DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ఆగమ పరీక్షలు -2024 ప్రకటన విడుదల 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, జులై 19, 2024 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవ ఆదాయ ధర్మ ఆదాయ  శాఖా అర్చక పరీక్షలూ 2024 నిర్వహణకు ప్రకటన విడుదల చేసింది. వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ, గ్రామ దేవత ఆగమములో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ

శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో అప్లికేషన్ లు సమర్పించాలని ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. ప్రకటన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. అదే విధంగా కనీసం 5వ తరగతి

ఉత్తీర్ణత లేదా తత్సమానమైన విద్యా పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు సంబంధిత సంస్థ నుండి లేదా గురువు వద్ద నుండి ధృవీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుందన్నారు. పరీక్ష రుసుము రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్షలూ ఉంటాయన్నారు. 40 సంవత్సరాల వయస్సు నిండిన వారికి వ్రాత పరీక్షల నుండి మినహాయింపు

ఇస్తామన్నారు. వీరు మౌఖిక పరీక్షకు మాత్రం హాజరుకావాలన్నారు. వారు గెజిటెట్ అధికారిచే ధృవీకరించబడిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను జతపర్చాల్సి ఉంటుందన్నారు. వర మరియు ప్రవర రాసే అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన ప్రవేశ మరియు వర పరీక్షల యోగ్యతా పత్రాలను దరఖాస్తుతో పాటు జతచేయాల్సి

ఉంటుందన్నారు. 

         పరీక్షలు రాసే అభ్యర్థులు తమ దరఖాస్తులను 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో apendts.archakaexaminations.com వెబ్ సైట్ లో సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్ సైట్ లో లేదా ఆఫీస్ పనివేళల్లో 08645 273139, 9491000607, 9440682996 ఫోన్ నంబర్ లను సంప్రదించాలని సూచించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam