DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో బీజేపీ కి కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా?: క్యాడర్

*పొత్తుల ఓట్లు పడకపోతే రాష్ట్ర కమిటీదే భాద్యత: బీజేపీ క్యాడర్*

*(DNS Report: ఇదీ రాజకీయం, Ganesh Reddy BVS)*

విశాఖపట్నం, మార్చి 25 , 2024 : (డి ఎన్ ఎస్):* ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు అనేవి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి పెద్ద బ్రహ్మ ప్రళయం గా మారిందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీలతో పెట్టుకున్న పొత్తు అగమ్యగోచరం గా తయారయ్యిందని తెలిపారు. సీట్ల సర్దుబాటు లోనే రాష్ట్ర కమిటీ పెద్దలు  పెద్ద కిరికిరి చేశారు. గెలిచే అభ్యర్థులకు, పార్టీకోసం ప్రజల్లో కష్టపడుతున్న అభ్యర్థులకు టికెట్లు రాకుండా బీజేపీ నేతలే కుట్రలు చేసారు. వాళ్ల సామాజిక వర్గం లోని వారికే మాత్రమే దక్కేలా

రాష్ట్ర కమిటీ త్రిప్పిన చక్రం తో బీజేపీ మొత్తం గల్లంతు అయ్యే స్థితికి చేరుకుంది. 
గత మూడేళ్ళుగా పార్టీకోసం పనిచేస్తున్న జివిఎల్ నరసింహారావు కు విశాఖపట్నం లోక్ సభ సీటు రాకుండా ఆ సామాజిక వర్గం బీజేపీ అధిష్టానం పై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపులో సీటు దక్కిన

అభ్యర్థులకు ఆ నియోజక వర్గాలతో ఏమాత్రం సంబంధం లేదు. పైగా స్థానిక క్యాడర్ ముఖపరిచయమే లేదు. 
  
సాక్షాత్తు ఏపీ అధ్యక్షురాలు పుంరంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆమెకు గోదావరి జిల్లాలోని పార్టీ క్యాడర్ గానీ, సామాజిక వర్గాల ప్రతినిధులు గానీ, నియోజక వర్గం ఎల్లలు గానీ పరిచయం లేదు. కేవలం 45 రోజుల్లో 7

నియోజక వర్గాల్లో పర్యటించి, ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు తెచ్చుకోవడం అంత సులభం కాదు. 

అనకాపల్లి పరిస్థితి అత్యంత దయనీయం.

ఈ లోక్ సభ స్థానాన్ని బీజేపీ సీఎం రమేష్ కు కేటాయించింది. ఈ ప్రాంతానికి ఇతను పూర్తిగా కొత్త. ఎవ్వరూ పరిచయం లేదు. కనీసం పార్టీ క్యాడర్ కి కూడా పెద్దగా రమేష్ తెలియదు. పైగా ఇతనికి

నియోజకవర్గం పేర్లు కూడా తెలియదు. పెద్ద వక్త కూడా కాదు, కేవలం ఆర్ధికంగా మాత్రమే రమేష్ బలంగా ఉన్నారు. పార్టీ కి కూడా ఇతను కొత్తే. కనిసం రాష్ట్ర కమిటీ లో కూడా ఇతని గురించి తెలియదు 

రాజంపేట లో కిరణ్ కు చుక్కెదురే. .

రాజంపేట లోక్ సభ సీటు ను ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి కి

కేటాయించారు. దాదాపు 10 ఏళ్ళు కాలం కనుమరుగైపోయింది కిరణ్ హఠాత్తుగా బీజేపీ లో చేరారు. రాజంపేట లో ఇతని గురించే తెలిసే అవకాశం 

పట్టున్న జివిఎల్ పనికిరాలేదు. 

గత మూడేళ్ళుగా విశాఖ కేంద్రంగా సొంత ఇల్లు ఏర్పరుచుకుని, విశాఖలోనే పర్యటించి, పార్టీని బలోపేతం చేసిన జి వి ఎల్ నరసింహారావు ను కనీసం పరిగణలోకి

తీసుకోక పోవడం గమనార్హం. పార్టీకి ఏమాత్రం పట్టు లేని విశాఖ లో భారీ క్యాడర్ ను, అభిమానులను తయారు చేసిన ఘనత జివిఎల్ దే. ఇతనికి టికెట్ రాకుండా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం విశ్వ ప్రయత్నం చేసి, సఫలీకృతం అయ్యింది. వాళ్లకి తెలియని విషయం ఏంటంటే. .విశాఖ నుంచి జివిఎల్ ఎన్నికల బరిలో నిలబడితే. .కచ్చితంగా గెలిచే స్థానం ఇది. ఈయన తప్ప

మరొకరు పోటీలో నిలబడినా గెలుపు అంత సులభం కాబోదు. 

జివిఎల్ కు టికెట్ధి రాకుండా పార్టీ రాష్ట్ర కమిటీ తమ సర్వ శక్తులూ అడ్డుకున్నాయి. దీనికి తగిన ఫలితం మొత్తం బీజేపీ అనుభవించనుంది. 

పూర్తి భాద్యత రాష్ట్ర కమిటీదే. . .

బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా బీజేపీ రాష్ట్ర కమిటీ కి లేదుగానీ,

గెలుపు గుర్రాలకు టికెట్లు రాకుండా చెయ్యడం లో మాత్రం దిట్ట. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరు ఓడినా, కనిసం డిపాజిట్లు రాకపోయినా పూర్తి భాద్యత రాష్ట్ర బీజేపీ కి కమిటీదే. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam