DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగాల్ డాక్టర్ కి న్యాయం కోసం బంద్, బీజేపీ పై  బమ్, బందూక్

*అడ్డుకునేందుకు రంగంలోకి టిఎంసి గూండాలు: బీజేపీ*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 28, 2024 (డిఎన్ఎస్):* కోలకతా లో వైద్య విద్యార్థిని పట్ల జరిగిన అత్యంత ఘోరాన్ని ఖండిస్తూ బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్ ను అడ్డుకోడానికి బెంగాల్ ప్రభుత్వం బాంబులు, బందూక్ లను వాడింది. బుధవారం

శాంతియుతంగా చేస్తున్న బంద్ ర్యాలీ పై టిఎంసి గూండాలు బాంబులు విసిరి, విధ్వంసంగా మార్చారు. కోలకతా లో  సాకుతో శాంతియుత ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు, బీజేపీ నాయకులూ, క్యాడర్ లక్ష్యంగా వాటర్ క్యాన్ లు, ఫైరింగ్ కూడా జరిపారు. అయినప్పడికి విద్యార్థులు, సామాన్య జనం రోడ్లపై నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పేసారు.

బీజేపీ నాయకులూ వీళ్ళకి మద్దతు గా ముందుకు నడిచారు. విధ్వంసం గా మారిన ఈ ర్యాలీని బీజేపీ ఖాతాలో వేసేందుకు టిఎంసి ప్రయత్నం చేసింది. అయితే. . 
24 పరాగణాల్లో బీజేపీ నేతలపై పోలీసుల విధ్వంసం విస్తృతంగా సాగించారు. చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. 

కేంద్ర మంత్రి  సుకాంతా మజుందార్,  బీజేపీ ఎంపీ రూపాలి

గంగూలీ, సుడేందు అధికారి, తదితరుల సారధ్యంలో భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, సామాన్య ప్రజలు కోలకతా లో బంద్ లో పాల్గొన్నారు. బీజేపీ నాయకులూ 12 గంటల శాంతియుత బంద్ కు పిలుపునిచ్చారు. అయితే దీన్ని తట్టుకోలేని తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్ని పూర్తి అధికారాలతో రంగంలోకి దింపింది. వీళ్ళకి బెంగాల్ పోలీసులు సైతం సహకరించడం

గమనార్హం. ఈ బంద్ కు సంఘీభావంగా విద్యార్థులు రావడంతో వారికి మద్దతు ప్రకటిస్తూ మాహిళా ఎంపీ రూపాలి గంగూలీ ర్యాలీ లో పాల్గొనేందుకు రావడంతోనే టిఎంసి గూండాలు విధ్వంసం సృష్టించారు. బాంబు లు కూడా విసరడంతో పోలీసులు ఆరు రౌండ్ల ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. వెంటనే ఈ ఘటనకు భాద్యుల్ని చేస్తూ రూపాలి గంగూలీ ని పోలీసులు

అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లపై సైతం నిరసనకారులు కూర్చున్నారు. 

రాష్ట్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద సుకాంతా మజుందార్ సారధ్యంలో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. బంద్ కు వ్యతిరేకంగా మూసినా దుకాణాలు తెరిపించేందుకు టిఎంసి గూండాలు ఆయుధాలతో రోడ్లపైకి వచ్చారు. దాంతో

కోలకతా రోడ్లు విధ్వంసం గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 12 గంటల బంద్ కొనసాగించి తీరతామని బీజేపీ నేతలు, విద్యార్థి సంఘాలు, ఇతర మద్దతుదారులు ఇప్పడికే ప్రకటించాయి. 

బెంగాల్ పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య చాల చోట్ల వాగ్విదాలు జరిగాయి. మహిళలపై సైతం పోలీసులు విచక్షణంగా లాఠీలు ఝుళిపించారు. దొరికిన వాళ్ళని

దొరికినట్టు వాహనాల్లో కుక్కి, తరలించారు. 

నిరసనల్లో పాల్గొన్న వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒక్కటే అత్యంత క్రూరంగా వైద్యురాలికి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని. ఈ దుర్ఘటన పూర్వాపరాలు ప్రభుత్వానికి తెలుసునని, అయితే భాద్యత విస్మరించిన ముఖ్యమంత్రి తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
/> బెంగాల్ ప్రభుత్వం ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్రం ఈ దుర్ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది. విచారణలో నిజాలు వెలువడతాయనే భయంతోనే రంగంలోని గూండాలని దింపారని బీజేపీ మండిపడింది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam