DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైష్ణవ క్షేత్రాల్లో ఇతరుల జోక్యం కూడదు: శ్రీవైష్ణవ సమాఖ్య హెచ్చరిక

*సంప్రదాయ రక్షణ కై శ్రీవైష్ణవ సంఘ సమాఖ్య ఆవిర్భావం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 02, 2024 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలోని పాంచరాత్ర ఆగమ దేవాలయాల నిర్వహణ లో ఇతరులు  జోక్యం చేసుకోవడం పట్ల శ్రీ భగవద్రామానుజ శ్రీవైష్ణవ సంఘ సమాఖ్య ఆగ్రహం వ్యక్తం

చేసింది. 

వైష్ణవ దేవాలయాల్లో ఇతర సంప్రదాయ వాదులు జోక్యం చేసుకుని, చేస్తున్న రసాభాస నేపథ్యంలో సంప్రదాయ విధానాన్ని పరిరక్షించుకోవడం కోసం వైష్ణవ సమాజం అడుగులు వేసింది. 
 
ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవైష్ణవ సంఘాల సభ్యులతో సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. సంప్రదాయం లోని ప్రముఖుల సూచనల

మేరకు ఈ సమాఖ్య కార్యాచరణ నిర్వహించనుంది. ప్రముఖ దివ్యక్షేత్రం, దక్షిణ భారత అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో ఈ సమాఖ్య ఆవిర్భావం జరిగింది. దీనికి చిన్న జీయర్ స్వామి శిష్యులు త్రిదండి అహోబల జీయర్ స్వామి పర్యవేక్షణ చేయడం జరిగింది. 

ఈ సమాఖ్య తొలి సమావేశం విజయవాడ సమీపంలోని జీయర్ స్వామి ఆశ్రమం లో జరిగింది. ఈ

 సమావేశానికి సమాఖ్య గౌరవ సలహాదారులు మరింగంటి తిరుమొళిశై ఆళ్వార్ అధ్యక్షత వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మన దేవాలయాలు వివిధ కారణాల వలన అన్యాక్రాంతం అయ్యాయని, మిగిలినవైనా కాపాడుకోవాలసిన అవసరం ఉందన్నారు.  భద్రాచల దేవాలయం పట్ల ఇతరులు చేస్తున్న వివాదాలకు సమాఖ్య తరఫున పరిష్కారానికి ప్రయత్నించాలని

సూచించారు.

కార్యక్రమ సమన్వయ కర్త,  అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ ఈ సమాఖ్య ఏర్పాటుకు పూర్వరంగాన్నివివరించారు. 

జీయర్ వేద పాఠశాల ప్రిన్సిపాల్ మధూసూదనాచార్య స్వామి మాట్లాడుతూ మన సంప్రదాయాన్ని భవిష్యత్తరాలకు, మహిళలకు కూడా అందేలా చూడాలని

పిలుపునిచ్చారు. తమ వేద పాఠశాల సంప్రదాయాసక్తులైన విద్యార్ధులకోసం ఎదురుచూస్తోందని తెలియచేసారు.  

ఈ సమాఖ్య తొలి సమావేశం విజయవాడ లోని వద్ద గల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం  విజయకీలాద్రి పై నిర్వహించారు. వివిధ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఇచ్చిన సూచనల మేరకు కార్యాచరణను ఏకగ్రీవంగా ఆమోదించడం

జరిగింది. 

ప్రధానంగా ఇటీవల భద్రాచలం లోని శ్రీరామచంద్ర స్వామి ఆలయం శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహించబడుతుంది, దీనిలో సంబంధం లేని ఇతర సంప్రదాయ పరులు జోక్యం చేసుకోవడాన్ని ఈ సమాఖ్య  తప్పు పట్టింది. అభ్యంతరం చెప్పిన వైష్ణవ ఆచార్యులపై దుష్ప్రచారం చేయడాన్ని

ఖండించింది. 

ప్రధానంగా శ్రీవైష్ణవ క్షేత్రాల్లో వైదిక నిర్వహణలో ఇతరుల జోక్యం ఉండరాదు. 

లక్ష్యాలు - ఉద్దేశాలు

1) రెండు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల, ప్రాంతాల శ్రీవైష్ణవ సంఘాలతో సమన్వయం
2) శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పాటించే ఇతర గోష్ఠులు, సంఘాలు,పీఠాలతో సమన్వయం
3) మన సంప్రదాయాన్ని

అనుసరించే దేవాలయాలు, అర్చకులు, ఆగమ పండితుల వివరాలు సేకరించి పొందుపరచడం.
4) ఆయా దేవాలయాలలో జరిగే ఉత్సవాల ప్రత్యేకతలు, దేవాలయ ప్రత్యేకతలు మొదలైనవి సేకరించి భద్రపరచడం
5) ఆగమాలకు, ఆలయ సంప్రదాయాలకు, అర్చకులకు ఏదైన సమస్య ఏర్పడితే సమాఖ్య తరఫున అన్ని సంఘాలు పరిష్కారానికి ప్రయత్నించేలా చేయడం.
6) సమాఖ్య తరఫున ప్రభుత్వ

పరమైన ప్రయోజనాలు, ప్రభుత్వ పెద్దలతొ, అధికారులతో మన దేవాలయాలు, అర్చకులు, ఆగమాల విషయంలో చర్చలు జరపడం, పరిష్కారాలకు ప్రయత్నించడం.
7) మన శ్రీవైష్ణవ సంప్రదాయం, ఆగమాలతో పాటు, ఇతర శాఖల సంప్రదాయాలు, దేవాలయాలు, ఆగమాలు, అర్చకుల విషయంలో మన సహకారాన్ని అందించి వారికి మద్దతు తెల్పడం.
8) ఏ శాఖల పీఠాధిపతులపైనైన, ఆగమాలపైనైన,

సంప్రదాయలపైనైన జరిగే దాడులను సమాఖ్యపరంగా ఎదుర్కోవడం.
9) మన సంప్రదాయ దేవాలయాలకు, సంప్రదాయ అనుసరుల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి ఆయా దేవాలయాలలో జరిగే ప్రతి ఉత్సవానికి స్వచ్చందంగా సేవలందించి, వాటిలో పాల్గొనేలా చేయడం.
10) మన సంప్రదాయ విలువలు భావితరాలకు వివరించి, వారికి అవి అందేలా చేసి రామానుజ సేనగా తయారు

చేయటం

ఈ అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేసారు. 

కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ చక్రవర్తుల శ్రీనివాస రామానుజాచార్యులు, తెలంగాణ హైదరాబాదు కో కన్వీనర్ చక్రవర్తుల జగన్మోహనాచార్యులు, కోస్తాంధ్త కో కన్వీనర్ అకళంకం పార్ధసారధి, ఆంధ్ర కో ఆర్డినేటర్ అగ్రహారం రాఘవేంద్ర, నల్లాన్

చక్రవర్తుల శ్రీరామచక్రవర్తి , ఉభయవేదాంత పీఠ వేద విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ముడుంబై మధుసూదనాచార్య, 
జీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్య, అంగలకుదురు శ్రీ వాసుదాసాశ్రమ నిర్వాహకులు పట్టాభి, బడంగ్ పేట, హేలాపురి సంఘాల ప్రతినిధులు వేదాంతం అచ్యుత కృష్ణ, అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘ

సభ్యులు పాల్గొన్నారు.

సమాఖ్య అంతర్గతంగా అమలు చెయ్యాల్సిన కార్యాచరణ:

1) రాబోయే పదిహేను రోజులలో కో కన్వీనర్లు,  కన్వీనర్ల సమన్వయంతో జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయిలలో సమాఖ్య సభ్యులను నిర్ణయించి తెలపటం
2) ప్రతి సభ్యుడు వారి పరిసర ప్రాంతాల దేవాలయాల, పీఠాల వివరాలు, ప్రత్యేకతలు, సమస్యలను సేకరించి

తెలపటం.
3) ప్రాంతాల వారిగా కన్వీనర్లు, కో కన్వీనర్, కోఆర్డినేటర్ల సమన్వయంతో శ్రీవైష్ణవ కుటుంబాలు, దేవాలయ అర్చకులు, మొదలైనవారితో సమావేశాలు నిర్వహించి చైతన్యపరచడం
4) మన వేద పాఠశాలలోని కోర్సులు, సౌకర్యాలు మొదలైన వాటిని తెలుసుకొని, ప్రచారం చేయడం, 
5) వేద పాఠశాలల అధ్యపకుల సహకారంతో మన‌ప్రాంతాలలో పది పదిహేను

రోజుల సంప్రదాయ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కృషిచేయడం.
6) వ్యాపార ధోరణిలో కాకుండా సంప్రదాయ వ్యాప్తి ధోరణిలో వెళ్లేలా మన‌ అర్చకులకు పురోహితులకు, వేదపండితులకు, ప్రబంధ పండితులకు విజ్ఞప్తి చేయడం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam