DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సేవ చేసి మరీ చావు దెబ్బలు తినడమే నా ఆర్ఎస్ఎస్ తలరాత?


*వేలమందిని ఆర్ఎస్ఎస్ సేవకుల్ని చంపిన చోటే మళ్ళీ సేవ ..* 

*విశాఖపట్నం, ఆగస్ట్ 02, 2024 (డిఎన్ఎస్):* అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం స్వచ్చందంగా సేవలు చేసి, మరీ చావు దెబ్బలు తినడమే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల తలరాతా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 

భారత దేశం లో ఏ మూల అయినా, ఎంత రాత్రి అయినా ప్రకృతి

విపత్తు జరిగితే తక్షణం ఆదుకునేందుకు వచ్చే వాళ్ళు కచ్చితంగా స్వయం సేవకులు.   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) అనగానే ఆపదలో కనిపించే ఆపద్బాందువులు. ఈ విషయం ప్రపంచంలోని అందరికి తెలుసు. ఈ సేవకులు ఎటువంటి లాభం ఆశించకుండా ఆర్తులకు సేవ చెయ్యడమే వీళ్ళ లక్ష్యం. 

ప్రస్తుతం కేరళ లో జరిగిన ప్రకృతి

వైపరీత్యాలలో అందరికంటే ముందుగా ప్రత్యక్షమైనది సంఘ సేవకులు. గత కొన్ని రోజులుగా రాత్రి పగలు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది కూడా వెళ్లలేని ప్రదేశాల్లోకి సునాయాసంగా వెళ్లి, మరీ మృత శిధిలాలను వెలికి తీస్తున్నారు. వీళ్ళు కేరళలో సేవలు చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఎన్నో సార్లు ప్రాణాలకు తెగించి సేవలు

అందించారు. అయితే వీళ్లకు తగిన బహుమానం ఇవ్వవలసిన ప్రభుత్వాలు కనీసం వీళ్ళ ప్రాణాలకు రక్షణ కూడా ఇవ్వడం లేదు.  
ఇదే కేరళ రాష్ట్రంలో వేలాది మంది సంఘ సేవకులను కాలయముళ్లు లా అత్యంత క్రూరంగా హత్య చేయడం జరిగింది. అయినప్పడికి ఎటువంటి కక్ష ను భావించకుండా. . ప్రమాద ప్రాంతానికి చేరుకొని సేవ చెయ్యడానికి సిద్ధంగా

ఉంటారు. 

వీళ్ళకి నేర్పించే సంస్కారం ఇదీ. ఆపదలో ఉన్నవాడు కాల యముడైనా సరే రక్షించడానికి సిద్ధంగా ఉంటారు స్వయం సేవకులు. 
అలాంటి వాళ్ళని నిలువెత్తునా చంపడానికి కారణమైన వాళ్ళ పై కనీసం కేసులు కూడా పెట్టలేదు. పైగా వాళ్లకి బహుమానాలు కూడా ఇచ్చిన ఘనులు అక్కడి రాజకీయ పార్టీలు. 
కళ్ళముందు స్వయం సేవకులు

చేస్తున్న సేవలు చూసి, వీళ్ళ ద్వారా ప్రాణ రక్షణ పొందిన వాళ్ళే వీళ్ళ ప్రాణాలు తియ్యడానికి  సిద్ధంగా ఉన్నారు. నడిరోడ్డు పైనే వేటకొడవళ్లతో వెంటాడి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం మానవత్వం లేని ప్రాంతాల్లో సైతం వీళ్ళు సేవ చేసేందుకు వెళ్లి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఆర్తులను ఆదుకోవడం కోసం వెనకాడడం లేదు.

వీళ్ళే నిజమైన సేవకులు. ఎంత సేవ chesinaa ఫోటోలకు ఫోజులు మాత్రం ఇవ్వరు. 

ఇదిలా ఉంటె. . ఈ ప్రాంతం జనం ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు మాత్రం సేవకులని, వీళ్ళ అనుబంధ సంఘాలను హింసక్ హింసక్  అంటూ హేళన చేస్తున్నారు. కేరళ ఘటనకు కారణాలపై నోరు ఎత్తి మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సిద్ధంగా లేదు. కేంద్ర రక్షణ

బలగాలు, స్వచ్చంద సంస్థలు రంగంలోని దిగి రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత తీరిగ్గా. . .ప్రజా ప్రతినిధులు వచ్చి  ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తున్నారు. 
జనం కూడా ఈ ఫోటో ఫోజులకే అందలం ఎక్కిస్తున్నారు. అత్యంత బాధాకరమైన విషయం ప్రస్తుతం కేరళలో దుర్ఘటన జరిగిన ప్రాంతం వాయినాద్. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీ గా గెలిచినా

వ్యక్తి రాహుల్. లోక్ సభలో ప్రతిపక్ష నేత. గత సారి ఇతనే సిట్టింగ్ ఎంపీ కూడానూ. పూర్తి భాద్యత వహించిన వలసిన వ్యక్తి తీరిగ్గా రావడం అందరిని ఆశ్చర్యం కల్గించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam