DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కి బడ్జెట్ కేటాయింపులపై ప్రధానికి ధన్యవాదాలు: జివిఎల్

*అమరావతి, పోలవరం అభివృద్ధి పై కేంద్రం దృష్ఠి: మాజీ ఎంపీ*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 23, 2024 (డిఎన్ఎస్):* మంగళవారం ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై బిజెపి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రధాని

నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం కేటాయింపులపై అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటు రాష్ట్రం లోనూ, అటు కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున మంచి ఫలితం వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని రాష్ట్రానికి హామీ ఇచ్చారని, దాన్ని

నిలబెట్టుకున్నారన్నారు. ఈ బడ్జెట్‌లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్ల బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయం ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆధునిక రాజధాని నగర కల సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, మరియు

రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ ఆర్థిక సాయంతో పాటు పోలవరం పూర్తిచేయడానికి, ఇంకా రెండు పారిశ్రామిక పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికై నిధులు, ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయం అందజేత, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వెనుకబడిన జిల్లాలకు

అభివృద్ధి గ్రాంట్లు వంటి అనేకరకాల సహాయాన్ని ఈ బడ్జెట్‌లో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గత 10 సంవత్సరాల్లో అన్ని రకాలా సాయం అందించిందని, కానీ ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృష్టికి ఎన్నికల్లో ఎన్డీఏకు అనుకూల ప్రజల తీర్పు కారణమైనది

అనీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకున్న బలానికి ఇది మరో ఋజువనీే జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam