లోపాలు :

1 .విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొరకరాని కొయ్యగా మారడం, 
2 . ఐదేళ్ల తర్వాత కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో కూడా తెలియక పోవడం, 
3 .కేంద్రం అమలు చేస్తున్న

సంక్షేమ పథకాల గురించి బీజేపీ పార్టీ నాయకులకే సరిగ్గా తెలియక పోవడం.
4 .అభ్యర్థి స్థానికులకు అందుబాటులో లేకపోవడం, కేవలం ఒకరిద్దరికి అందుబాటులో ఉండడం..
5 .కార్యాచరణ తక్కువ -  ప్రచారం ఎక్కువ అనే విమర్శలు ఎక్కువగా రావడం,   
6 .ఆర్భాటం చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వడం. అయన కోసం పనిచేసేవారిని దూరం పెట్టడం   
7 .

వైకాపా ప్రభుత్వానికి అభిమాన పాత్రునిగా ఉన్నారు అనే అభియోగాన్ని నేటికీ వివరణ ఇవ్వడక పోవడం.
8 . సీనియర్లు సైతం వీరి నాయకత్వాన్ని అంగీకరించక పోవడం.
9 . నియోజక వర్గం ellalu, సరిహద్దులు తెలియక పోవడం..
10 . అన్నింటికి మించి సన్తరం భోజనం, మఠం నిద్ర అనే నానుడి ని నిజం చేస్తూ ఇల్లు విశాఖ లోనే ఉంది అని చెప్తూ. .నియోజక వర్గం నోడల్

గా వారణాశి ని ఎంచుకోవడం 

ఇన్ని విమర్శలకు సరైన వివరణ ఇవ్వగలిగితే తగినన్ని ఓట్లు పడే అవకాశం ఉంటుంది.

వైకాపా మైనస్ :

1 . అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి మెడలు వంచేసి రావడం.
2 . గత ఐదేళ్లుగా సిట్టింగ్ ఎంపీ గా ఉన్న వ్యక్తి విశాఖ నగరానికి తెచ్చిన నిధులు ఏంటో

తెలియక పోవడం
3 . నియోజక వర్గం పై శ్రద్ధ కంటే వ్యాపార అభివృద్ధి పైనే దృష్టి పెట్టడం.
4 . కేంద్రం ఇచ్చిన నిధులతో నడిచే పథకాలపై వైకాపా బొమ్మ వేసుకోవడం 
5 . స్థానిక నాయకత్వం పై జనానికి నమ్మకం లేకపోవడం. 
6 . ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చెయ్యడం పోవడం. .
7 . కేంద్ర పరిశ్రమలు కోసం అడగవలసిన నిధులకు బదులుగా, జీతాల కోసం

అప్పులు చెయ్యడం 
8 . రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రతిపక్షాలను తిట్టడం పైనే ఎక్కువ సమయం వెచ్చించడం 
9 . ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టడం.  .

ఇలా ఎన్నో అంశాలపై సమాధానం చెప్పవలసిన ఎంపీ, ఎక్కడా ప్రజలకు కనపడక పోవడం పై వ్యతిరేకత ఉంది. 

కాంగ్రెస్ అంతా మైనస్సే. .:  
 
దాదాపుగా ఏడు దశాబ్దాలు

అధికారం ఇచ్చినా. .ఆంధ్ర కు ఘోరమైన అన్యాయం చేసిన పాపం మూటగట్టుకుని, పూర్తిగా వెంటిలేటర్ పైకి చేరిన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం వైఎస్ షర్మిల అధ్యక్ష పగ్గాలు చేపడితే. .వైఎస్ ప్రభావం తో కొంత ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం ఉంది. విశాఖ ప్రాంతంలో వైఎస్ కు అభిమానులు అధికంగా ఉండడంతో విశాఖ ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేసే అవకాశం

కూడా లేకపోలేదు. 
   
టీడీపీ - జనసేన పై స్తబ్దత:

రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి కి కొంత ప్రజాబలం ఉన్నప్పడికి బీజేపీ తో జత కడుతుందేమో అనే సంకేతాలు రావడంతో వీళ్ళ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉంటారో తెలియాల్సి ఉంది. ee రెండు పార్టీల నుంచి ఒకరు పోటీలో ఉంటె. .మిగిలిన పార్టీలకు చుక్కలు

కనిపించే అవకాశం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam