DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదే జరిగితే  మోడీ చేతికి పుత్తడి - జగన్ చేతికి ఇత్తడి..

*వీళ్ళ చేరికతో రాజ్యసభలో మోడీ ఆడేసుకుంటారు.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 28, 2024 (డిఎన్ఎస్):* దేశానికి మంచి చెయ్యాలి అనుకునే రాజుకు కాలం కలిసి వచ్చినట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రజలు ఓట్లు వేసి లోక్ సభ సీట్లు ఇవ్వక పోయినా దైవానుగ్రహం మెండుగా ఉన్నట్టు ఉంది. లోక్ సభ

లో 303 సీట్లు ఉన్నా, రాజ్య సభ లో తగిన బలం లేకపోవడంతో ఎక్కువ బిల్లులు ఆమోదం పొందలేదు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 12 సీట్లు ఎన్డీఏ కూటమి కి రావడంతో  కనీస బలం 119 సీట్లు మాత్రమే మోడీ బృందానికి వచ్చాయి. అయితే బుధవారం అందిన సమాచారం ప్రకారం మోడీ కి బంపర్ అఫర్ తగిలినట్టు గా తెలుస్తోంది. 

వైఎస్ ఆర్

కాంగ్రెస్ కు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులు ఎన్డీఏ కూటమి లో చేరుతున్నట్టు సమాచారం. దీంతో ఎన్డీఏ బలం  రాజ్యసభలో 129 కి చేరనుంది. దీంతో దేశానికి అవసరమైన ఎన్నో చట్టాలను రెండు సభల్లోనూ ఆమోదింప చేసుకునే అవకాశం లభించింది. 

ఇదే జరిగితే మోడీ ఇక వెనుదిరిగి చూసే అవకాశమే ఉండదు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు

పార్లమెంట్ వేదికగా చావుదెబ్బ కొట్టనున్నారు,
 
వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అతని అనుచరులు కొట్టబోయే దెబ్బ కి ఈ జీవింతంలో తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పడికే ఇతనికి అసెంబ్లీ లో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యే లు ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభలో  ఇతని పార్టీకి 11

మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక్కరు తప్ప మిగిలిన 10 మంది పార్టీ కి రాజీనామా చేసి, ఎన్డీఏ కూటమి లో చేరనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.   
గత ఐదేళ్లుగా పార్లమెంట్ లో ఈ సంఖ్యా చూసుకుని మోడీ మెడలు వంచుతా అంటూ జనం విర్రవీగిన జగన్ మోహన్ రెడ్డి కి అతని ఎంపీ లు ఇచ్చే షాక్ కి అసలు మేడే లేవకుండా పోతుంది. 
ప్రస్తుతం వైఎస్

ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్య సభలో ఉన్న  సభ్యులు :1 .) గొల్ల బాబురావు, 
2 .) మోపిదేవి వెంకట రమణ, 3 .)బీద మస్తాన్ రెడ్డి,  4 .) ఆర్ కృష్ణయ్య, 5 .) పిల్లి సుభాష్ చంద్ర బోస్ , 6 .) విజయసాయి రెడ్డి, 7 .) మేడా రఘునాధ రెడ్డి, 8 .) నిరంజన్ రెడ్డి, 9 .)ఆళ్ళ అయోధ్య రామి రెడ్డి, 10 .) పరిమళ నత్వాని, 11 .) వైవి సుబ్బారెడ్డి. 

వీరిలో గొల్ల బాబురావు,

మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రెడ్డి,  తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.  
ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్ర బోస్ లు జనసేన లో చేరే అవకాశం ఉంది. 
విజయసాయి రెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆళ్ళ అయోధ్య రామి రెడ్డి, పరిమళ నత్వాని లు బీజేపీ లో చేరే అవకాశం 

ఇక మిగిలిన వైవి సుబ్బారెడ్డి

మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభలో ఉండే ఛాన్స్ ఉంది. ఇతను వై ఎస్ జగన్ ఇంట్లో వ్యక్తి కావడంతో ఇతనికి పార్టీ మారె అవకాశం లేకపోయి ఉండవచ్చు. 

వీళ్లందరి లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. వేరువేరు కారణాల వాళ్ళ వీరికి రాజ్య సభ టికెట్లు ఇచ్చినా, కనీసం ఒక్క రోజు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వీళ్ళని కలిసిన దాఖలాలు లేవు. పైగా వీళ్ళ పై పూర్తి అజమాయిషీ చెలాయించడం తో వీళ్ళు భారీ నిర్ణయం తీసుకునే వరకూ వచ్చింది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam