DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టార్గెట్ 370 లక్ష్యం కోసం బీజేపీ సర్కస్ ఫీట్లు - తెరపైకి జ్ఞాన్, సూర్య ఘర్

*నిన్న రామ మందిరం, నేడు జ్ఞానవాపి, రేపు మధుర..దిశగా..* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2024: (డిఎన్ఎస్):* భారత దేశ ప్రతిష్టను విశ్వవిఖ్యాతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న కాలంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు టార్గెట్ 370 లక్ష్యంగా మిషన్ జ్ఞాన్, సూర్య ఘర్ స్కీం లను

ప్రవేశపెట్టారు. 
దేశంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందేందుకు గరీబ్ - పేదలు, యూత్ - యువత, అన్నదాత - రైతులు, నారీ - మహిళలకు ఉపయుక్త పథకాలను అమలు చేస్తున్నారు. సుమారు 200 కి పైగా పథకాలతో ప్రజా సంక్షేమాన్ని అందిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. దేశంలో ప్రధాన భాగస్వామ్యం

కల్గిన ప్రజలు ఈ నాలుగు వర్గాల్లోకి వస్తారని, తద్వారా వీరికి మరిన్ని సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామా స్థాయిల్లో పల్లె నిద్రలు, ప్రజలతో ముఖాముఖిలు, ఇల్లిల్లు పర్యటనలు గృహ భోజనం, తదితర కార్యక్రమాలను వికసిత భారత్ పేరిట విస్తృతం చేశారు. ఈ సమయంలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ., .

పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. ప్రధానంగా 18 ఏళ్ళ వయసు దాటినా యువత తోను, అన్నదాతలు, మహిళలతోను చర్చలు, సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు చేపట్టారు. ప్రతి నియోజక వర్గానికి ఇంచార్జిలు, కేంద్ర కమిటీ ప్రతినిధులు సైతం గ్రామాల్లో పర్యటిస్తుండడం మంచి ఫలితాలను అందిస్తుంది అనే నమ్మకం తో బీజేపీ నేతలు

ఉన్నారు. 

దేశ వ్యాప్తంగా ఆరోగ్య అభియాన్ ద్వారా ఆరోగ్యం, పేదలకు ఉచిత బియ్యం, భారత్ రైస్, కు తోడుగా సోలార్ కనెక్షన్స్ ద్వారా 300 వాట్ల విద్యుత్ లోడ్ వరకూ 60 శాతం రాయితీ కూడా అందిస్తున్నారు. తద్వారా వేలకు వేలుగా వస్తున్నా విధ్యుత్ బిల్లుల నుంచి విముక్తి కల్గించే విధంగా కోటి ఇళ్లకు పైగా సోలార్ విద్యుత్

కనెక్షన్లు ఇచ్చేందుకు రాయితీలు ఇస్తున్నారు. రూ. 78000 /-  వరకూ రాయితీ లభించనుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న కోటి మందికి ఈ పథకం అమలు చేయనున్నారు. తద్వారా ఈ కనెక్షన్ పొందిన వారికీ విద్యుత్ బిల్లులు ఉండవు. పైగా మిగులు విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. 
ఇప్పడికే పలు సార్లు విద్యుత్ చార్జీల పెంపు తో విసిగి

పోయిన ప్రజలకు సూర్య ఘర్ స్కీం ఒక ఔషధం అని చెప్పవచ్చు. గతం లో ఈ రాయితీ కేవలం 40 శాతం మాత్రమే ఉండేది. మరో 20 శాతం అదనంగా పెంచడం ఇప్పడికే 60 వేలమందికి పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 

ఇప్పడికి బీజేపీ సొంతంగా 303 లోక్ సభ సీట్లు సాధించిన దశ నుంచి 370 సీట్లు సొంతంగా సాధించేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధం చేసి, అమలు

చేస్తున్నారు. దీనిలో భాగాంగేన్ మార్చి 1 న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. స్థానిక ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ మైదానంలో బహిరంగ సభ లో పాల్గొనున్నారు. ఇప్పడికే కేంద్రమంత్రులు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కోట్లాది హిందువుల మనోవాంఛ అయోధ్యలో

రామజన్మభూమిలో మందిర నిర్మాణం న్యాయపరంగా పరిపూర్ణం చేసిన  నరేంద్ర మోడీ, తన తదుపరి టార్గెట్ కాశి లోని జ్ఞానవాపి మందిరం, ఆపై మధుర కృష్ణ జన్మభూమి ల్లో ఆలయ నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా  చేసుకున్నారు. అయితే ఇంత క్లిష్టమైన కార్యక్రమాలను చేసినా ఆశించిన స్థాయిలో హిందువుల్లో బీజేపీ పట్ల కృతజ్ఞతా లేకపోవడం

గమనార్హం. 

ఎన్ని సర్కస్ ఫీట్లు చేసి అయినా సరే 370 లోక్ సభ సిట్లు సొంతంగా సాధించేందుకు బీజేపీ కుస్తీ పడుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam