DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్యులు సైతం సీఎం అయ్యేది కేవలం బీజేపీ లో మాత్రమే

*ఒడిశా సీఎం పీఠం ఎక్కిన అవిశ్రాంత పోరాట కార్యకర్త మాంఝి*  

*మార్చురీ దగ్గర ఉండగా మంజీకి పీఎం నుంచి ఫోన్ కాల్ వచ్చింది* 

విశాఖపట్నం, జూన్ 13, 2024 (డిఎన్ఎస్): కులాల బలం, కుటుంబ నేపధ్యం, ధనబలం అన్ని ఉంటేనే నేటి రాజకీయాల్లో పదవులు వస్తాయి అన్నది అక్షర సత్యం. అయితే ఇవేవి లేని సామాన్య కార్యకర్తలను సైతం

సాక్షాత్తు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించే పార్టీ ఈ ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝి. ఒడిశా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సెంధల్ గిరిజన తెగకు చెందిన ఈయన బీజేపీ లో సామాన్య కార్యకర్త. ఈయన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు చేస్తున్న సేవలకు

గుర్తింపుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈయన్ను ఒడిశా ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరిగింది. ఎందరో కుల, ధన, ఆర్ధిక బలం కల్గిన వాళ్ళు సీఎం సీటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే వీళ్లందరినీ ప్రక్కన పెట్టి మోహన్ మాంఝి పేరును ఎంపిక చేసారు మోడీ. 

అస్సలు ఊహించలేదు. .: మాంఝి కుటుంబం 

బీజేపీ కార్యకర్త ఒకరి

బంధువు మార్చురీ లో ఉండగా, మాంఝి వారికీ సహాయంగా వెళ్లిన సమయంలో ఈయన ఒడిశా ముఖ్యమంత్రిగా ఎంపిక అయినట్టు ఫోన్ కాల్ వచ్చింది. తక్షణం రమ్మని సమాచారం. మార్చురీ వద్ద కార్యకర్త పని పూర్తి అయినా తర్వాతే మాంఝి అక్కడ నుంచి వెళ్లారు. కార్యకర్తల పట్ల ఈయనకు అంత నిబద్దత. అతి సామాన్య జీవితం గడిపే వ్యక్తి. 

పేవ్ మెంట్ పైనే

రాత్రిళ్ళు ఎమ్మెల్యే గా నిద్ర  

2019 లో ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత మాంఝి భువనేశ్వర్ కి వచ్చారు. ప్రభుత్వం ఈయనకి క్వార్ట్రర్ ఇవ్వక పోవడంతో రాత్రిళ్ళు పేవ్ మెంట్ పై నిద్ర చేసిన వ్యక్తి. ఒకసారి పేవ్ మెంట్ పై నిద్రపోతున్న సమయంలోనే ఈయన ఫోన్ చోరీకి గురయ్యింది. ఈ విషయాన్నీ ఈయనే నేరుగా అసెంబ్లీ లో స్పీకర్ కు

చెప్పడంతో అందరికి తెలిసింది. మీరు ప్రభుత్వ క్వార్ట్రర్ ఇవ్వని కారణంగా జరిగింది అని చెప్పడం తో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ షాక్ కు గురయ్యారు. 
అక్రమ మైనింగ్ పై తీవ్ర పోరాటం చేశారు. ఆ క్రమం లోనే మైనింగ్ మాఫియా మాంఝి పై హత్య యత్నం కూడా జరిగింది. 
స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం పెట్టె భోజనం లో బియ్యం లో కుంభకోణం

జరిగితే దీన్ని ఖండిస్తూ మాంఝి అసెంబ్లీ లో స్పీకర్ మొఖం పై ధాన్యం విసరడంతో సభ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. 

న్యాయ శాస్త్రం లో పట్టా పొందిన మాంఝి కొన్నాళ్ళు సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అధ్యాపకునిగా సేవలు అందించారు. అనంతరం రాజకీయ అరంగేట్రం చేసి గ్రామా సర్పంచ్ గాను, తదుపరి కియోంఝర్ నుంచి 2000 లో తొలిసారి

ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2004 , 2019 గెలిచి అవిశ్రాంత ప్రజా సేవ చేసారు. 2024 లో నాల్గవసారి శాసన సభ్యునిగా గెలిచి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  

బీజేపీ లో సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కాగలదు అనే సందేశం ఇవ్వడం, ఆదివాసీలకు అత్యున్నత పదవి ఇచ్చి, గుర్తింపు ఇవ్వడం కేవలం బీజేపీ లో అందునా

నరేంద్ర మోడీ కె దక్కుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam