DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సు కోసం యతుల చాతుర్మాస్య దీక్ష

*సన్యాసులే కాదు అందరూ ఆచరించ వచ్చు.* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 17, 2024 (డిఎన్ఎస్):* చాతుర్మాస్య వ్రతం సనాతన సంప్రదాయం లో  ఆచరించే అత్యున్నత దీక్ష. ఈ దీక్షను ప్రస్తుతం సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు మాత్రమే పట్టించడం గమనిస్తున్నాం. అయితే  సమాజ శ్రేయస్సు కోరుకునేవారు

అందరూ వర్ణ భేదం లేకుండా ఈ దీక్షను పాటించవచ్చు.  అయితే నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. 

ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. 
ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి)

రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. 

చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు

నాలుగు పక్షాలను ప్రామాణికంగా రెండు నెలల కాలం ఈ వ్రతాన్ని పాటించడం కూడా అమలులో ఉంది. 

ఈ దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి లేదా పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి లేక పౌర్ణమి వరకూ సాగుతుంది. 

ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును.

ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

సాంకేతిక ప్రాధాన్యం,  :

ఈ కాలంలో పురాణం ప్రాధాన్యతతో పాటు సాంకేతిక ప్రాధాన్యం కూడా ఉంది. ఈ

నాలుగు నెలల కాలం పాటు వర్షాలు అధికంగా పడుతుంటాయి. ఈ సమయంలో దేశాటనలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో ఒకే చోట ఉండి తమ కార్యాచరణ నెరవేర్చుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. ఏ కారణం చెప్పిన ప్రజలకు ఆరోగ్యమే ప్రధానం కావడంతో

ఈ రోజు నుంచి అందరూ తగు జాగ్రత్తగా ఉంటారు. 

ఆరోగ్య పరమైన చర్యలు ప్రధాన లక్ష్యం: . .. 
వర్ష కాలం కావడం తో మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన

రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. 

పేలాలు - బెల్లం ప్రాధాన్యత : . . 
పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి

దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి

ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

రాత్రి వేళలు అధికం : . .
భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు

కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.

ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ

రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .

వ్రత వృత్తాంతము : 

చతుర్మాస్యం  అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ,

శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. 

వ్రత నియమాలు : 

చాతుర్మాస్య దీక్ష ను అన్ని ఆశ్రమాల ( బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ

నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. 
చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో ఆకు కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక

చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.
1 సాధకులు భూశయనం చేయటం, 
2 ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
3 ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
4 వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస

పాటించాలి.
5 ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
6 ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. 
7 యోగసాధన చేయడం శ్రేయస్కరం.
8 దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
9 పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి

నియమాలు పాటిస్తారు. 
10 శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam