DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ ప్రగతి లో భాష, సాహిత్యం కీలక పాత్ర పోషిస్తాయి : డా. శారదా పూర్ణ 

*శారదాపూర్ణా కు విశాఖ సాహితి సంస్థ ఘన సమ్మానం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2024 (డిఎన్ఎస్):* దేశాభివృద్ధి కి, ప్రగతి కి తోడ్పడడానికి, భాష, సాహిత్య రంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రముఖ భాషావేత్త డా. సుసర్ల శారదా పూర్ణ తెలిపారు. తెలుగు, సంస్కృత భాషల్లో విస్తృత

పరిశోధన చేసి, రెండు భాషల్లోనూ పిహెచ్ డి సాధించి, దేశ, విదేశాల్లో వీటిపై అవగాహనా కల్పిస్తున్న శారదా పూర్ణ కు బరంపురం విశ్వ విద్యాలయం డి లిట్ పురస్కారం తో గౌరవించిన సందర్భంగా విశాఖ సాహితి సంస్థ అభినందన సభ నిర్వహించారు. 
సోమవారం విశాఖ లో జరిగిన ఈ కార్యక్రమం లో డా. శారదా పూర్ణ  తన జీవన యానాన్ని వివరించారు. విశాఖ

లోనే విద్యాభ్యాసం నుంచి పిహెచ్ డి వరకూ సాగిందని, ఈ ప్రయాణంలో కులపతి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వద్ద శిష్యరికం చెయ్యడం మరింత ఉజ్వలంగా సాగిందన్నారు. తల్లిదండ్రులు, ఆచార్యుల మార్గదర్శకం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఫలితంగానే ఈ రోజు అత్యున్నత గౌరవం లభించిందన్నారు.  
తెలుగు, సంస్కృత భాషల్లో పదకవితా

పితామహులు, తాళ్ళపాక అన్నమాచార్య రచనలపై  పరిశోధన చేయడంతో పాటు, వాటిని మానవాళికి ఉపయోగపడే విధానాన్ని ప్రచారం కూడా చేయడం జరుగుగొందన్నారు.  

సాహిత్య రంగంతో పాటు, వేద వాంగ్మయాన్ని కూడా అందరికీ అందించాలి అనే సంకల్పంతో తెలుగు, సంస్కృత భాషల్లో పుస్తక రచనలు చేశామన్నారు. వాల్మీకి రామాయణాన్ని వివరణాత్మక

అందరికి అందేలా రచన చేయడం జరిగిందన్నారు.

ప్రతి క్షణం తనకు అండగా నిలబడిన విశాఖ సాహితీ సంస్థ కు, దాని  అధ్యక్షులు ఆచార్య కొలవెన్ను మలయవాసిని లకు కృతజ్ఞతలు తెలిపారు.

తన పరిశోధన ను మొత్తం ఏడు ప్రకరణాలల్లో వివరించడం జరిగిందన్నారు. వీటిల్లో జీవన నాడీ వ్యవస్థ గురించి, వేద విజ్ఞానం గురించి, సామాన్య

లౌకిక జీవనం, దేశ వైభవం తదితర అంశాలు వివరించడం జరిగిందన్నారు.

*స్ఫూర్తి ప్రదాత శారదా పూర్ణ: విశాఖ సాహితి* 

తెలుగు, సంస్కృత  సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డా. సుసర్ల శారదా పూర్ణ  ను విశాఖ సాహితి సంస్థ ఉపాధ్యక్షులు, డా. కందాళ కనక మహాలక్ష్మి, కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల, తదితరులు గౌరవ

సత్కారం చేసారు. ఈ సందర్బంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత 54 ఏళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం, వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే దేశ, విదేశాల్లో  ద్విభాషా ప్రచారకర్త డా. శారదా పూర్ణ ను అభినందించడం జరుగుతోందని తెలిపారు.

శారదా పూర్ణ తెలుగు, సంస్కృత

భాషల్లో పి హెచ్ డి చేసి, బంగారు పతకాలు కూడా పొందడం గమనార్హం.    పూర్ణ చేసిన సాహిత్య కృషి కి గాను పూర్ణ బరంపురం విశ్వ విద్యాలయం వారు నుంచి డి లిట్ ( అత్యుత్తమ పురస్కారం ) పొందారన్నారు.

మహిళా మూర్తుల కృషి ఫలితంగా ఒక కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం కూడా ఉజ్వలంగా వెలుగొందుతాయన్నారు. తమ సంస్థ కు సహకారం

అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. 

సంస్థ కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల మాట్లాడుతూ  ఒక  సాహితీకారునికి గుర్తింపు పురస్కారాలతో రాదనీ, వారు చేసిన సాహితీ సేవ ద్వారా లభిస్తుందని, ఆ సేవ ను శారదా పూర్ణ ఇటు భారత దేశంలోనూ, అటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ విస్తృతంగా

చేస్తున్నారన్నారు. వీరు నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. 
ఈ కార్యక్రమం లో శారదా పూర్ణ కుటుంబ సభ్యులు, కళాభారతి కమిటీ సభ్యులు సుసర్ల రామ్ గోపాల్, పలువురు సాహితి వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam