DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా విశాఖ చరిత్రలో హెచ్పిసిఎల్ బ్లాస్ట్ నల్లని మచ్చ. . 

*1997 నాటి దుర్ఘటన నుంచి పాలకులు పాఠాలు నేర్చుకోలేదా? *

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2024 (డిఎన్ఎస్):* దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) విశాఖ్ రిఫైనరీలో సెప్టెంబర్ 14, 1997, న జరిగిన దుర్ఘటన విశాఖ చరిత్రలోనే నల్లని మచ్చగా

మిగిలిపోయింది. నాటి ఉదయం 6 : 15 నిమిషాల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించడం తో విశాఖ నగరం ఉలిక్కి పడింది. ఏమి జరిగిందో తెలుసుకునే లోగానే అగ్నిప్రమాదం సంభవించి జరగరాని ప్రాణనష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 56 మంది మృత్యువాత పడగా, 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదివారం సెలవు కావడం, ఉదయం షిఫ్ట్ కి ముందు సమయం కావడం తో ప్లాంట్ లో

సిబ్బంది చాలా తక్కువ మందే ఉన్నారు. అదే పనిదినం అయినా ఉంటె. . ప్రమాదపు పరిణామం ఊహించనలవి కాదు అనే అభిప్రాయం ఆనాడే నిపుణులు వ్యక్తం చేశారు.  

వైజాగ్ పోర్ట్ నుండి స్టోరేజీ ఫారమ్‌కు ఎల్‌పిజి పైప్‌లైన్‌లో అనుమానాస్పదంగా లీక్ కావడంతో ఉదయం 6:15 గంటలకు మంటలు చెలరేగాయి.  ఇది వరుస పేలుళ్లకు కారణమైంది మరియు

వెంటనే కనీసం ఆరు ఇతర నాఫ్తా మరియు పెట్రోల్ ట్యాంక్‌లకు వ్యాపించింది. ఆ సమయంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా విధుల్లో ఉన్నారు. 

నష్టం:

పేలుడు కారణంగా చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, LPG స్టోరేజీ నాళాలు మరియు పెట్రోలియం లిక్విడ్ స్టోరేజ్

టెర్మినల్ ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం US\$15 మిలియన్లుగా అంచనా వేయబడింది.

నాప్తా, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మరియు ఫర్నేస్ ఆయిల్ కలిగిన 11 స్టోరేజీ ట్యాంక్‌లతో పాటు, LPGని కలిగి ఉన్న ఆరు ''హార్టన్ స్పియర్స్''తో సహా మొత్తం ఉత్పత్తి టెర్మినల్ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. రిఫైనరీ అడ్మినిస్ట్రేటివ్ భవనం, దాని

క్యాంటీన్ మరియు మరికొన్ని భవనాలు కార్డుల ప్యాక్ లాగా కూలిపోయాయి. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా ఇంత నష్టం ఉండేది కాదు.

కారణం:

ఒత్తిడితో కూడిన ఓడ నుండి సరుకును స్వీకరించే సమయంలో LPG లీక్ ఒక ఆవిరి మేఘానికి దారితీసింది, అది శుద్ధి కర్మాగారం అంతటా వ్యాపించింది మరియు చివరికి

మండింది.

ప్రతిస్పందన : ఈ పరిశ్రమ చుట్టుప్రక్కల నివాస ప్రాంతాలు కావడంతో ప్రాణభయంతో తమ ఇళ్లను వదిలి పారిపోయిన 70,000 మంది ప్రజల కోసం స్థానిక పరిపాలన 10 సహాయ శిబిరాలను ప్రారంభించింది. దాదాపు రెండు నెలల మరమ్మతుల తర్వాత రిఫైనరీని పునఃప్రారంభించారు. 

పాఠాలు నేర్చుకోలేదా? 

ఈ ప్రమాదం ద్వారా

ప్రభుత్వాలు గానీ, పరిశ్రమల నిర్వాహకులు గానీ పెద్దగా పాఠాలు నేర్చుకున్నట్టు కనపడలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రయివేట్ రంగ పరిధిలోనే పరిశ్రమల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలో వాటిని పూర్తిగా ఏర్పాటు చెయ్యడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. పరిశ్రమల శాఖా ల నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు లేని కారణంగా తదుపరి కాలంలో

మరిన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణనష్టం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఫార్మా సిటీ, స్టీల్ ప్లాంట్, పొలిమెర్స్ ఇలా ఎన్నో సంస్థల్లో ప్రమాదాలు జరిగాయి. 

పరిశ్రమల చుట్టూ నివాస వాడలు ఉండడంతో ప్రజలు భయం గుప్పెట్లోనే బ్రతుకుతున్నారు.  నాడు  విధుల్లో ఉన్న హెచ్పిసిఎల్  ఉద్యోగులు నేటికీ ఆ భయానక దృశ్యాలను

తలుచుకుంటే ఎంతో ఆవేదన చెందుతున్నారు. 

మీడియా కు నాడే వార్నింగ్ . . .

ఈ ఘటన సమయంలో ధైర్యం చెప్పవలసిన మీడియా సంస్థలు, అవాస్తవ పుకార్లను ప్రచారం చేస్తున్నారు అనే ఫిర్యాదు అందడంతో నాటి జిల్లా కలెక్టర్ వీణా ఈష్ తీవ్ర హెచ్చరిక జారీ చేసారు. ప్రజల్లో మరింత ఆందోళన కలిగే సమాచారాన్ని ఎవరు ప్రసారం చేసినా,

కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ కాలంలో ప్రస్తుతం ఉన్న టీవీ ఛానెల్స్ లేవు, సోషల్ మీడియా ప్రభావం అసలే లేదు.  నేటి మీడియా చేస్తున్న మితిమీరిన వైఖరి తో పోలిస్తే నాటి మీడియా చాలా సంప్రదాయంగా ఉండేది అని చెప్పవచ్చు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam