DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాభివృద్ధి లో విఘ్నాలు తొలగించమని వినాయకుణ్ణి ప్రార్ధించాం

*బెల్లం, సంపత్ వినాయకుల సన్నిధి లో మొక్కు తీర్చిన హోమ్ మంత్రి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 14, 2024 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లో నడిపించే క్రమంలో కలుగుతున్న విఘ్నాలను తొలగించమని బెల్లం వినాయకుణ్ణి ప్రార్ధించినట్టు రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి

అనిత తెలిపారు. నగరంలోని ఆనంద గణపతి దేవాలయాన్ని ( బెల్లం వినాయకుడు) సందర్శించారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి విజయం కోసం స్వామిని ప్రార్ధించినట్టు అనిత తెలియచేసారు. గత ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల దిబ్బ చేసి, అభివృద్ధి ని నిర్వీర్వ్యం చేసిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి

సారధ్యంలో కూటమి ప్రభుత్వం విజన్ 2047 రాష్ట్ర దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మారబోతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంతరాలు రాకుండా వాటిని తొలగించాలని ప్రార్ధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వినాయకునికి బెల్లం దిమ్మలు నివేదన చేసి ముక్కు తీర్చుకున్నారు.

ఆమె వెంట పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ మంత్రి, కుటుంబ సభ్యుల పేరిట ఆనంద గణపతికి గరిక పూజ, అర్చన జరిపారు. వైదిక ఆశీర్వచనం చేసారు. అనంతరం ఆలయ వైభవం వివరించారు. ఆలయంలో రానున్న వినాయకచవితి వేడుకలను పురస్కరించుకుని చేపట్టే వైదిక కార్యక్రమాలను మంత్రికి తెలియచేసారు. అనంతరం నగర

ప్రధాన కూడలి వద్దగల సంపత్ వినాయకగర్ ఆలయాన్ని దర్శించుకుని, స్వామికి మొక్కు తీర్చుకున్నారు. స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ఈఓ , సహాయ కమిషనర్ శిరీష మంత్రికి స్వాగతం పలికారు. 
అనంతరం హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు విఘ్నం తొలగించాలని ఆలయాల దర్శనం

చేసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలని స్వామిని ప్రార్ధించారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్సీ ల ప్రవర్తన సభ్య సమాజం హర్షించేదిగా లేదన్నారు. ఆర్ధిక, సామాజిక, పెట్టుబడుల పైరవీలతో అర్హతలు లేకపోయినా పెద్దల సభకు ఎంపిక చేశారన్నారు.

వాళ్ళ విపరీత ప్రవర్తన కారణంగా సభ్య సమాజానికే మచ్చ తెచ్చే విధంగా ఉందన్నారు. కుటుంబాలను రోడ్డున పెట్టిన దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కొందరైతే, అనంత బాబు తన సొంత కారు డ్రైవర్ నే మర్డర్ చేసి ఇంటికి పార్సెల్ చేసిన ఘనులు ఉందన్నారు. ఇలాంటి దుష్ట ప్రవర్తన ఉన్నవాళ్ళని అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి  ఎమ్మెల్సీ

పదవికి రాజీనామా చేయించలేదన్నారు.

ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు రోడ్లు పైకి వచ్చి రచ్చ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలుగా పంపించే వ్యక్తుల కోసం ఆ పార్టీ నాయకులు, అధిష్టానం  ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఎంతోమంది త్యాగాలు, పోరాటాలు ఫలితంగా దేశానికి స్వాతంత్రం

వచ్చిందని, దాన్ని కాపాడుకుని, పెద్దల త్యాగాన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌరులందరి పైన ఉందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam