DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమోఘం గిరి ప్రదక్షిణ - మారుమ్రోగిన నృసింహ నామం 

*భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరించాయి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, జులై 21, 2024 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన  సింహగిరి ప్రదక్షిణం లక్షలాది మంది భక్తుల భాగస్వామ్యంతో అద్భుతంగా  జరిగింది.  సింహచలం క్షేత్రం శ్రీవరాహ లక్ష్మి నృసింహ

స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా సాగింది.  32 కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన ఈ పవిత్ర గిరిని ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఉదయం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. శనివారం ( జులై 20 na) లక్షలాది మంది భక్తులు కాలినడక న ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసారు. తదుపరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజున ( ఈ నెల 21 న) సింహాద్రి నాధుని దర్శనం

చేసుకున్నారు. శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుసినా మధ్యాహ్నం నాటికి పూర్తిగా ఉపశమనం లభించింది. 

ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు తమ వంతు సేవా చేసుకోవాలని సంకల్పంతో వందలాదిగా సేవా సంస్థలు మార్గ మధ్యలో వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి మజ్జిగ, పానీయాలు, పళ్ళు, అన్న ఆహార పదార్థాలు, మంచి నీరు ఉచితంగా వితరణ చేసారు.

మరి కొన్ని సంస్థలు, భక్తులకు కాళ్ళ నొప్పులు తగ్గడానికి తగిన ఉపశమనం కల్గించే మందులను ఉచితంగా ఇవ్వడం తో పాటు, పెద్దవాళ్ళు, మహిళలు నొప్పులతో బాధపడే వారికి తైల మర్దన కూడా చేసారు. 

తోలి పావంచా వద్ద మొదలు : 
ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున ( జులై  20 న) సింహాచలం క్షేత్రం లోని తొలిపావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టి

భక్తులు కాలినడకన గిరి  ప్రదక్షిణ ను మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాత్ర సింహాచలం, అడవివరం, సెంట్రల్ జైలు, ముడసర్లోవ, హనుమంతవాక, వెంకోజీపాలెం, హెచ్ బి కోలనీ, కైలాసపురం, సాలగ్రామపురం, మాధవ ధర, మురళీనగర్, ఎన్ ఎస్ టి ఎల్, ఎన్ ఏ డి కొత్తరోడ్డు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా సింహాచలం చేరుకున్నారు.

 చేరుకుంటారు. 

మరునాడు ఆదివారం కావడంతో ఈ ఏడాది ఈ యాత్ర లో ఊహించిన సంఖ్యా కంటే ఎక్కువగా భక్తులు పాల్గొన్నారు. యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లూ చేసారు. యాత్ర పూర్తి చేసుకున్న భక్తులు మరునాడు సింహగిరి కి వచ్చి, స్వామిని దర్శించుకున్నారు. దీనికై సింహాచల

దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. 
 
మహానుభావుల ఆవిర్భావం కూడా ఇలాగే :

తెలుగు రాష్ట్రాలను తన శ్రీరామాయణ, మహాభారత, భాగవత, తిరుప్పావై ప్రవచనాలతో ఉత్తేజిత పరిచిన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి సైతం ఈ గిరి ప్రదక్షిణ ఫలితమే అని చెప్తుంటారు. వారి తల్లిదండ్రులు గిరి ప్రదర్శిన చేసి తమకు ఉత్తమ

సంతానాన్ని కల్గించమని స్వామిని మొక్కుకుని గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీభాష్యం వారు జన్మించినట్టు విశాఖ వాసులందరికీ తెలిసిందే. గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణతో సమానమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

ఈ ఏడాది యువతి, యువకులు ఎక్కువగా పాల్గొనడం గమనార్హం. తమ అభిమాన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్

కళ్యాణ్ కు పాలనాపరంగా, రాజకీయ  పరంగా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా స్వామిని కోరుతూ  కొందరు ఈ యాత్రలో పాల్గొన్నారు.   

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది భక్తులను సముద్ర స్నానాలకు అనుమతించలేదు.  

సంవత్సరం అంతా చందన అలంకారంతో ఉండే శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామికి ఆషాఢ పౌర్ణమి

నాడు ఆఖరి విడత 12 మణుగుల చందన సమర్పణ జరుగుతుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam