DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగ్లా లో హిందూవుల సజీవ దహనం, భారత శరణార్థిగా హసీనా

*హిందూవుల గుళ్ళు, ఇళ్ళు, భవనాలూ తగలబెట్టేశారు.*

విశాఖపట్నం, ఆగస్టు 05, 2014  (డిఎన్‌ఎస్‌) : బాంగ్లాదేశ్ లో అనూహ్య పరిణామాల తర్వాత హిందువులపై దారుణ మారణకాండ జరుగుతోంది. రిజర్వేషన్లు కోసం మొదలు పెట్టిన నిరసనలు హిందూ వ్యతిరేక లక్ష్యంగా దారుణ మరణ కాండ గా మారిపోయాయి. ఒక్కసారిగా హిందువుల ఇళ్ళు, సంస్థలపై

ఉద్యమకారులు విరుచుకుపడ్డారు. సోమవారం సైనిక బెదిరింపుల మధ్య ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోవడంతో దేశం అనిశ్చతి లో పడింది. సైనిక ఉగ్ర కోరల్లోనికి బాంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. ఉన్నపళంగా ప్రధాని హసీనా ను రాజీనామా చేయించడంతో, ఆమె ఢాకా నుంచి త్రిపుర లోని అగర్తలా కు చేరుకొని,  భారత శరణార్థిగా ఉన్నారు. ఆమెను

భారత రక్షణ మంత్రి జయ శంకర్, సలహాదారు అజిత్ దోబాల్, కలిసి, చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం పరామర్శించారు. ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో జరుగుతున్నా పరిణామాల ప్రభావం గురించి తెలుసుకున్నారు. 

మరోప్రక్క బాంగ్లాదేశ్ లో రేజర్వేషన్ల శాతం తగ్గించమని జనం చేస్తున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడ

హిందువులు మైనారిటీలు గా ఉండడంతో, వీరికి అండగా ఉన్న ప్రధాని దేశం విడిచి వెళ్లడంతో వీళ్ళ రక్షణ అగమ్యగోచరంగా మారింది. 
ప్రధాని నగరం విడిచి వెళ్ళగానే. .ఆందోళనకారులు ఒక్కసారిగా  రెచ్చిపోయి, హిందూ ద్వేషంగా మారిన బాంగ్లాదేశ్. బంగబంధు షేక్ ముజిబూర్ రెహమాన్ విగ్రహాలు నాశనం చేసారు. హిందూ దేవాలయాలు,  భవనాలకు నిప్పు

పెట్టారు. ఇద్దరినీ నడిరోడ్డుపై చంపేశారు. స్థానిక హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టి ఆనందాన్ని పొందారు. వీరి దౌర్జన్య కాండను నిలువరించే వాడే లేకుండా పోయాడు. దీంతో హిందువులు భయాందోళనకు లోనయ్యారు. తమను రక్షించాల్సిందిగా భారత దేశాన్నీ బంగ్లా హిందువులు కోరుతున్నారు. 
సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

మమతా నేరుగా రోహింగ్యాలకు పిలుపునిచేశారు. బంగ్లానుంచి వచ్చేవారికి బెంగాల్ లో ఆశ్రయం ఇస్తామని. అయితే హిందువులకు ప్రవేశం పై మాత్రం ఆంక్షలు విధించేసారు.  

దేశం సైనిక వలయంలోకి వెళ్లడంతో హసీనా దేశం దాటగానే ఆర్మీ చీఫ్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరో రెండు రోజుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని

తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam