DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మమత విధ్వంసకర వ్యాఖ్యలకు సాచికొట్టిన బీజేపీ, దేశ ప్రజలు 

*బెంగాల్ లో మండితే  అన్నిచోట్లా మండిస్తా: మమతా హెచ్చరిక*   

*సిగ్గుచేటు: యోగి, అస్సోమ్ రా.. నీ లెక్క తేలుస్తా: హేమంత* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 29, 2024 (డిఎన్ఎస్):* బెంగాల్ లో మండిస్తే . . . దేశ వ్యాప్తంగా మండిస్తాం అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి చేసిన హెచ్చరికపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోలకతా లో వైద్యురాలి పై జరిగిన అఘాయిత్యం పై జరుగుతున్నా నిరసనల నేపథ్యంలో బీజేపీ బంద్ నిర్వహించడం తో బెంగాల్ సీఎం పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించి, బం, బందూక్, వినియోగించి అణిచివేసే ప్రయత్నం చేసింది. అయినప్పడికి బంద్ సఫలం

కావడంతో భరించలేకపోయిన మమతా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కె హెచ్చరిక జారీ చెయ్యడం జరిగింది. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బెంగాల్ లో మండితే . .. దేశంలోని మిగిలిన ప్రాంతాలు కూడా మండిస్తాం అంటూ మమతా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. 

అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్,

బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ లను లక్ష్యంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.  

మమత ను భర్తరఫ్ చెయ్యాలి : సోషల్ మీడియా 

మమత బెనర్జీ చేసిన ఈ ప్రకటనలపై దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. న్యాయం చెయ్యవలసిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా ఉండడమే కాకుండా, దేశాన్ని మండిస్తా అంటూ

ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం అని, తక్షణం ఆమెను భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. 

సిగ్గు పడాల్సిన సమయం: యోగి

ఒక మహిళా కు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చెయ్యవలసిన ముఖ్యమంత్రి మహిళా అయి ఉండి కూడా నోరెత్తకపోవడం భారత రాజ్యాంగ వ్యవస్థకే సిగ్గు చేటు అన్నారు. అదే ఉత్తర ప్రదేశ్ లో అన్యాయం

జరిగిన తక్షణం దోషులకు తగిన శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన భాద్యత పాలకులదేనన్నారు. 

అస్సోమ్ రా. . నీ సంగతి తేలుస్తా: హేమంత 

దేశమంతా మండిస్తా అంటూ హెచ్చరిక చెయ్యడానికి బెంగాల్ సీఎం కు ఏం అర్హత ఉందని, అస్సోమ్ ముఖ్యమంత్రి హేమంత బిశ్వ మండిపడ్డారు. ఒక్కసారి మండించడానికి

అస్సోమ్ వస్తే నీ లెక్క తేలుస్తాం అంటూ జవాబు ఇచ్చారు. తక్షణం దేశ వాసులకు మమతా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చాలా ఘాటుగా స్పందించారు. తన రాష్ట్రంలో ఒక అమాయక మహిళకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చెయ్యడం చేతగాక , ఇతర రాష్ట్రాలపై నోటికి వచ్చిన వ్యాఖ్యలతో ప్రజలను

రెచ్చగొట్టడంపై మండిపడ్డారు. 

కేంద్రమంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షులు సుకాంత మజుందార్ తక్షణం మమతా బెనర్జీ పదవికి రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 

ఆమె కోరేది న్యాయం కాదు విధ్వంసం : బీజేపీ 

140 కోట్ల మంది ప్రజలు కోలకతా వైద్యురాలికి న్యాయం కోసం పోరాడుతూ

ఉంటె. . బెంగాల్ సీఎం మాత్రం విధ్వంసం కోరుకుంటోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మండిపడ్డారు. ఇది బెంగాల్ ప్రజలపై కరుడుకట్టిన వ్యతిరేకి చేస్తున్న వ్యాఖ్యలుగా అభివర్ణించారు. మమతా చేసిన విధ్వంసపూరిత వ్యాఖ్యలపై ఇండి కూటమి నేతలు స్పందించాలని డిమాండ్ చేసారు. 

కేంద్ర ప్రభుత్వం తృణమూల్

కాంగ్రెస్ నేత చేసిన విధ్వంసకర హెచ్చరికలను సీరియస్ గా తీసుకుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam