DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రం లో కింగ్ అయినా..  ఏపీ లో దేవులాడుతున్న బీజేపీ 

పచ్చ చొక్కా వేసిన కోవర్టులు చేసిన కక్ష సాధింపే: బీజేపీ కార్యకర్తలు  

*(DNS Report: ఇదీ రాజకీయం, Ganesh Reddy BVS)*

విశాఖపట్నం, మార్చి 24 , 2024 : (డి ఎన్ ఎస్):* దేశం మొత్తం లో కింగ్ లా నిలబడి చక్రం త్రిప్పుతున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర లో పూర్తిగా దేవులాడుతోంది. ఊరందరికీ రాజైనా. ఆంధ్ర లో మాత్రం అడుక్కుతినే స్థితికి

బీజేపీ ని చేర్చేసారు. ఇది సగటు బీజేపీ కార్యకర్తల ఆవేదన వ్యక్తం అవుతోంది. పొత్తు పేరుతొ తెలుగుదేశం పార్టీ కోవర్టులు బీజేపీ ని పూర్తిగా భూస్థాపితం చేసేశారని మండిపడుతున్నారు. ఆంధ్ర లో అంతంత మాత్రం గా ఉన్న బీజేపీ కి ఊపిరి పోసిన నాయకులకు ఈ పర్యాయం ఎన్నికల్లో కనీసం టికెట్ ఇవ్వకుండా టీడీపీ అడ్డదిడ్డంగా గేమ్ ఆడిందని,

దానికి బీజేపీ లో దుష్ట శక్తులు కూడా సాయం చేశాయన్నారు. గత పదేళ్ల కాలంలో కొంతవరకూ బీజేపీ క్యాడర్ బలపడిందని, పార్టీ సభ్యత్వం కూడా భారీ సంఖ్యలో చేరిందన్నారు. విశాఖ పట్నం వంటి ప్రధాన నగరాల్లో పార్టీకి మంచి ప్రజాబలం పెరిగినా టికెట్ రాకుండా దుష్టశక్తులు అడ్డుకున్నాయన్నారు. 
పార్టీకి ఏమాత్రం క్యాడర్ కూడా లేని అరకు,

అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ వెస్ట్, వంటి సీట్లు కేటాయిస్తే కచ్చితంగా ఓడిపోతారన్నారు. 
తమ పార్టీ కి కేవలం జనసేనతోనే పొత్తు ఉందని, కుట్ర పూరితమైన ప్రణాళికతో టీడీపీ కూడా చేసిందన్నారు. అటు జనసేనకు, ఇటు బీజేపీ కి కూడా ఈ పొత్తు వాళ్ళ అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత అభ్యర్థులతో ఎన్నికలకు వెళితే కచ్చితంగా ఓటమి

పాలవ్వడం ఖాయమన్నారు. టీడీపీ కుట్ర పూరిత చర్యకారణంగా  ఓటు బదలాయింపు పూర్తిగా జరిగే అవకాశం లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగా వెళ్లినా, గెలుపు , ఓటములతో ప్రమేయం లేకుండా తమ అభ్యర్థుల కోసం పనిచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉందన్నారు. 

ప్రధానంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం, దేశవ్యాప్తంగా సెంటిమెంట్ గా మారిందని,

తమకు ఎమ్మెల్యే స్థాయిలో ఎలా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం భారీ ఓట్లు పడే అవకాశం ఉందన్నారు. విశాఖ కేంద్రంగా తూర్పు దక్షిణ కోస్త రైల్వే జోన్ అతి త్వరలోనే కార్యరూపం దాలుస్తున్న తరుణంలో విశాఖ లోక్ సభ స్థానం టీడీపీ కి ఇవ్వడం క్యాడర్ ను నిరాశకు లోను చేసిందన్నారు. 

పార్టీ కోసం శ్రమించిన నాయకులూ,

కార్యకర్తలను పూర్తిగా ప్రక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ పెద్ద పీట  వేసి టికెట్లు కేటాయించడం నమ్మకం పై వేటు వెయ్యడమేనన్నారు. 

నాలుగు దశాబ్దాల నుంచి పార్టీ జండాలు మోసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను టీడీపీ మాటలు విని అగ్రనాయకత్వం నట్టేట ముంచిందని బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతున్నారు.
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam