DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ టీం లో మహిళలు .. మామూలోళ్లు కాదు మహా శక్తులే.

*కేరళలో, బెంగాల్ లో గూండాగిరి పై పోరాడిన వాళ్ళకి ఎంపీ టికెట్లు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, మార్చి 27 , 2024 : (డి ఎన్ ఎస్):* భారత్ ను విశ్వ గురు స్థానంలో నిలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఏడాది మరింత బలోపేతం అవుతున్నారు. ఈ పర్యాయం లోక్ సభ ఎన్నికల బరిలో సామాన్యులు, పోరాట పటిమ కల

మహిళా శక్తిని మోడీ తన టీమ్ లోకి ఎంపిక చేసారు. రానున్న లోక్ సభలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం, ఆమోదం చేయడం కూడా జరుగనుంది. ప్రధానంగా కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ ల గూండాగిరి శృతిమించిన కేరళ, పశ్చిమ బెంగాల్ ల్లో వాళ్ళని సమర్ధవంతంగా ఎదుర్కొన్న సామాన్య మహిళలకు లోక్ సభ టికెట్లను కేటాయించారు. మొత్తం 66 mandi మహిళలకు ఈ

పర్యాయం బీజో టికెట్లు కేటాయించింది. 

కేరళలో ప్రొఫెసర్ జె. సరసు (అళత్తూర్), ఎం ఎల్ అశ్విని (కేసర్ గోడ్), బెంగాల్ లో రేఖ పాత్ర, రాజమాత అమృత నాడియా (కృష్ణ నగర్),  హైద్రాబాద్ లో డా. కొంపల్లె మాధవి లత, గోవాలో మొట్టమొదట సారిగా పల్లవి డెంపో, హిమాచల్ ప్రదేశ్ నుంచి నటి కంగనా రణావత్ లను ఎంపిక చేసి మరీ లోక్ సభ టికెట్లను

కేటాయించారు. వీరు ఒక్కొక్కరూ ఒక మహాశక్తి గా పరిణమించారు. 

వీరిలో ప్రొఫెసర్ జె. సరసు కేరళలోని పాలక్కాడ్ లో ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉండగా కొందరు ఎస్ ఎఫ్ ఐ ( కమ్యూనిస్ట్ విభాగం ) విద్యార్థులు చేస్తున్న గూండాగిరి ని అడ్డుకున్నందుకు ఆమెకు కళాశాల ప్రిన్సిపాల్ రూమ్ ఎదురుగా సమాధి కట్టారు. దీనిపై ఆమె

కోర్టు లో కేసు వేసి ధైర్యంగా వాళ్ళ గుండాగిరిని ఎదుర్కొన్నారు. 

రేఖ పాత్ర బెంగాల్ లోని అత్యంత భయంకర దుర్ఘటనలు బయటకు తీసి దేశ వ్యాప్తంగా సంచలనం చేసిన యువతి.

మాధవి లత. . భాగ్యనగరం లోని విరించి ఆసుపత్రి చైర్మన్, ఓల్డ్ సిటీ లో ఒవైసీ ల ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న మహిళా. ఈ

స్థానంలో పురుషులు సైతం పోటీ చెయ్యడానికి భయపడుతుంటారు.  

అమృత నాడియా పశ్చిమ బెంగాల్ లోని రాజవంశీకులు. కృష్ణ నగర్ నుంచి బరిలో ఉన్నారు. 
 
ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శ నుంచి మోడీ ఒక మహత్తర ఔషధాన్ని బయటకు తీస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ మహా శక్తి ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా

ఈ మహిళా శక్తులను బరిలో నిలబెడుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam