DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మితిమీరిన అహంతోనే బీజేపీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది

*సత్తా లేని దక్షిణాది లో బీజేపీ కి పాగా, ఉత్తరాది లో సెగ* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, జూన్ 05, 2024 (డి ఎన్ ఎస్):* రెండు సార్లు అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ మితిమీరిన అహంతోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగానే

మార్జినల్ మ్యాజిక్ సంఖ్యా దాటినా 2024 ఎన్నికల్లో అహంతోన్ మ్యాజిక్ సంఖ్యా 274 కి 40 సీట్లు తక్కువ వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఉత్తర ప్రదేశ్ లో 62 సిట్టింగ్ సీట్లు లో 26 కోల్పోయింది. గతసారి యుపి లో బీజేపీ కి 62 సీట్లు వచ్చాయి. ఈ సారి 36 సీట్లు మాత్రమే వచ్చాయి. దీనికి కారణం ప్రభుత్వం పై వ్యతిరేకత ను జనంలోకి తీసుకువెళ్లడంలో

ప్రతిపక్షాలు సఫలం అయ్యాయి. యుపి లో యోగి పాలనా పై సైతం వ్యతిరేకత పెరిగి ఉండవచ్చు. అయితే అది ఈ స్థాయి లో ఉండే అవకాశం లేదు. 

అయోధ్య నగరమే కీలకం. 

ప్రధానంగా అయోధ్యలో రామాలయ నిర్మాణ సమయంలో రోడ్లు విశాలం కోసం 4000 దుకాణాలు తొలగించారు. వాళ్లకి తగిన నష్ట పరిహారం ఇవ్వలేదు అనే భావన అందరిలోనూ కల్గించాయి

ప్రతిపక్షాలు. వాళ్ళల్లో తిరిగి గుకణాలు పొందడం లో ఇబ్బంది అయితే ఎక్కువగానే ఉన్నట్టు కనపడింది. అధికారులు సైతం వీళ్లకు త్వరిత న్యాయం చెయ్యలేదు అన్న భావన జనంలో ప్రచారం జరిగింది. 

సమాజ్ వాదీ పార్టీ 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచి విస్తృత ప్రణాళిక వేసింది. యాదవులు, ముస్లిం లకు మాత్రమే పరిమితం అయినా ఈ పార్టీ ఈ లోక్ సభ

ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఓబిసి లు 35 శాతం ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ భాగంగా 27 సీట్లు ఇచ్చారు. ముస్లింలకు తక్కువ సీట్లు ఇచ్చారు. యాదవులకు 5 సీట్లు ఇవ్వగా వాటిల్లో అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చారు. ఓసి లకు 11 సీట్లు  ఇచ్చింది. దళితులకు 15 సీట్లు ఇచ్చి, సామాజిక న్యాయం పై పట్టి సాధించి, భారీ ఎత్తున

బీజేపీ కి బ్రేక్ వేశారు. దెబ్బకి కేంద్రంలో బీజేపీ సీట్లు సంఖ్యా తగ్గిపోయింది.  

కులగణన పెట్టాలి అనే డిమాండ్ జనంలోకి వెళ్లేలా ఇండి కూటమి బాగా ప్రచారం చేసింది. 400 పార్ అనే బీజేపీ స్లోగన్ కు కౌంటర్ గా, బీజేపీ కి అధికారం ఇస్తే రిజర్వేషన్లు పోతాయి అనే ప్రచారం విస్తృతంగా ప్రచారం చేసారు. 
మాకు 400 సీట్లు ఇస్తే

రాజ్యాంగాన్ని మారుస్తాం అని ఫైజల్ బాడ్ అభ్యర్థి ( అయోధ్య )  లల్లూ సింగ్ చేసిన ప్రకటన తో మొత్తం మారిపోయింది. తర్వాత బీజేపీ పెద్దలు సర్ది చెప్పినా జరగవలసిన నష్టం జరిగింది. బీజేపీ కి అండగా ఉన్న బీసీ వర్గాలు ఒక్కరాశిగా ఇండి కూటమి వైపు తిరిగాయి. ఈ దెబ్బ మొత్తం దేశ వ్యాప్తంగా పడింది. వెనుక బడిన వర్గాలు ఎక్కువగా ఉండే

పూర్వాంచల్ ( తూర్పు యుపి) లో సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. ముస్లిం ల రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని బీజేపీ చేసిన ప్రకటన ను ప్రతిపక్షాలు జనంలోకి తీసుకువెళ్లాయి. బీఎస్పీ సానుభూతి పరులు సైతం సమాజ్ వాదీ పార్టీకి ఈ సరి ఓటు వెయ్యడం గమనార్హం. ఇండి కూటమి లో భాగంగా 17 కాంగ్రెస్ కి ఇచ్చింది. 
ఈ దెబ్బ

సాక్షాత్తు మోడీ పోటీ చేసిన వారణాసి పై కూడా చూపించింది. మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా పటిష్టమైన ప్రణాళిక అమలు చేసారు. 

అయితే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్  ఎంపిక చేసిన అభ్యర్థులను కూడా ఆఖరి నిమిషం లో అధిష్టానం మర్చి వేరొకరికి సీట్లు ఇవ్వడం కూడా బీజేపీ కి ఘోరమైన దెబ్బ కొట్టింది. 
వెరసి

సురక్షితమైన స్థానంలో ఉన్న బీజేపీ ని నిప్పుల కొలిమి పారేసింది సాక్షాత్తు బీజేపీ అధిష్టానమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కి అంత క్యాడర్ లేకపోవడమే ప్రధాన కారణం. మహారాష్ట్ర లో  ఉద్దవ్ థాక్రే, శరద్ పవర్ లపై సానుభూతి ఉంది. తద్వారా బీజేపీ సీట్లు కోల్పోవలసి వచ్చింది. అయితే

ఈ అంశాలను గమనించడంతో అన్ని సర్వ్ సంస్థలు బొక్కబోర్లా పడి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ అధిష్టానం అనుకున్న అంకెలనే చెప్పడం జరిగింది. వాస్తవ ఫలితాలు వచ్చేసరికి బీజేపీ కి మొత్తం బోర్లా పడింది. 

మిగిలిన రాష్ట్రాల్లో సైతం అతి ఊహాగానాల వల్ల తమిళనాడు లో ప్రభంజనం సృష్టించిన అన్నామలై సైతం ఓటమి పాలయ్యారు. గత

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీ నటి నవనీత్ రానా ఈసారి బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు.  

అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు గా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీ కి లభించి 22 సీట్లు వచ్చాయి. బీజేడీ (యు) నితీష్ కుమార్ సైతం16 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి మద్దతు ప్రకటించడం తో

బీజేపీ ప్రస్తుతానికి గట్టు ఎక్కింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam