DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సొంత అభ్యర్ధులని నిలబెడతాం, పార్టీల ఓట్లు చీలుస్తాం: బ్రాహ్మణ సంఘాలు 

ఏపీలో పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు బ్రాహ్మణ సంఘాలు పిలుపు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 08, 2024 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నా ఎన్నికల్లో బ్రాహ్మణులను గుర్తించని రాజకీయ పార్టీలకు గట్టిగా గుణపాఠం చెప్తామని పలు బ్రాహ్మణా సంఘాలు తీర్మానించాయి. రాష్ట్రం లో 5

శాతం ఉన్న బ్రాహ్మణులకు ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం తో  ఉన్నాయి. తాము స్వతంత్ర అభ్యర్థులను బరిలో నిలబెడతామని, పార్టీల ఓట్లు చీలుస్తామని హెచ్చరించారు. తద్వారా తమ బ్రాహ్మణ ఓటు బ్యాంకు కళ్ళు మూసుకుపోయిన అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాయి. 

దీనికి

తగినట్టుగా ప్రచారం కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సంఘాలను సంఘటితం చేస్తూ ఒకే త్రాటిపైకి తీసుకువస్తున్న రాష్ట్రీయ విప్ర వారధి కొత్త పిలుపు కు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ చైర్మన్, విశ్రాంత అధ్యాపకులు నూకల సూర్య ప్రకాష్ ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 

తమకు విలువ ఇవ్వని వారిని

క్షమించే ప్రసక్తే లేదని, కచ్చితంగా ఈ సారి ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి తాము ఓటు వెయ్యం అని, తాము సొంతంగా అభ్యర్థులను నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమ అభ్యర్థులు లేనిచోట్ల కేవలం నోటాకు మాత్రమే ఓటు వెయ్యాలని అన్ని సంఘాల వారికి సందేశాన్ని పంపుతున్నారు. 

అన్ని బ్రాహ్మణా శాఖల సంఘాలను

కలుపుకుంటూ ఒక ఐక్య వేదికగా రాష్ట్రీయ విప్ర వారధి ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా కార్యాచరణ మొదలయ్యింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరింపచేయనున్నారు. 

నూకల సూర్య ప్రకాష్ గత దశాబ్ద కాలంగా విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్ర స్థాయి నుంచి సంఘటితం చేస్తున్నారు. విశాఖ లోక్ సభ

స్థానం పరిధిలో సుమారు 2.80 లక్షల మంది బ్రాహ్మణా ఓటర్లు ఉన్నారని, వీరిని చైతన్య పరిచే విధంగా వార్డు స్థాయిల్లో అవగాహనా సదస్సులు పెడుతున్నట్టు అయన వివరించారు.    

విశాఖ లోక్ సభ స్థానం గెలుపు ను నిర్దేశించే స్థాయిలో ఓటర్లు ఉన్నప్పడికి ఈ స్థానాన్ని బ్రాహ్మణులకు కేటాయించలేదని మండిపడ్డారు. అధికార వైఎస్సార్

కాంగ్రెస్ తరపున ఒకే ఒక్కడు కోన రఘుపతి కి బాపట్ల సీటును మాత్రమే ఇచ్చిందన్నారు. ఈ స్థానంలో ఈయన్ని గెలిపించుకుంటామన్నారు.  
ఇక ఉమ్మడి కూటమి లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు బ్రాహ్మణులను కనీసం ఓటర్లు గా కూడా గుర్తించలేదని, తీరవు అవమానం చేశారన్నారు. వీరికి తమ శక్తి ఏంటో తెలియచేస్తామన్నారు.  

   

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో జనాభా ప్రాతిపదికన బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతి పార్టీ 10 సీట్లు కేటాయించాలి. రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపులో చూపుతున్న ఈ చిన్న చూపు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల వివక్షతగా పేర్కొనవచ్చు. 
    రాజకీయ రంగంలో మన గళాన్ని వినిపించడానికి ఓటు ఉన్న ప్రతి ఒక్క

బ్రాహ్మణుడు తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకుని, బరిలో ఉన్న బ్రాహ్మణ అభ్యర్ధికి ఓటు వెయ్యాలని, లేనిచోట్ల నోటాకు ఓటు  వేసే విధంగా అవగాహనా పెంచుతున్నామన్నారు. 
     ఈ చర్య రాజకీయాలలో బ్రాహ్మణ సామాజిక వర్గ ఉనికిని కాపాడుకోవడానికి, పటిష్టపరుచుకోవడానికి, ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి తక్షణ అవసరం

అన్నారు. .
    అన్ని పార్టీలు పునరాలోచన చెయ్యాలని, బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 
   ఇదే తీరు కొనసాగితే పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

రాష్ట్రీయ విప్ర వారధి పరిధిలో 62 కి పైగా బ్రాహ్మణ ఉప శాఖల ప్రతినిధులు కొనసాగుతున్నారు. వీరిలో

పాత్రికీయులు, టీచర్లు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అర్చకులు, పురోహితులు, సహా అన్ని వర్గాల ప్రతినిధులు ఉన్నారు. వీళ్లంతా క్షేత్ర స్థాయిలో బ్రాహ్మణ కుటుంబాలను చైతన్య పరుస్తున్నారు. ఎన్నికల సమయానికి మొత్తం బ్రాహ్మణ సమాజం ఒకే త్రాటిపైకి రావడం ఖాయంగా కనపడుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam