DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆటలతోనే మానసిక ఉల్లాసం: నారాయణ ఏజీఎం రాజ్ కుమార్ 

*ఉత్సాహంగా నారాయణ సంస్థల స్పోర్ట్స్ మీట్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 10, 2024 (డిఎన్ఎస్):* పోటీ ప్రపంచంలో ఒత్తిళ్ల మధ్య సాగుతున్న విద్యా విధానం నుంచి మానసిక ఉల్లాసం కలిగించేది ఆటలేనని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాజ్ కుమార్ తెలిపారు. విశాఖపట్నం పరిదిలోని నారాయణ విద్యా

సంస్థల సిబ్బంది, విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ను శనివారం ఆయన ప్రారంభించారు.  స్థానిక ఉడా పార్కులో అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. నగర పరిధిలోని 13 శాఖలను రెండు విభాగాలుగా  విభజించి

గాజువాక,  ఉడా పార్కులలో పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతకు ముందు రంగు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలి పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీల అధికారిక సూచికగా కాగడాను వెలిగించారు.   
సుమారు 400 మంది సిబ్బంది ఖోఖో. కబడ్డీ, షటిల్, వాలీబాల్, క్రికెట్, ఇతర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 
విజేతలకు బహుమతి

ప్రధానం చేసారు.  స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆర్ ఐ లు, కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్, సాఫ్ట్ స్కిల్స్ టీం, ఏఓలు పాల్గొని సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam