DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినాయక చవితి వేడుకల్లో బూతు పాటలు, తైతక్కలాటలొద్దు

*పురాణ వినాయక రూపం మాత్రమే పెట్టాలి: హిందూ సంఘాలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 03, 2024 (డిఎన్ఎస్):* వినాయక చవితి ఉత్సవాల్లో సినీ డాన్స్ లు, చిత్ర విచిత్ర రూపాల్లో వినాయక విగ్రహాలను పెట్టవద్దని హిందూ సంఘాలు కోరుతున్నాయి. నాటి స్వాతంత్య్ర పోరాట సమయం లో భారత ప్రజలందరినీ

ఏకం చెయ్యడం కోసం బాలగంగాధర్ తిలక్ మొదలు పెట్టిన భక్తి ఉద్యమమే వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలు. అలాంటి భక్తి ఉద్యమాన్ని నేడు చిందరవందరగా చేసి, అసభ్య పాటలకు నృత్యాలతో, చిత్ర విచిత్ర రూపాల్లోవిగ్రహాలు పెట్టి సనాతన ధర్మాన్ని కించపరచడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి. ఇలాంటి పిచ్చిపిచ్చి తైతక్క వేషాలు వేస్తె

పుట్టగతులు లేకుండా పోతారని  హెచ్చరిస్తున్నారు.  

వాడవాడలా వినాయక చవితి మండపాలు పెట్టె వారందరికీ ఈ మేరకు హిందూ ధర్మచక్రం సేవా సమితి భాగ్యనగరం సభ్యులు మద్దికుంట శ్రీకాంత్ శర్మ సూచనలు చేస్తున్నారు. 

1 ) ఇతర మతాల వాళ్ళ వేడుకల్లో డీజే లు పెట్టి  మద్యం త్రాగి, అసభ్య పాటలకు సిగ్గులేకుండా డాన్స్

లు చెయ్యడం చూశామా?  
2 ) సినిమా హీరోల ఐటం సాంగ్స్ కు వాళ్ళు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా ⁉️
3 ) తమ దేవుడి ముందు బూతు  పాటలు  పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ⁉️
4 ) ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూసి ఉండరు. వీళ్లంతా ఎంతో చిత్తశుద్ధి తో, భక్తి శ్రద్దలతో తమ వేడుకలు జరుపుకుంటూ తమ మతాన్ని, తమ

ధర్మాన్ని గౌరవిస్తాయి. వాటిని కాపాడుకుంటున్నారు. 

అయితే వీళ్లెవరికి లేని తెగులు కేవలం హిందూ సంప్రదాయంలోని సెక్యూలర్ హిందువులకు మాత్రమే ఏడ్చింది. 

పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో. . లక్షలు ఖర్చు చేసి, భారీ విగ్రహాలు పెట్టడం, వీధి అంతా లైటింగ్ పెట్టడం. . . భక్తులకు ప్రసాద వితరణ చేస్తుంటారు.

ఇంతవరకూ బాగానే ఉంటుంది. ఆ తర్వాత మైక్ ల్లో సిగ్గులేని సినిమా పాటలు పెట్టి, అసభ్య డాన్సులు చేస్తుంటారు. విగ్రహాల ఊరేగింపు సమయంలో మద్యం త్రాగి, బట్టలు లేకుండా సిగ్గులేని డాన్స్ లు  చేస్తూ హిందూ ధర్మ విలువలను దిగజారుస్తున్నారు. 

1 ) వినాయక చవితి మండపాల్లో కేవలం పురాణాల్లో చెప్పిన విధంగా మాత్రమే వినాయక

విగ్రహాలు పెట్టాలి. అయితే కొందరు మదంతో, పిచ్చ్చి ఎక్కి, మతిభ్రమించి, సినిమా నటుల ఆకారాల్లో విగ్రహాలు, క్రికెట్ క్రీడాకారుల రూపాల్లో విగ్రహాలు పెట్టి హేళన చేస్తున్నారు. మరికొందరు పైత్యం బాగా ముదిరి హిందు ధర్మం తో ఏమాత్రం సంబంధం లేని కొందరి విగ్రహాలు కూడా పెట్టి పూర్తిగా సనాతన ధర్మాన్ని

కించపరుస్తున్నారు. 

ఉత్సవాలు, వేడుకలు కేవలం పురాణాల్లో చెప్పిన విధంగానే జరుపుకోవాలి తప్ప, ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు చేయరాదన్నారు. గత కొన్నేళ్లుగా తాము ప్రజల్లో అవగాహనా కల్పిస్తూనే ఉన్నామని, అయినప్పడికి ఈ తైతక్క డాన్స్ లు, తిక్కవేశాలు మానడం లేదన్నారు. 

మన  పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద

ఎత్తున జరుపుకోడాం తప్పు కాదు, వాటిని అవమాన పరచడం తప్పు అన్నారు. ప్రతి మండపం ముందు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి  నిలబడుతుంది. 

ఇతర మతస్తులు  మనలా తమ మతపరమైన కార్యక్రమంలో

ఎలాంటి  వికృత చేష్టలు   చేయరు. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తారు, అవసరమైతే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తియ్యడానికి కూడా వెనుకాడరు. 

ఈ విష సంస్కృతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మండపాలలో సంప్రదాయ పురాణ గణపతి కనబడుతారా ❓ అని ప్రశ్నించారు. 

ఈ విధంగా సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడం కోసం ఇతర

మతోన్మాదులు ఎంతగా కృషి చేస్తున్నారో, సెక్యూలర్ హిందువులు అంతకు రెట్టింపు గా పోటీపడుతున్నారు. 

మీరు విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చెయ్యక పొతే మిమ్మల్ని అడిగే వాడు ఎవ్వడూ లేదు కానీ, సంప్రదాయాన్ని మాత్రం చెడగొట్టకండి. అని హెచ్చరిస్తున్నారు. 

1 ) మండపాల్లో కేవలం సంప్రదాయ వినాయక విగ్రహాలు మాత్రమే

పెట్టండి.

2 ) మండపాల దగ్గర మైక్ ల్లో కేవలం భక్తి సంగీత పాటలు వెయ్యాలి లేదా భజనలు మాత్రమే చేయ్యాలి, సినిమా పాటలు పెట్టకండి.   

3 )  మండపాల వద్ద, ఊరేగింపుల్లోనూ కేవలం కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు మాత్రమే ఉండాలి.  సినిమా తైతక్క డాన్స్ లు వెయ్యరాదు. 

4 ) విగ్రహాలు ఊరేగింపు కు వస్తుంటే. .

భక్తులు చూసేలా ఉండాలి తప్ప, చికాకు పడేలా ఉండరాదు. 

5 ) మండపాల వద్ద మద్యం త్రాగేవారిని, ధూమపానం పీల్చేవారిని రానివ్వవద్దు.  

6 ) మండపాల వద్ద ప్రతి రోజూ సమాజానికి ఉపయోగ పడే ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంగీత కచేరీలు, పిల్లలచే పద్యాలూ, శ్లోకాల పోటీలు, ముగ్గుల పోటీలు,  శాంతి హోమాలు వంటివి మాత్రమే

జరపాలి. 

7 ) వినాయక చవితి మండపం లోకి వస్తే ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరించాలి తప్ప, చికాకు రాకూడదు. 

8 ) రాజకీయ పార్టీల వ్యక్తులు కూడా సామాన్య భక్తులే అనే విధంగా మండపాల నిర్వాహకులు వ్యవహరిస్తే . . ఉత్సవం వైభవంగా జరుగుతుంది. 

9 ) ప్రక్క మండపం వారితో పోటీ పడి ధర్మ భ్రష్టత చెందవద్దు. 

10

) మహారాష్ట్రలో వినాయక విగ్రహాల ఊరేగింపు లో పురుషులు, మహిళలు సంప్రదాయ నృత్యాలు, ఢోల్స్ వాయిద్యాల విన్యాసాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా జనం వస్తుంటారు. వాళ్ళ తరహాలో ఉత్సవాలను మనం కూడా జాపూరుకుందాం.  

కనీసం ఇప్పటి నుంచైనా, గణేశోత్సవం, నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. మన

సంస్కృతిని కాపాడుకుందాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం అని పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam