DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల్లకల్లోలం చేస్తున్న అనపర్తి సీటు, బీజేపీ అగ్రనేత అమ్ముడుపోయారా?

*ఒకరి కాసుల కక్కూర్టీ, పురంధేశ్వరి ఎంపీ సీటు ఓట్ల కే టెండర్ పెట్టింది* 

*(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 27, 2024: (డి ఎన్ ఎస్):* పొత్తుల్లో సంయమనం పాటించవలసిన పార్టీలు గతి తప్పితే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అనపర్తి నియోజక వర్గం విషయం లో. ఈ సీటు కోసం బీజేపీ అగ్రనేత ఒకరు

అమ్ముడు పోయినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. 

తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ కి  కేటాయించారు. అయితే అక్కడ బీజేపీ కి కనీసం జండా మోసే కార్యకర్త కూడా లేదు. దీంతో ఒక అతి సామాన్య వ్యక్తి ములగపాటి శివరామకృష్ణoరాజు ని ఎంపిక చేశారు. ఇతను

బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు. పార్టీలో ఇతనికి పెద్దగా గుర్తింపు లేదు. క్యాడర్ బలం లేదు. ఇలాంటి ఏకాకి అయినా వ్యక్తిని అత్యంత బలవంతుడైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎం ఎల్ ఏ ఎస్ సూర్య నారాయణ రెడ్డి పై పోటీకి నిలిపింది బీజేపీ. కనీసం డిపాజిట్ కాదు కదా. . వీళ్ళ ఊళ్ళో ఓట్లు కూడా ఇతనికి

పడే అవకాశమే లేదు. 

రాజమండ్రి ఎంపీ కి అనపర్తి అసెంబ్లీ యే కీలకం:

ఈ అనపర్తి నియోజక వర్గం రాజమండ్రి ఎంపీ పరిధిలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ మెజారిటీ వచ్చిన పార్టీ ఎంపీ సీటు గెలుస్తూ వస్తోంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్, మురళి మోహన్, మార్గాన్ని భారత్ తదితరులు ఇలా గెలిచినా వారే. కనీసం 50 వేల మెజారిటీ వచ్చే

అవకాశం ఉంది. 
 నేడు రాజమండ్రి ఎంపీ సీటు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి  పురంధేశ్వరి పోటీ లో ఉన్నారు. అయితే అనపర్తి లో బలహీన అభ్యర్థి ఉంటె కచ్చితంగా ఆమెకూడా ఓడిపోయే ఛాన్స్ అధికంగానే ఉంది. ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీలో పెడితే తాము గెలిపించుకుంటామని స్థానిక టీడీపీ ఇంచార్జి నల్లమిల్లి రామకృష్ణ

రెడ్డి తెలియచేస్తున్నారు. 
 
ఈ టికెట్ కోసం బీజేపీ నేత లావాదేవీలు చేశారా?

బీజేపీ లో కీలకమైన నేత ఒకరు అనపర్తి టికెట్ బీజేపీ కి మాత్రమే వచ్చేలా ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేసినట్టు అనపర్తి లో హోరెత్తిపోతోంది. ఈ లావాదేవీలు కోట్లలోనే జరిగినట్టు ప్రచారం లో ఉంది. బలమైన అభ్యర్థి ఉంటె సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే

ఛాన్స్ లేకపోవడంతో అత్యంత బలహీనమైన వ్యక్తిని బరిలో నిలిపేందుకు ఈ లావాదేవీలు జరిగినట్టు ప్రత్యర్థి పార్టీ నేతలే అభిప్రాయం పడుతున్నారు. 

గత దశాబ్దాల కాలంగా ఈ అనపర్తి తెలుగుదేశం కు కంచుకోటగా ఉంది. నేడు నల్లమిల్లి కి కేటాయిస్తే సిట్టింగ్ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతు అయ్యే స్థితి ఉంది. ఎట్టిపరిస్తితుల్లోనూ

టికెట్ టీడీపీ కి రాకూడదు అనే లక్ష్యంతో జరిగిన లావాదేవీల్లో నల్లమిల్లి బలిపశువు అయ్యారని క్యాడర్ మండిపడుతున్నారు. ప్రస్తుతం  నల్లమిల్లి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. పొత్తుల కోసం టికెట్ త్యాగం చేసినా. . అభ్యర్థి బలహీనం  కావడంతో క్యాడర్ మండిపడుతున్నారు.  
  
సుమారు 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్న

అనపర్తి లో టీడీపీ కి నికరంగా 1.20 లక్షలు పడే అవకాశం ఉంది. గత కొంత కాలంగా అక్రమ కేసులు, భౌతిక దాడులు ఎదుర్కొని, కార్యకర్తలకు అండగా నిలబడిna నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి వేలాది మంది కార్యకర్తలు సైతం అధికార పార్టీ నుంచి టీడీపీ లోకి రావడం జరిగింది. ఇతని ఇంటి దగ్గర ఉండే కార్యకర్తల సంఖ్యా మొత్తం బీజేపీ

సభ్యుల కంటే ఎక్కువ  ఉంటుంది. 
పొత్తుల్లో బీజేపీ నేత చేసిన కుట్ర కారణంగా అనపర్తి అసెంబ్లీ సీటు తో పాటు, రాజమండ్రి లోక్ సభ సీటు కూడా గల్లంతు అయ్యే పరిస్థితి వచ్చేసింది అని ఉమ్మడి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బుధవారం రాత్రి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి కార్యాలయం లో జరిగిన అంతర్గత సమావేశంలో

కార్యకర్తల ఆవేదనను చల్లబరిచే ప్రయత్నం చేసారు. అయినా ససేమిరా అనడంతో గురువారం నిర్ణయం తీసుకుందాం అని తెలిపారు.   

ఇప్పడికైనా పుంరంధేశ్వరి కోలుకుని అనపర్తి లో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకుంటే. . . . .ఈ అనపర్తి అభ్యర్థి అతని ఇంటికే వెళ్లడమే కాకుండా  .. పురంధేశ్వరి ని కూడా ఇంటికి పంపేసే అవకాశం ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam