DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరీ డోనాల్డ్ లు? పర్యటిస్తే పటిష్ట ప్రభుత్వమైనా పటాపంచలేనా?

 *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 09, 2024 (డిఎన్ఎస్):* అమెరికాకు చెందిన డోనాల్డ్ లు... ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభుత్వాలు ఆవిరి అవు తాయనేది చరిత్ర చెప్తున్నా నిజం. ఎవరు ఈ డోనాల్డ్ లు. ?

అమెరికా ప్రభుత్వం జో బైడెన్ లో దక్షిణ ఆసియా, మధ్య ఆసియా దేశాల ( వ్యవహారాల సహాయ కార్యదర్శి

గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమెరికా డీప్ స్టేట్ లో భాగం ఇతను. 

ఇతను ఎక్కడ అడుగు పెడితే ఆ దేశం లో ప్రభుత్వాలు బలవంతంగా దించబడతాయి అని తెలుస్తోంది. లేకా ఆ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చడానికి అమెరికా ఇతన్ని అక్కడికి పంపుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. 
ఇంతకూ ముందు కిరేజికిస్తాన్, అల్బానియా,

పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ ల్లో పర్యటించాడు. వాటి పర్యవసానం అన్ని చోట్ల ప్రభుత్వాలు మారిపోయాయి పర్యటించారు. 
ఇమ్రాన్ ఖాన్ ఒక  ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే డోనాల్డ్ లు గురించి చెప్పడం జరిగింది. నా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా తరపున ఇతను వచ్చారు అని, అనంతరం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం

మారిపోయింది. 

శ్రీలంక, జులై 2022 లో డొనాల్ లు వెళ్ళారు. రాజపక్సే ప్రభుత్వాలు కూలిపోయాయి.  

భారత్ లో కూడా అడుగుపెట్టారు. . .

భారత్ లో కూడా జరిగింది. ఇతను 2024 ఎన్నికల సమయం ముందు చెన్నై కి వచ్చాడు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ డోనాల్డ్ లు మాట్లాడుతూ దక్షిణ భారత దేశం తో ద్వైపాక్షిక సంబంధాలు

పెంచుకుంటాం అని ప్రకటన చేసాడు. ఒక దేశం మరొక దేశం తో ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకుంటారు కానీ, ఒక రాష్ట్రం తో లేదా దేశంలో ఒక భాగం తో నేరుగా సంబంధం పెట్టుకోవడం వీలుకాదు. ఇతని ప్రకటన ప్రకారం భారత్ ను ఉత్తర , దక్షిణ దేశాలుగా విడగొట్టడమే అమెరికా లక్ష్యమా అనే అనుమానాలు విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయం

పడుతున్నారు. 

వీరి అనుమానాలు నిజం చేస్తూ. . కేరళ ప్రభుత్వం ఒక నియామకం చేసింది. కేరళ లో ప్రత్యేక విదేశి వ్యవహారాల కార్యదర్శి ని నియమించారు. విదేశాలతో నేరుగా ఒక రాష్ట్రం సంప్రదింపులు, కార్యాచరణ చేసే అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగు సూచనలు తప్పనిసరి. అయితే కేరళ నేరుగా నియామకం చెయ్యడం పట్ల

వివాదాస్పదంగా మారింది. దీని ప్రభావం భారత్ దేశం పై పడే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఇతని పర్యటన పై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. 

దాని పర్యవసానమే నేడు బాంగ్లాదేశ్ లో విఛ్చిన్న పాలన కనపడుతోంది. 

అమెరికా ఆధిపత్యం కోసం చేస్తున్న ఆగడాల ఫలితం కొన్ని దేశాలను చిన్నాభిన్నం చేస్తోంది అని

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు తెలియచేస్తున్నారు. 

ఇతను ఇంగ్లీష్, చైనీస్, పశ్చిమ ఆఫ్రికా క్రియో, హిందీ, రష్యన్, జార్జియన్, అజర్బైజాని, అల్బేనియన్ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. ఇతను 1997 - 2000 మధ్య భారత్ లో అమెరికా రాయబార కార్యాలయంలో కాశ్మీర్, భారత్ - పాకిస్తాన్ వ్యవహారాల విభాగం లో పనిచేసారు. తిరిగి 2010 లో అమెరికన్

అంబాసి లో డిప్యూటీ చీఫ్ గా ఢిల్లీ లో పనిచేసారు. ఈ కాలం లోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్, మిత్ర బృందాలతో సాన్నిహిత్యం ఏర్పడింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam