DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చేవచచ్చిన హిందూ జాతి మొత్తం మరాఠా యోధుడు పీష్వా బాజీరావ్ లా మారాలి

*చెరచబోయిన ముస్లిం మతోన్మాది తల తెంపిన హిందూ సింహం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 20, 2024 (డిఎన్ఎస్):* చేవచచ్చిన నేటి హిందూ జాతిలోని ప్రతి ఒక్కరూ మరాఠా బ్రాహ్మణ యోధుడు పీష్వా బాజీరావు భల్లాల్ స్ఫూర్తిగా హిందూ సింహాలుగా మారవలసిన అవసరం ఏర్పడింది. నేడు హిందువులపై ముస్లిం

మతోన్మాదులు, సెక్యూలర్ పేరుతొ హిందూవులను చేతగాని చవటలుగా మార్చిన నేటి హిందూ వ్యతిరేకులపై పోరాటం చెయ్యవలసిన అగత్యం ఏర్పడింది. దానికి పీష్వా బాజీరావు ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నాడు  మహిళల మానం చెరచబోయిన ముఘల్ / ముస్లిం మతోన్మాదుల తలా తెగనరికిన పీష్వా బాజీరావు లాంటి హిందూ పోరాట

యోధుల చరిత్ర ఉన్న నేల ఇది. 
మరి నేడో అదే భరత భూమి పై ప్రతి రోజూ హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటె. . .కనీసం ఖండించడానికి కూడా నోరు ఎత్తని చవట నేతలు ఉన్న దేశంగా మారింది.   
హిందువులకు భారత్ లోనే రక్షణ లేకుండా పోయింది అంటే. . ఇక ఇతర దేశాల్లో జీవచ్చవాలుగా బ్రతుకుతున్నారు. 

నేటి భారత జాతి స్వేఛ్చా

వాయువులు పీలుస్తోంది అంటే లక్షలాది మంది పోరాట యోధుల అమర త్యాగ ఫలం. వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి భారత జాతిని ముస్లిం, మొఘల్, తురుష్కులు, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ తదితర ద్రోహుల నుంచి హిందూ సమాజాన్ని కాపాడిన వీరుల్లో అగ్రగణ్యుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వారు ఛత్రపతి శివాజీ.  ఆయన సారధ్యంలో వేలాదిమంది వీరులు, యోధులు

తయారై, భారత జాతిని కాపాడుకుంటూ వచ్చారు. వారిలో అత్యంత ప్రముఖులు పీష్వాల బాజీరావ్ బల్లాడ్. ఆయన జయంతి ఆగస్టు 18. ఈ సందర్బంగా ఆయన పోరాటాల్లో ఒక మచ్చుతునక.. ఇది. ఈయన జీవించిన కాలం 1700 - 1740 సంవత్సరం.   

ముస్లిం మతోన్మాదులు పెట్రేగి పోయి హిందువులను ఊచకోత కోసి, మహిళల మానప్రాణాలు నాశనం చేస్తున్న సమయంలో ఛత్రపతి శివాజీ

సారధ్యంలో దేశ రక్షణలో నిలబడిన మరాఠా బ్రాహ్మణ యోధులు పీష్వా బాజీరావు. ముస్లిం జిహాదీలకు బాజీరావు పేరు వింటే బట్టలు తడిసిపోయిన రోజులు అవి. 

ఆ సమయంలో ఒక రోజు బుందేల్కండ్ రాజా ఛత్రశాల్ ( 80 ఏళ్ల రాజపుత్ర వీరుడు ) ను వేలాది మొఘుల్ ముస్లిం జీహాదీలు చుట్టుముట్టినప్పుడు పేష్వా బాజీరావ్ కు ఒక లేఖ వ్రాసారు అందులో..

ఛత్రసాల్ చేసిన సంబోధన..

నదిలో దిగిన గజేంద్రుడ్ని మొసలి పట్టుకున్నట్టు నన్ను నాశత్రువులు పట్టుకున్నారు..
ఈ సమయంలో నన్ను ఆదుకొని నాకు తోడుగా వచ్చి పొరాడి తమ శౌర్యాన్ని చూపి నన్నూ నా ప్రజలను నా రాజ్య మహిళల మానాలనూ కాపాడాల్సిన నా తోటి రాజపుత్రులు షండులై పారిపోతున్నారు..-

ఒక నిస్సహాయ రాజపుత్రుడు

ఒక మహా వీరుడైన బ్రాహ్మణులు బాజీరావు ను తనరాజ్యం, తన మహిళల మాన, ప్రాణ రక్షణకోసం చేయిచాచి ఆర్ధిస్తున్నాడు. పేష్వా బళ్లాల్ .. నన్నూ, నా రాజ్యలక్ష్మిని అవమానాల నుంచీ కాపాడు.. హిందూ ధర్మపరిరక్షకుడైన శివాజీ రాజే ఖడ్గానివి నీవు.. 
ఒక సుక్షత్రియుడి విన్నపాన్ని మన్నిస్తావని ఆశిస్తూ - రాజా ఛత్రశాల్.. అని

వ్రాసారు. 

ఈ లేఖ చూసిన మరుక్షణమే రక్తం ఉడికిపోయిన ' పేష్వా బళ్లాల్ ' తన దగ్గర ఉన్న కేవలం 500 ఆశ్విక దళంతో బుందేల్ ఖండ్ వైపు పరుగుతీశాడు.

10 రోజుల ప్రయాణం అనంతరం కేవలం 48 గంటల్లో ముగించి అలసటన్నదే లేకుండా గెరిల్లా యుద్ధ తంత్రంతో మొఘల్ సేనలను ఊచకోత కోసి సేనాధిపతి ఫంగస్ ఖాన్ తల నరికి రాజా ఛత్రశాల్ కు

కానుకగా అందిస్తూ చెప్పాడు. 

ఒక సుక్షత్రియుడి రాజ్యాన్ని, రాజ్యలక్ష్మిని, రాజ్యంలోని మహిళల మానప్రాణాలను చెరచబోయిన ఒక దుర్మార్గుడి తలను ఒక బ్రాహ్మణ్ వీరుడు మీకు బహుమతిగా ఇస్తున్నాడు స్వీకరించండి.

ఆ విజయానికి ఉప్పొంగిపోయిన బుందేల్కండ్ రాజా ఛత్రశాల్.. మరాఠా బ్రాహ్మణ యోధులు పేష్వా బాజీ ని

ఆలింగనం చేసుకొని అంటాడు : ఇదం బ్రాహ్మ్యమ్ ఇదం క్షాత్రం.. 

ఆనాడు హిందూ సమాజంలో ఏప్రాంతం లోని ప్రజలు ఇబ్బందుకు పడినా వారిని రక్షించేందుకు ఇతర ప్రాంతాల రాజులూ ఉండేవారు. 

నేటి తరంలో హిందూ సమాజాన్ని అణిచివేసే నేతలు తయారయ్యారు. దీనికి తగ్గట్టుగా హిందూ వ్యతిరేక చట్టాలు తయారు చేసి, దేవాలయాలు

దోచుకుని, హిందువులకు రక్షణ లేకుండా చేశారు. హిందువులపై  శివాజీ సమయంలో జరిగిన దోపిడీలు, హిందూ ప్రజల ధన, మాన ప్రాణాల దోపిడీలు మళ్ళీ జరిగే విధంగా నేటి నేతలు, పాలకులు ఇబ్బడిముబ్బడిగా కృషి చేస్తున్నారు. 

నాడు ప్రక్క రాజ్యంలో హిందువుల పై ముస్లిం ల మారణకాండ, అత్యాచారాలు, మతమార్పిళ్లు జరుగుతూ ఉంటె. . ఇతర రాజ్యాల

హిందువు నేతలు చూస్తూ ఊరుకోలేదు. యుద్దాలు చేసి మరీ హిందువులకు అండగా నిలిచారు. ఇది పాలకుల ధర్మం. ప్రక్కవాడు ఎలా పొతే మాకేంటి అనుకుంటే.. రేపటి రోజు వీళ్ళపై కూడా అదే తరహా దాడి జరుగుతుంది. 

మరి నేడో. . ప్రక్కనే ఉన్న బాంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేస్తున్న అత్యాచారాలు, దారుణ మారణకాండను అడ్డుకునే

ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కి సహకరించవలసిన ప్రతిపక్షాలు, సరిహద్దు రాష్ట్రాల పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు నిద్ర పోతున్నారు. కనీసం ఒక్కడు కూడా బాంగ్లాదేశ్ లో హిందువుల ఆర్తనాదాలపై స్పందించక పోవడం గమనార్హం.  అదే విధంగా ఒక హిందూ యువతి, అందునా వైద్యురాలి పై కొలకత్తా మహా నగరంలోనే అత్యంత కిరాతకంగా

అఘాయిత్యం చేసినా. . .నేటికీ నోరెత్తని చవటలు ప్రజా ప్రతినిధులుగా ఉన్న సమాజంలో ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నారు. ప్రజలను కాపాడే వైద్యురాలికి రక్షణ కల్పించలేని పాలకులు సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉంటె. . ప్రతిపక్ష కూటమి అధికారం లో బెంగాల్ ఘటనపై కూడా స్పందించలేని ప్రజా

ప్రతినిధులు చట్టసభల్లో కొనసాగుతున్నారు. 

ఇలాంటి నేటి రాజకీయ పార్టీలు, నేతలు ఛత్రపతి శివాజీ, పీష్వా భాజీ రావు తదితర హిందూ పోరాట యోధుల నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam