DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కీమ్స్ ప్రచారం చేతగాని ఏపీ బీజేపీ, మోదీని దోషిగా నిలిపింది

*పదేళ్లలో బీజేపీ మోడీ పాలనలో ఏపీకి ఇచ్చిన నిధులు ఇవే*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 18, 2024 (డి ఎన్ ఎస్):* గత పదేళ్ల మోడీ - బీజేపీ పాలనా లో లక్షల కోట్ల విలువ చేసే నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర బీజేపీ ఇచ్చినా వాటిని ప్రచారం చేసుకోవడంలో చేవచచ్చిన  ఏపీ బీజేపీ ఘోరంగా

చేతులెత్తేసింది. దాని ఫలితమే రాష్ట్రంలో ప్రజల ముందు నరేంద్ర మోడీని, బీజేపీ ని దోషిగా నిలిపింది. 

అయితే వాస్తవాలు ఏంటి? 

అసలు ఏపీ విభజన జరిగింది ఎందుకు? విభజన చట్టం లో ఉన్న అంశాలేమిటి? కేంద్రం లో అధికారంలో గల భారతీయ జనతా పార్టీ సారథ్యం లోని ప్రభుత్వం చేసిన సాయమేమిటి? పనిగట్టు కుని కొం దరు

నాయకులు ప్రజలలో కల్పిస్తు న్న అపోహలను తొలగింప చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ప్రయత్నమే ఈ శ్వేతపత్రం విడుదల.

1 . రాష్ట్ర విభజనే అడ్డగోలు: 

2014 లో కాంగ్రెస్ పాలనా లోని యుపిఎ ప్రభుత్వం అడ్డగోలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చేసి, సభలో ఇచ్చిన హామీలను విభజన చట్టంలో పెట్టక పోవడం కాంగ్రెస్

చిత్తశుద్ధికి నిదర్శనం. 

యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెం ట్ తలుపులు మూసేసి, సెషన్స్ లైవ్ కవరేజిని నిలుపుదల చేసి మరీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ను కేంద్రం పాస్ చేయిం చుకుంది. ఈ బిల్లు లో లోపాలను, ఇంకా పొందుపర్చాల్సిన అంశాలపై నాటి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ పెద్ద లు పలువురు నిలదీశారు. ప్రత్యేక హోదా

అంశాన్ని నాటి ప్రభుత్వం దాన్ని నోటిమాటగా అంగీకరించి నట్టు చెప్పిం ది తప్ప చట్టం లో పొందుపర్చలేదు.

ఇదీ వాస్తవం:  
వాస్త వానికి రాజధాని అమరావతి నిర్మాణానికి ఇతోధిక ఆర్థిక సహాయం చేయడంతో పాటు, రాష్ట్ర పునర్విభజన చట్టం -2014లో పేర్కొన్న అనేక అంశాలను కేంద్రం లో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం

నెరవేర్చిం ది.  విభజన చట్టం లో పేర్కొన్న, లేని పలు కేంద్ర విద్యాసంస్థ లను ప్రారంభిం చడంతోపాటు, పోలవరం వంటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సహాయం అందించింది. విశాఖపట్నం లో రైల్వేజోన్ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జా తీయ విమానాశ్రయాలుగా రూపుదిద్దింది బీజేపీ

ప్రభుత్వమే. 

విభజన చట్టం లో చేర్చని అనేక సంస్థ లను కూడా రాష్ట్రం లో కేంద్రం ఏర్పాటు చేసింది. 


2 . పోలవరం ప్రాజెక్ట్ ... ఎన్నో అపోహలు : 

ప్రధాని తలుచుకోకుం టే పోలవరం పనులు సాగేనా? జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నా కూడా పోలవరం విషయంలో కేంద్రం పట్టిం చుకోవడం లేదని కొం తమంది విషప్రచారం

చేస్తున్నారు. 

ఇదీ వాస్తవం:  నిజంగా కేంద్రప్రభుత్వం, మరీ ముఖ్యం గా ప్రధాని నరేంద్ర మోదీ తలచుకోకుం టే.. పోలవరం ప్రాజెక్టు పనులు ముం దుకు సాగేవా అన్నది తెలుసుకోవాలి. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి న తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ముం పు గ్రామాల బదలాయిం పుపై నిర్ణ యం
తీసుకున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు  ఒకింత సంకోచించి నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు.
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను.. అందులో 5 మండలాలు పూర్తిగా, 2  మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలిపే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు, నాయకుల నుంచి పూర్తి వ్యతిరేకత వ్య్తకమైనా కూడా

ఎక్కడా రాజీపడలేదు. నాడు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నే ఈ రోజు  పోలవరం ప్రాజెక్టు పనులు ముం దుకు సాగుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు చివరికి నాటి ఏలికలకు, నేటి పాలకులకు కూడా ఒక డబ్బులు ఇచ్చే యంత్రంగా మారింది. రాష్ట్ర విభజనానంతరం 5 పాలించి న తెలుగుదేశం పార్టీ కి గానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్

కాంగ్రెస్ కు గానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్త శుద్ధి ఏ కోశానా కనిపించడం లేదన్నది సుస్పష్టం. ఎన్నికల నాటికి ప్రజలలో భావోద్వేగాలను పురిగొలిపి ఓట్ల రాజకీయం నెరపాలంటే, ఈ ప్రాజెక్టు పూర్త వకూడదు మరి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నా,  బంధుజనం బాగుకోసం పనులు తామే చేపడతామంటూ నాటి

ప్రభుత్వం ముం దుకొచ్చింది. మూడేళ్లు ముసుగుతన్ని, ఆ తర్వాత అరకొర పనులతో మమ అనిపించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన ఏలికలు కూడా గత ప్రభుత్వ అవినీతిపై గగ్గో లు పెడుతూ రంకెలు వేస్తున్నారు తప్ప అక్రమాలు నిగ్గుతేల్చే లా అడుగుముం దుకు వేయడం లేదు. ఇప్పుడు తాజాగా ఎప్పటికిది పూర్తవుతుం దో చెప్పలేమని పేర్కొనడం, వారి చిత్త

శుద్ధి కి ప్రబల నిదర్శనం.

ప్రతిపక్షంలో ఉన్నపుడు పుస్త క రూపంలో అవినీతి చక్రవర్తిగా చంద్రబాబునాయుడిని అభివర్ణించి న వైఎస్సార్ కాం గ్రెస్, 2019లో ఆంధప్రదేశ్ లో అధికారంలో లోకి వచ్చిన తర్వాత చేసిందేమిటి? చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఎందుకు విచారణ జరపలేకున్నారు? ప్రతి చిన్న

పనికి శంకుస్థాపనల పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేశారని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రిని విమర్శించారు. పోలవరానికి ప్రజాయాత్ర ల పేరుతో బస్సులలో జనాన్ని తీసుకెళ్లి
దాదాపు 83.45 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేశారని ఆరోపిం చారు.

ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా.. చంద్రబాబు

నాయుడి హయాంలో జరిగిన అవినీతిపై ఎందుకు విచారణ చేయడం లేదు. ప్రాజెక్టు పనులలో అవినీతికి బాధ్యులను పట్టు కుని వారికి తగిన శిక్ష పడేలా ప్రభుత్వం 14 కేంద్ర సహకారం - రాష్ట్ర పార్టీ ల అసత్య ప్రచారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. డిజైన్ లు సరిగా లేకపోవడం వల్ల, గత ప్రభుత్వం అవినీతి కారణంగానే కాఫర్ డ్యామ్ వరదలకు కొట్టు కుపోయిం

దని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ఇటీవలే నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి న అంబటి రాం బాబు కూడా ఆరోపిం చారు.
డయాఫ్రమ్ వాల్ వరదల్లో కొట్టు కుపోవడం వల్ల పోలవరం ఎప్పటికి పూర్తవుతుం దో కూడా చెప్పలేమని మంత్రి సెలవివ్వడాన్ని ఏమనుకోవాలి. మొత్తం మీద నాటి ఏలికలు, నేటి పాలకులకు కూడా పోలవరం

పూతిర్కాకపోవడం వల్లనే లాభమన్నది సుస్పష్టం . ఈ ప్రాజెక్టు పనులు సాగుతున్నం తకాలం ఎన్నికల వేళ దీనినే ఒక ఆయుధంగా మల్చుకుని, ప్రజల మనసుల్లో భావోద్వేగాలను పురిగొలిపి లాభపడేం దుకే ప్రయత్నిస్తున్నా యి. నాడు చంద్రబాబు, నేడు జగన్ మోహన్ రెడ్డి లు కూడా తమ వందిమాగధులకు లాభం చేకూర్చేం దుకే ప్రయత్నిస్తు న్నారు తప్ప యావత్

ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం వీరికి పట్టడం లేదు.

పోలవరం పూర్తి బాధ్యతను కేంద్రమే తీసుకుంటుం ది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుం దని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. పోలవరం 
ప్రాజెక్టు పనులపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గత మార్చి

నెలలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. త్వరలో డిజైన్లపై తుది నిర్ణ యం తీసుకోవాలని ఆదేశిం చారు. అవసరమైతే డిజైన్ల విషయంలో అంతర్జా తీయ నిపుణులతో సంప్రదిం చాలని
సూచిం చారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లిం పును నేరుగా 16 కేంద్ర సహకారం - రాష్ట్ర పార్టీ ల అసత్య ప్రచారం

లబ్ధి దారులకు నగదు బదిలీ ద్వారా చెల్లిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థ నను ఆయన సమ్మతిం చారు. పోలవరం పనుల ప్రగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతానని ఆయన వెల్లడిం చారు.

3 . లక్షల కోట్లు ద్రవ్యం వచ్చినా.. అంతకుమిం చే ఖర్చులు : 

ఆంధ్ర ప్రదేశ్ర రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు మించి వివిధ పథకాల కిం ద

వ్యయం చేయడం ద్వారా రెవెన్యూ లోటు భారీగా పెరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొం ది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు పన్నులలో వాటాకిం ద 2,04,882.91 కోట్ల రూపాయలు మంజూరు చేసిం ది. 2014-15లో 15,299 కోట్లు , 2015-
16లో 21,894 కోట్లు , 2016-17లో 26264 కోట్లు , 2017-18లో 29,00120 కోట్లు,

2018-19లో 32,787 కోట్లు , 2019-20లో 28,242 కోట్లు , 2020-21లో 24460.59 కోట్లు , 2021-22లో 26,935.32 కోట్ల రూపాయలు విడుదల చేసిం ది.
ఇక దీం తో పాటు వివిధ గ్రాంట్ల కిం ద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 2,22,010.74 కోట్ల రూపాయలు మంజూరు చేసిం ది. దీన్ని పరిశీలిస్తే.. 2014- 15లో 21779 కోట్లు , 2015-16లో 21927 కోట్లు , 2016-17లో 23346 కోట్లు , 2017-18లో 22761 కోట్లు , 2018-19లో 19457 కోట్లు , 2019-20లో 21876 కోట్లు , 2020-21లో 32934.12

కోట్లు , 2021-22లో 57930.62 కోట్ల రూపాయలు విడుదల చేసిం ది.
అలాగే రుణాలు, అడ్వాన్సు ల కిం ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2014-15 నుంచి 2021-22 దాకా మొత్తం 14,093.80 కోట్ల రూపాయలు అందించిం ది,
2014-15లో 697 కోట్లు , 2015-16లో 685 కోట్లు, 2016-17లో 814 కోట్లు , 2017-18లో 946 కోట్లు , 2018-19లో 1990 కోట్లు , 2019-20లో 2030 కోట్లు, 2020-21లో 4931.80 కోట్లు , 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2000 కోట్ల రూపాయలు విడుదల

చేసింది.

4 . అంచనాకు మించి న వ్యయం : 
రాష్ట్ర విభజన అవార్డు సమయంలో 14వ ఆర్థిక కమిషన్ అమలులో ఉన్న 2015-2020 మధ్య కాలంలో.. అలాగే 15వ ఆర్థిక కమిషన్ అమలులో ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రతిపాదించి న మొత్తం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ రం ఎక్కువ మొత్తం వ్యయం చేసిం ది. 2015 నుంచి 2021  దాకా ప్రతిపాదించి న వ్యయం 7,10,594 కోట్ల రూపాయలు

కాగా, అందులో తీసుకున్న రుణాలపై వడ్డీల కిం ద 83,319 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని, పెన్షన్ల కిం ద 83,235 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని నిర్ణ యించింది. అయితే, అంతకుమిం చే వ్యయం అయ్యింది. వాస్త వంగా వ్యయం అయిన మొత్తం
పరిశీలిస్తే, 7,52,413.89 కోట్లు ఖర్చు చేసిం ది. ఇక్కడ దాదాపు 41,819.89 కోట్లు అదనంగా వ్యయం చేసిం ది

రాష్ట్రానికి

సంబంధించి న 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్ స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని వాస్త వికంగా అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైం ది. రాష్ట్ర విభజన అనంతరం వికేంద్రీకరణ ద్రవ్యలోటు గ్రాంట్ ను అందుకున్నప్పటికీ, 14, 15వ ఆర్థిక సంఘం అంచనాల మేరకు ద్రవ్యలోటు గణనీయంగా పెరిగింది.

2015-16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అంచనా 28,009 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గణించిం ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, అమ్మఒడి తదితర పద్దు ల కిం ద చేసిన వ్యయం కలిపి 1,15,951.80 కోట్ల రూపాయలు అయ్యింది

= = =


5 , ఆంధ్రప్రదేశ్ కు రుణపరిమితిని పెంచి న కేంద్రం : 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2020-21వ

సంవత్సరానికి రుణపరిమితిని కేంద్రం పెంపుచేసిం ది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాబేస్ నుంచి సేకరించి న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ బహిరంగ మార్కెట్ లో నుంచి రుణాలు (ఓపెన్ మార్కెట్ బారోయిం గ్ –ఓఎంబీ) 50,896 కోట్లు గా ప్రతిపాదించిం ది. అయితే, 15వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (గ్రాస్ స్టేట్

డొమెస్టిక్ ప్రోడక్ట్ – జిఎస్ డిపి)లో 4 శాతం వరకు మాత్రమే.. అంటే 42,472 కోట్ల రూపాయల మేరకు ఓపెన్ మార్కెట్ బారోయిం గ్ కు అనుమతి ఉంది.
రాష్ట్రాల జీఎస్ డిపీలో 0.5 శాతం 2021-22 ఆర్థిక సంస్థ మూలధన వ్యయానికి కేటాయిం చాలన్న నిబంధన ఉంది. అలాగే విద్యుత్తు రంగంలో కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా జీఎస్ డిపీలో మరో 0.5 శాతం రుణం
/> తీసుకోవడానికి కూడా అనుమతులు వచ్చాయి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకే జీలో భాగంగా, 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలు తమ GSDPలో 2 శాతం అదనపు రుణ పరిమితిని అనుమతిం చాయి. ఇందులో 1 శాతం GSDP షరతులు లేనిది మరియు మరో 1 శాతం నాలుగు పౌర కేంద్రీకృత సంస్కరణలను పూతిర్
చేయడంతో ముడిపడి ఉంది. అదనపు రుణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని

వినియోగించుకోవడానికి రాష్ట్రాలపై ఎలాం టి పరిమితి విధిం చబడలేదు. 


6 . విభజన చట్టంలో ఏపీ కి ఇచ్చిన విద్యా సంస్థలు, ప్రాజెక్టులు :

జాతీయస్థాయి హోదా వున్న IIT, NIT, IIM, IISER, Central University, Petroleum University, Agricultural University and IIIT. ఈ విద్యాలయాలను 12, 13 పంచవర్ష ప్రణాళికల సమయంలో.. అంటే పదేళ్ల సమయంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం

స్పష్టం గా పేర్కొం ది. అయితే, కేవలం రెం డేళ్ల లోనే ఈ విద్యాసంస్థ లన్నిం టినీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తు తం ఆయా విద్యా సంస్థ లన్నిం టిలో కూడా తరగతులు ప్రారంభమయ్యా యి. నిర్ణయించిన గడువుకి ఇంకా రెం డేళ్ల సమయం వున్నా ఇప్పటికే ఆ 11 విద్యాసంస్థ లను కేంద్రం

ప్రారంభించింది.

తాడేపల్లిగూడెం లోని ఎన్ఐటీ, మంగళగిరిలోని ఎయిమ్స్ రూపుదిద్దుకున్నాయి. గుం టూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా అదే రీతిలో కనిపిస్తోం ది. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీడీఎం కర్నూలు, ఐఐసీఈఆర్ తిరుపతి,  ఐఐఎం విశాఖపట్నం వంటివి సొంత భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా యి.  అనంతపురం సెం ట్రల్

యూనివర్సిటీ పనులు సాగుతున్నాయి. విశాఖలోని పెట్రో యూనివర్సిటీ, విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ వర్సిటీ నిర్మాణాలకు ఇటీవలే భూములు కేటాయిం చారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్ఐడీఎం కూడా నిర్మాణ దశలో ఉంది.

విభజన చట్టం లో లేని మరో 10 సంస్థలు : 
1. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థ :

 అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థ. రూ. 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ లో 500 మందికి పైగా ఐఆర్ఎస్ అధికారులకు, 8000 మంది ఇతర అధికారు లకు శిక్షణ ఇస్తారు.

2. సముద్ర పరిశోధనా సంస్థ :నెల్లూరు జిల్లా తుప్పులిపాలెం గ్రామం వద్ద 250 కోట్ల రూపాయల వ్యయంతో సముద్ర పరిశోధనా సంస్థ

ఏర్పాటయ్యింది. 

3. ఎన్ సీ ఈఆర్టీ  :  నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష న్ రిసెర్చి అండ్ ట్రెయినిం గ్ (ఎన్ సీ ఈఆర్టీ ) రీజనల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ఎడ్యుకేష న్ (ఆర్ఐఈ) సంస్థ ను నెల్లూరు జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేసిం ది. బీఎస్ సీ, బీఎడ్ తో పాటు పరిశోధనా డిగ్రీలకు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం గా ఈ సంస్థ ఉపయోగపడుతుం ది. ఈ

తరహా సంస్థ దక్షిణాదిలో ఇది రెం డవది.

4. ఎంఎస్ఎంఈ టెక్నా లజీ సంస్థ  : విశాఖపట్నం లోని అచ్యుతాపురం మండలం పూడి వద్ద ఎంఎస్ఎంఈ టెక్నా లజీ సంస్థ నిర్మాణమవుతోం ది. స్టీ ల్, నౌకా నిర్మాణ పరిశ్రమలు, ఇతర ఇంజినీరిం గ్ పరిశ్రమలకు నైపుణ్యం గల మానవ వనరుల అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ సంస్థ నైపుణ్య శిక్షణను అందిస్తుం

ది.

5. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ :  దక్షిణాది రాష్ట్రాలకు ఉపయుక్త మైన నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ నెల్లూరు జిల్లా చింతలదీవి వద్ద 2000 ఎకరాలలో నిర్మాణమవుతోంది.

6. విజయవాడలోని సూరంపూడి వద్ద సెం ట్రల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ప్లాస్టి క్ ఇంజినీరిం గ్ టెక్నా లజీ సంస్థ ను ఏర్పాటు చేయనున్నారు . కేంద్ర

ప్రభుత్వం దీన్ని మంజూరు చేసిం ది.

7. రీ జనల్ సెం టర్ ఫర్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సంస్థ ను నెల్లూరు జిల్లాలో కేంద్రం మంజూరు చేసిం ది. త్వరలో ఇది ప్రారంభం కానుం ది. 

8. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్టేడియంను విశాఖపట్నం లో ఏర్పాటు చేయనుం ది. ఇది ప్రస్తు తం డీపీఆర్ స్థాయిలో ఉంది.

9. ఝార్ఖండ్,

ఛత్తీస్ ఘడ్, ఉత్త రాఖండ్ రాష్ట్రాలు ఏర్పడి 17 ఏళ్లు అయినప్పటికీ స్వతంత్రంగా ఆయా రాష్ట్రాలలో ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అలాం టిది ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలలలోపే విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను ప్రత్యేక కేంద్రాలుగా చేసి మొత్తం కార్యకలాపాలు అన్నీ అక్కడి నుం చే

నడుపుతున్నారు . పింగళి వెంకయ్య పేరును విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పెట్టారు. దాం తో పాటు ఆకాశవాణి విశాఖపట్నం లో కూడా వార్తా విభాగాన్ని విస్తారం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీ పెద్ద లు వీటిని ప్రారంభింప చేశారు.

10. కొత్త రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం : విజయవాడలో కొత్త రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం

ఏర్పాటయ్యింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొత్త పాస్ పోర్టు కేంద్రాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించిం ది. విభజన చట్టం లో పేర్కొనకపోయినా, ఈ పది సంస్థ లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన : 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఎవై)

అర్బన్ కిం ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొత్తం 20,71,776 ఇళ్లను మంజూరు చేసిం ది. వీటిలో 17,43,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, వీటిలో 4,92,247 ఇళ్ల నిర్మాణం పూర్తయిం ది. పూర్త యిన ఇళ్లకు సంబంధించి మొత్తం 3,06,824 మంది లబ్ధి దారులు తమ ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం మొత్తం 88,601.56 కోట్ల రూపాయలు కాగా, ఇందులో, కేంద్ర

ప్రభుత్వం తన వాటాగా 31,555.35 కోట్ల రూపాయలు మంజూరు చేసిం ది. ఇందులో
ఇప్పటికే 12,559.13 కోట్ల రూపాయలను విడుదల చేసిం ది. 

కేంద్రం లోని అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ రం అభివృద్ధి పట్ల ఎంతటి శ్రద్ధను చూపుతుం దో తెలియపరిచేం దుకు ఇదో గొప్ప ఉదాహరణ. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఇళ్ల కేటాయిం పుల్లో కేంద్ర
/> ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్ర తాం బూలం ఇచ్చిం ది. ఈ పథకం కిం ద చేపట్టిన ఇళ్ల లో 4,86,005 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 17,04,366 ఇళ్లు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి. రాష్ట్రం లో 2,68,002 మంది ఏపీ టిడ్కో లబ్ధిదారులలో 84,635 మంది ఇంటి రుణానికి దరఖాస్తు చేశారు. వీరిలో 34,496 మందికి బ్యాంకు రుణం మంజూరయ్యింది.

మౌలిక వసతుల కల్పనకు

పెద్దపీట : 
రాష్ట్రం లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యం ఇచ్చిం ది. రకరకాల పథకాల కిం ద జాతీయ రహదారుల అభివృద్ధి కి లక్ష కోట్ల రూపాయల పెట్టు బడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం గా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఎంపిక కూడా పూర్తయ్యింది. 2014 సంవత్సరం తర్వాత రాష్ట్రం లో 3720 కిలోమీటర్ల

జాతీయ రహదారులు అభివృద్ధికి నోచుకున్నాయి.
విభజన చట్టం లో లేకున్నా పెట్రోలియం మరియు సహజవాయువుల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ లు 1,40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం గా ఉన్నాయి. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

హెచ్ పీసీఎల్ మరియు గెయిల్ 30,000 కోట్ల పెట్టు బడితో కాకి నాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్రో

కెమికల్ కాంప్లె క్స్ ప్రారంభిం చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోం ది.
• కృష్ణా , గోదావరి బేసిన్ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ 68,000  కోట్ల రూపాయల ఆఫ్ షోర్ పెట్టు బడి పెట్టనుం ది.
• హిం దుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం రిఫైనరీని 20,928 కోట్ల రూపాయల పెట్టు బడి వ్యయంతో ఆధునికీకరణ చేపడుతోం

ది.
• ఆంధ్ర ప్రాంత పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్ కు 4,211 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిం ది. ఇందులో మొదటి విడతగా ఆసియన్ డెవలప్ మెం ట్ బ్యాంక్
2500 కోట్ల రూపాయలను విడుదల చేసిం ది.
• కృష్ణా జిల్లా నిమ్మకూరు వద్ద రక్షణ రంగంలో ఉపయోగించే నైట్ విజన్ ఆప్టిక్ డివైసెస్

తయారు చేసే కర్మాగారం శంకుస్థాపనకు నోచుకుం ది. నిర్మాణపనులు కొనసాగుతున్నాయి.

విజయనగరం జిల్లా బొబ్బి లి వద్ద బాడంగిలో నౌకాదళ విమానాశ్రయాన్ని, కృష్ణా జిల్లా నాగాయలంక గుల్లలమోద గ్రామంలో డిఆర్ డీవో మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నేషనల్ ఓపెన్ ఎయిర్ రేం జ్ ఎవాల్యుయేష న్ సెం టర్,

విశాఖపట్నం జిల్లా రాం బిల్లి వద్ద నేవల్ ఆల్టర్నే టివ్ ఆపరేషనల్ బేస్ ల ఏర్పాటు కు సూత్రప్రాయ అంగీకారం జరిగింది. వీటికి సంబంధించి న కార్యా చరణ ప్రారంభమైం ది.
• కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ విశాఖపట్నం లో నిర్మాణం జరుగుతోం ది.
• బకిం గ్ హామ్ కెనాల్ ను 7,015 కోట్ల రూపాయల వ్యయంతో మూడు

దశలలో అభివృద్ధి చేయడానికి కేంద్రం సంకల్పించిం ది. ముక్త్యాల నుంచి విజయవాడ వరకు మొదటిదశ పనులు ఇప్పటికే మొదలయ్యా యి, ఈ కాలువ అభివృద్ధి పరచడం ద్వారా జలరవాణాకు శ్రీకారం చుట్టవచ్చును. ముఖ్యం గా అమరావతి రాజధాని నిర్మాణానికి సరకుల రవాణాకు ఇది దోహదపడుతుం ది. ఈ అభివృద్ధి కార్యక్రమం విభజన చట్టం లో లేదు. 
• ఆసియాలోనే

మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ పార్క్ విశాఖపట్నం లో ఏర్పాటవుతోం ది. ఈ పార్కు ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టు బడులు రాగలవని అంచనా. ఇది కూడా విభజన చట్టం లో లేదు.
• 2400 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్తు కర్మాగారం ఏర్పాటుకు ఏపీ జెన్ కోకు ఒడిషాలో బొగ్గు గనుల కేటాయిం పు జరిగింది. ఇది కూడా విభజన చట్టం లో లేనిది.


ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ 2009-14తో పోల్చి చూస్తే 2014-19 మధ్య 214 శాతం పెరిగింది. 47,989 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు , రైల్వే లైన్ల డబ్లిం గ్ పనులు, రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త రైళ్ల ఏర్పాటు ఇందులో ఉన్నాయి.

ఇండియన్ ఇన్

స్టిట్యూ ట్ ఆఫ్ ప్యాకేజిం గ్ (ఐఐపి) ను కాకినాడ ఎస్ఈజడ్ లో ప్రారంభిస్తున్నారు. దీని కోసం 25 ఎకరాల స్థ లాన్ని కేటాయిం చారు. ఈ సంస్థ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఇది విభజన చట్టం లో లేదు.
• ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టి)ని కూడా కాకి నాడ ఎస్ఈజడ్ లో ప్రారంభిస్తున్నారు . దీనికి కూడా

శంకుస్థాపన జరిగింది. (ఇది కూడా విభజన చట్టం లో లేదు)
• గుం టూరు జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటు కానుం ది. ఇది కూడా విభజన చట్టం లో లేదు.
• సెం టర్ ఫర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎన్విరాన్ మెం ట్ ఎఫెక్ట్స్ (SAMEER) కు చెం దిన పరిశోధన, అభివృద్ధి సెం టర్ ను విశాఖపట్నం లో నెలకొల్పుతోం ది. ఈ సంస్థ మొదటిదశ నిర్మాణం పూర్తయ

్యింది. ఈ ఏడాది అంతానికి ఇది పూతిర్ కానుం ది. ఇది విభజన చట్టం లో లేదు.
• విశాఖపట్నం లో ఎస్ టిపిఐ – వుడా ఆధ్వర్యం లో ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ ఇంక్యుబేషన్ సెం టర్ ప్రారంభం కానుం ది. ఇది కూడా విభజన చట్టం లో లేదు.
• చిత్తూరు జిల్లా వికృతమాల గ్రామంలో 339.8 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రాని క్స్ మాన్యుఫ్యా క్చరిం గ్

క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నారు . ఇది కూడా విభజన చట్టం లో లేదు.
• హుడ్కో ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 7500 కోట్ల రూపాయల రుణ సహాయం.
• ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, విశాఖపట్నం , కాకి నాడ, అమరావతి స్మార్ట్ సిటీలుగా ఎంపిక.
• ఆంధ్రప్రదేశ్ లోని 33 నగరాలను అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్ఫర్ మేషన్(అమృత్)

పథకం కిం ద అభివృద్ధి చేయడానికి కేంద్ర కేంద్ర సహకారం - రాష్ట్ర పార్టీ ల అసత్య ప్రచారం 45  ప్రభుత్వం నిర్ణ యించిం ది. అలాగే అమరావతిని కూడా ప్రత్యేక సహాయం కిం ద ఇందులో చేర్చారు.
• అమరావతిని వారసత్వ నగరంగా సమగ్రాభివృద్ధి చేయడానికి “హృదయ్” పథకం కిం ద ఎంపిక చేశారు. ఇది విభజన చట్టం లో లేదు.
• ప్రైమ్ మినిస్టర్ ఆవాస్

యోజన (గ్రామీణ) కిం ద గడిచిన మూడేళ్లలో రాష్ట్ రంలో 1,23,112 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిం ది. వీటి నిర్మాణానికి అవసరమైన మేరకు నిధులు కూడా మంజూరయ్యా యి.
• విజయవాడ, అనంతపురం నగరాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాల మెరుగుకు కేంద్ర సహాయం
• ఈ ఎస్ ఐసీ ద్వారా విశాఖపట్నం నగరంలో 300 పడకల సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రి

నిర్మాణం
• కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్ల కోసం విశాఖపట్నం లో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెం టర్ ప్రారంభం.
• కృష్ణా జిల్లాలో సెం ట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూ ట్ ఫర్ యోగ అండ్ నాచురోపతి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిం ది. (ఇది విభజన చట్టం లో లేదు)
• కాకి నాడలో హోప్ ఐలాం డ్ అభివృద్ధి ,

నెల్లూరు లో కోస్టల్ టూరిజమ్ సర్క్యూట్. ఇవి ప్రాధాన్యం గల టూరిజం ప్రాజెక్టులు (విభజన చట్టం లో పేర్కొని లేదు)
• ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖపట్నం , విజయవాడ విమానాశ్రయాలను అంతర్జా తీయ విమానాశ్రయాలుగా కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అప్ గ్రేడ్ చేసిం ది. అలాగే తిరుపతిలో విమానాల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి న

ఒక కేంద్రాన్ని ఇటీవలే ఏర్పాటు చేసిం ది.

నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ (ఎన్ఐపి) ద్వా రా 8,16,583 కోట్ల
పెట్టుబడులు : 
నేషనల్ ఇన్ఫ్రాస్ట్ర క్చర్ పైప్ లైన్ (ఎన్ఐపి) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 503 మౌలిక వసతుల ప్రాజెక్టులను చేర్చారు. ఏప్రిల్ 20, 2020లో ఎన్ఐపి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తన తుది

నివేదికలో ఈ మేరకు పేర్కొం ది. 
2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 వరకు అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 8,16,583 కోట్ల రూపాయల పెట్టు బడులతో కూడిన మౌలిక వసతుల ప్రాజెక్టులు వస్తాయి. ఇందులో ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్, ఎనర్జీ, సామాజిక మరియు వాణిజ్యపరమైన సదుపాయాలు (తాగునీరు, పారిశుధ్యం సహా), కమ్యూనికేషన్ రంగాలలో

ప్రాజెక్టులకు ఈ పెట్టు బడులు వర్తిస్తాయి. 


I. ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ విభాగంలో తొమ్మిది విమానాశ్రయాల అభివృద్ధి కి 6,044 కోట్లు , 19 ఓడరేవుల అభివృద్ధి కి 40,175 కోట్లు , రైల్వేరంగంలో 30 ప్రాజెక్టులకు సంబంధించి 43,681 కోట్లు , రహదారుల విభాగంలో 164 అభివృద్ధి పనులకు గాను 2,51,470 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.
II.

ఎనర్జీ విభాగంలో విద్యుత్తు రంగంలో 7 అభివృద్ధి పనులకు 99,010 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. అలాగే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ విభాగంలో 2 పనులకు 1071 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.
III. సామాజిక మరియు వాణిజ్య సదుపాయాల విభాగంలో.... 71 ఇరిగేషన్ ప్రాజెక్టులకు 1,07,242 కోట్లు , పట్టణాలలో 64 పనులకు సంబంధించి 1,26,959 కోట్లు వ్యయం

చేయనున్నారు . అలాగే క్రీడలకు సంబంధించి 15 పనులకు గాను 4651 కోట్లు ఖర్చు చేయనున్నారు . పర్యాటక రంగంలో రెం డు ప్రాజెక్టులకు సంబంధించి 6194 కోట్లు , విద్యారంగంలో 23  పనులకు 16,677 కోట్లు , ఆరోగ్య రక్షణ రంగంలో 16 ప్రాజెక్టులకు 16,600 కోట్లు , వ్యవసాయరంగంలో 19 అభివృద్ధి పనులకు గాను 6412 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు . ఫుడ్ ప్రాసెసిం గ్

విభాగంలో ఒక్క ప్రాజెక్టు నకు 71 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పారిశ్రామిక మౌలిక వసతుల కిం ద 55 అభివృద్ధి పనులకు 85076 కోట్ల
రూపాయలు వ్యయం చేయాలని ప్రతిపాదిం చారు.
IV. కమ్యూనికేష న్ రంగంలో ఆరు ప్రాజెక్టులకు 5249 కోట్లు ఖర్చు చేస్తారు . అయిదేళ్ల పాటు 2025 ఆర్థిక సంవత్సరం దాకా అమలవుతున్న ఎన్ఐపి ద్వారా 2020లో 1,31,358 కోట్లు , 2021లో 1,74,340

కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2022లో 1,59,787 కోట్లు , 2023లో 1,21,170 కోట్లు , 2024లో 1,00,818 కోట్లు , 2025లో 83,898 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

ఈ 503 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో, 362 ప్రాజెక్టులు మొత్తం మూలధన వ్యయం రూ. 678709 కోట్లు . 2020-2025 ఆర్థిక సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖలు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ఇంజనీరిం

గ్, ప్రొక్యూర్ మెం ట్ మరియు కన్ట్రస్క్షన్ (ఈపీసీ) మోడ్ లోతీసుకుం టారు. అయితే 111 ప్రాజెక్ట్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానంలో తీసుకుం టారు. వీటి మొత్తం మూలధన వ్యయం రూ.96338 కోట్లు . ఇక మిగిలిన 30 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ
శాఖలు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ రం ద్వారా ఏ విధానంలో

అమలు చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదు.

- - - - 

ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులు : 
కేంద్ర ప్రభుత్వం పరిశీలిం చాలని విభజన చట్టం లో పేర్కొన్న వాటిలో కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీ ల్ ప్లాం ట్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్టీ ల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆధ్వర్యం లో ఒక

నిపుణుల కమిటీని పరిశీలనకు నియమించిం ది. కడప జిల్లాలోని పలు ప్రాంతాలను పరిశీలించి న ఆ కమిటీ అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనుకూలం కాదని తన నివేదికలో పేర్కొం ది. అయితే రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను పునఃపరిశీలన చేయాలని కోరుతూ నియమించిం ది. అయితే ఈ స్పెష ల్ టాస్క్

ఫోర్స్ నివేదిక కొం త అనుకూలంగా ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఇక్కడ స్టీ ల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధం గా ఉంది.
ఇక పరిశీలనలో ఉన్న మరో భారీ ప్రాజెక్టు, నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని దుగరాజపట్నం లో ఓడరేవు నిర్మాణం. అయితే, దీనిపై కూడా పరిశీలన చేసిన సాంకే తిక నిపుణుల కమిటీ, ఆ ఓడరేవు వయబుల్ కాదని స్పష్టం

చేసిం ది.
సమీపంలోని పోర్టు ల కారణంగా తీవ్ర పోటీ ఎదురవుతుం దని పేర్కొం ది. దీం తో ఓడరేవు ఏర్పాటుకు మరో ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదిం చాల్సిం దిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిం ది. అయితే ఇంతవరకు దీనిపై ఏవిధమైన స్పం దన లేదు.

రాష్ట్రం వాటా చెల్లిం చక నెమ్మదించి న రైల్వే పనులు : 
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన మొత్తం సక్రమంగా చెల్ల ించకపోవడంతో అనేక రైల్వే ప్రాజెక్టులు అర్ధం తర నిర్మాణంలో, పెండిం గ్ లో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వ్యయంతో రాష్ట్ రంలో నిర్మిస్తు న్న ఆరు రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం 15,846.35 కోట్ల రూపాయలు. ఇందులో
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు

25 శాతం, మరికొన్నిం టికి 50 శాతం మొత్తం చెల్లిం చాల్సి ఉంది. ఇందులో ఇప్పటిదాకా కేవలం 746.63 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిం చగా, ఇంకా 3,073.50 కోట్ల రూపాయలు తన వాటా మొత్తం గా చెల్లిం చాల్సి ఉంది. ఇది ఆయా ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం చూపుతోం ది.

పెండిం గ్ లో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్ఛరిం గ్ జోన్ : 
2013

జనవరి 2న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జాతీయ తయారీ విధానం (NMP) కిం ద నేషనల్ ఇన్వెస్ట్‌మెం ట్ అండ్ మాన్యుఫ్యాక్చరిం గ్ జోన్ (NIMZ) స్థాపనకు భారత ప్రభుత్వం ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపిం ది. 
ఆ తర్వాత, మంజూరు చేయడానికి ప్రతిపాదన తుది ఆమోదం కోసం ఉన్నత స్థాయి కమిటీ (HLC) ముం దు ఉంచబడిం ది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం

నుం డి తగిన సమాచారం లేనందున మంజూరు చేయబడలేదు. HLC సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి సంబంధిత అథారిటీ పేరుతో బదిలీ చేయాలని ఆదేశించిం ది. ఏది ఏమైనప్పటికీ, చిత్తూరు లో NIMZ ఏర్పాటు కోసం ఇప్పటివరకు చేసిన భూసేకరణ మరియు ఇతర పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరాలతో కూడిన ప్రతిపాదనను కేంద్రానికి సమర్పిం చాల్సి

ఉంది.

విశాఖపట్నం – చెన్ నై కారిడార్ : విశాఖపట్నం – చెన్ నై కారిడార్ పరిధిలో శ్రీకాళహతిస్ (చిత్తూరు ), విశాఖపట్నం , కడప ప్రాంతాలను గుర్తించిం ది. అలాగే చెన్నై – బెం గుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ) పరిధిలో కృష్ణ పట్నం , హైదరాబాద్ – బెం గుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్ బిఐసీ) పరిధిలో ఓర్వకల్లు ను

పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి గుర్తించిం ది.

ఈ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెం దితే సుమారు 1,80,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది ఒక అంచనా.

ప్రత్యేక హోదా.. ప్రత్యేక సాయం : 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని పదే పదే కేంద్రం పై

పలువురు రాజకీయ వేత్త లు విమర్శలు గుప్పిస్తున్నారు . దీనిపై కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలలో ఒక రకమైన అయోమయాన్ని సృష్టిం చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్త వంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? దీనికి గల కారణాలను పరిశీలించి నపుడు, రాష్ట్ర విభజన సమయంలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం

చేయకపోవడం వల్ల నే అమలుకు నోచుకోలేదు.

ప్యాకే జీ ఫార్ములాలో ముఖ్యమైన అంశాలు: 
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90 శాతం నిధులు ఇస్తుం ది. 10 శాతం మొత్తం రాష్ట్ రం భరిం చాలి. హోదా లేని వాటికి 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుం ది. మిగతా 40 శాతం రాష్ట్ రం భరిం చాలి. 
ఇక్కడ తేడా 30 శాతం. ప్రత్యేక

హోదా వలన కలిగే ఆర్థిక ప్రయోజనం కేంద్ర ప్రాయోజిత పథకాలలో 90 శాతం కేంద్రం భరిం చడం మాత్రమే. అందువల్ల 90 – 60 శాతం మధ్య తేడా 30 శాతాన్ని లెక్కకట్టి దానిని ప్రత్యేక ఆర్థిక సహాయం రూపంలో దాదాపు సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రానికి సహాయం చేయడానికి కేంద్రం అంగీకరించిం ది. ఆ సహాయాన్ని విదేశీ రుణ సంస్థ ల ద్వారా

చేయాలని వచ్చిన ప్రతిపాదనకు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది రాష్ట్ రం, కేంద్రం కలిసి అంగీకరించి న ఫార్ములా. ఆ తర్వాత రుణాలను కేంద్రమే చెల్లిస్తుం ది.

పారిశ్రామిక రాయితీలు : 
ప్రత్యేక హోదా వుంటే ఇబ్బడిముబ్బడిగా పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపు పన్ను చెల్లిం పుల్లో వెసులుబాటు ఉంటుం దని కూడా పలువురు

నాయకులు ప్రజలలో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు . వాస్త వంగా కేంద్రం నిబంధనల మేరకు ప్రత్యేక హోదాతో ఏవిధమైన పారిశ్రామిక రాయితీలు అమలు కావన్నది నిజం. ప్రత్యేక హోదా అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాలు, పర్వతశ్రేణి ప్రాంత రాష్ట్రాలలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇతర ఉత్త ర్వుల ద్వారా పారిశ్రామిక రాయితీలను ఆయా రాష్ట్ర

ప్రభుత్వాలు కల్పిస్తున్నా యి. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ల ద్వారా పెట్టు బడులను ఆకర్షిం చానికి వీలుగా తమంత తామే కొన్ని రాయితీలను ఇస్తున్నా యి తప్ప ప్రత్యేక హోదా ద్వారా ప్రత్యేకంగా సమకూరే పారిశ్రామిక రాయితీలు ఏమీ లేవన్నది ఇక్కడ సుస్పష్టం .


విశాఖపట్నానికి రైల్వే

జోన్ : 
విభజన చట్టం లో పేర్కొన్న మేరకు విశాఖపట్నం లో కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేసిం ది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు పై వచ్చిన సూచనలు సలహాలను పరిశీలించేం దుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విభజన చట్టం 13వ షెడ్యూలులోని మౌలిక వసతుల అంశంలో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం నివేదిం చబడి వుంది.

ఉద్యోగుల విభజన, ఇతర పనులన్నీ చకచకా జరుగుతున్నాయి.

జిల్లాలవారీగా కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు :

2014 సార్వత్రిక ఎన్నికలలో మన ప్రియతమ నాయకుడు నరేం ద్ర మోదీ సారథ్యం లో అభివృద్ధి , సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ , రక్షణ, పాలన సహా అన్ని రంగాలలో పురోగతి నమోదవుతోం ది. ఆర్టికల్ 370 రద్దు , రామమందిర నిర్మాణంతో సహా

బీజే పీ యొక్క ప్రధాన సైద్ధాం తిక లక్ష్యాలు గత ఎనిమిదేళ్ల లో సాధిం చబడ్డాయి. మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ ల కోసం అనేక సంక్షేమ పథకాలను
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిం ది.

రూ. 3 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కిం ద 20,40,541 ఇళ్లు , ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

(గ్రామీణ) కిం ద 2,56,270 ఇళ్లు , 14 కంటే ఎక్కువ జాతీయ సంస్థ లు, అమృత్ పథకం కిం ద 32 పట్టణాలకు నిధుల కేటాయిం పు జరిగింది. 
4 నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెం దుతాయి. వైజాగ్, తిరుపతి మరియు విజయవాడ విమానాశ్రయాలను అంతర్జా తీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం, కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.7500 కోట్ల కు పైగా మంజూరు, కొత్త

రక్షణ సంస్థ లు, 7 ఈఎస్ ఐ ఆసుపత్రులు కొన్ని ఉదాహరణలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

24x7 నిరంతర విద్యుత్ సరఫరా కోసం 2014లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మొదటి రాష్ట్రాల సమూహంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. జెన్ కోకు సకాలంలో చెల్లిం పులు చేయడంలో ప్రస్తు త వైఎస్సార్ సీ పీ ప్రభుత్వం విఫలమవడంతో

ఏపీ రాష్ట్ రం ఇప్పుడు కరెంటు కోతలను ఎదుర్కొంటోం ది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా 12,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిం ది. పోలవరం ప్రాజెక్టును పూతిర్ చేసేం దుకు కేంద్ర ప్రభుత్వం కట్టు బడి ఉన్నప్పటికీ గత టీడీపీ, ప్రస్తు త వైఎస్సార్ సీ పీ ప్రభుత్వాల స్వార్థ ప్రయోజనాల కారణంగా ఈ

ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam