DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల అపచారం పై నాటి రాజగురువు నోరు విప్పాలి.

విహెచ్ పి రాష్ట్ర మఠ్ మందిర్ టోలి పూడిపెద్ది డిమాండ్ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, సెప్టెంబర్, 20, 2024 (డి ఎన్ ఎస్):*  తిరుమల దేవస్థానం లో ప్రసాద తయారీ లో అపచారం జరిగిందని సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పై గత ప్రభుత్వం లో రాజగురువులుగా వ్యవహరించిన

ప్రఖ్యాత మహామండలేశ్వర్లు నోరు విప్పాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మఠ్ మందిర్ టోలి పూడిపెద్ది డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రసరింపచేస్తున్న తిరుమల వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రసాద తయారీలో జంతు విసర్జన తైలం వినియోగం చేసారని ఏపీ సీఎం

చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన తో యావత్ హిందూ సమాజం ఉలిక్కి పడిందన్నారు. 
గత 5 ఏళ్ళ కాలంలో ఏపీ లోని ఏ దేవాలయంలో ఏమి చెయ్యాలన్నా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల ఆమోదం తప్పని సరి. వారు శైవాగమానికి చెందిన వారైనా వైష్ణవ దేవాలయాలైన తిరుమల, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, సహా అన్ని దేవాలయాల్లో సుదర్శన చక్రం, శైవ త్రిశూలం

కలిసి తెగ త్రిప్పారన్నారు. అంతర్వేదిలో రధం క్రైస్తవులు కాల్చినా. .రామతీర్ధంలో  రాముని విగ్రహం భిన్నం చేసిన, వందలాది గుళ్ళు కూల్చినా ఖండించని వీరు, ఆ రధం ఎలా తయారు చెయ్యాలో సూచనలు చేసేశారన్నారు. 
సింహాచల క్షేత్రం పాంచరాత్ర ఆగమం లో నడుస్తుంది. అక్కడ కూడా తన సూచనలు అందించేశారని మండిపడ్డారు.  అలాంటిది వారి

రాజగురుత్వ కాలంలో జరిగిన అత్యంత ఘోర తప్పిందం పై వారు నోరు విప్పి రహస్యం చెప్పవల్సిందేనని డిమాండ్ చేశారు. 

నేడు తిరుమల ప్రసాదం లో జంతు కళేబరాల తైలం వినియోగించారు అని సీఎం చేసిన ప్రకటనపై అవును అనో, కాదు అనో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇతర పీఠాధిపతులు ఎవ్వరికీ ఇవ్వని సూపర్ ప్రోటోకాల్ పొందిన రాజగురువులు

నుంచి ఏపీ లోని దేవాలయాల్లో జరిగే విషయాలపై సూచనలు పొందిన విషయం తెల్సిందే. 

తిరుమల క్షేత్రంలోని అనాచారం పై వీరి సూచనలే తీసుకున్నారా నాటి పాలకులు అనేది తెలియాలి. లేక ఈ విషయం తనకు సంబంధం లేదు అని రాజగురువులు చెప్తారా అని హిందూ సమాజం ఎదురుచూస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam