DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి చే విశాఖ లో గీతా జయంతి వేడుకలు 

*డిసెంబర్ 7 నుంచి 11 వరకూ గీతామృత ప్రచావనాలు*  

*విశాఖ వాసులకు వారిజ, వికాస తరంగిణి ఆహ్వానం*

విశాఖ పట్నం 04, డిసెంబర్ 2024 ( డిఎన్ఎస్) : అపరరామానుజులు, పరమహంస పరివ్రాజకాచార్యులు,  ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు  డిసెంబర్ 7 నుంచి 11 వ తేదీ వరకూ  విశాఖపట్నం లో నిర్వహించే

గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా వారిజ ఆశ్రమం కమిటీ, వికాస తరంగిణి ఆంధ్ర ప్రదేశ్ శాఖలు ఆహ్వానం భక్తులందరికీ  పలుకుతున్నాయి.  
విశాఖపట్నం సీతమ్మధార లో గల వర్మ కాంప్లెక్స్ ( పాత ఈనాడు ప్రాంగణం ) లో ఈ గీతా జయంతి వేడుకలు జరుగనున్నాయి. సభ వేదిక వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికాస తరంగిణి ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఏం ఎస్ ఎస్ ఆర్ వర్మ మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలనీ, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలి అనే సంకల్పంతో  ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.  

ఈ వేడుకల్లో ప్రతి రోజూ ఉదయం, స్వామి వారిచే భగవద్గీత ప్రవచనం, అనంతరం తీర్థ

గోష్ఠి, భక్తుల గోత్రనామాలతో గోపూజలు, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, తదుపరి గీతా ప్రవచనం జరుగుతాయన్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 8 న ఉదయం 10 గంటల నుంచి శ్రీరామ పాదుకా ఆరాధన, సాయంత్రం నేత్ర విద్యాలయ విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియ చేశారు.  

10 వ

తేదీన ఆసక్తి కల్గిన భక్తులకు మంత్రోపదేశం ( సమాశ్రయణం)  చేయడం జరుగుతుందని తెలిపారు. 

వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు మాట్లాడుతూ మానవాళి మనుగడకు మార్గదర్శకంగా నిలిచిన భగవద్గీత శ్లోకాలను నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నేర్పించడం జరిగిందని తెలిపారు. ఒక్కో పాఠశాలలో 108

మంది విద్యార్థులకు ఒక అధ్యాయం నేర్పించి, వారందరితో కలిసి ఈనెల 11 న స్వామివారు  సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయించడం జరుగుతుందన్నారు.  

భక్తులందరికీ ప్రతిరోజూ ఉదయం బాలభోగం ( అల్పాహారం ), మధ్యాహ్నం తదీయారాధన. ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఐదు రోజుల పాటు స్వామివారి అమృత వాక్కుల ద్వారా  భగవద్గీత

తరంగాలు సాగర తీర విశాఖ నగరవాసులను తరింపచేయనున్నాయి. ప్రత్యక్షంగా స్వామిని దర్శించడం ద్వారా మధురానుభూతిని పొందవచ్చని తెలిపారు. 

ఈ వేడుకల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసింది గా అందరినీ ఆహ్వానిస్తున్నారు.

*దేశంలోనే అద్భుతం నేత్ర విద్యాలయ:*

ఈ సందర్భంగా వారిజ

వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై  శ్రీకాంత్ మాట్లాడుతూ దాదాపు  7 సంవత్సరాల తర్వాత చిన్న జీయర్ స్వామి విశాఖ లో బృహత్తర కార్యక్రమం చేస్తున్నారన్నారు. విశాఖ - భీమిలి బీచ్ రోడ్ లోని మంగమారిపేట లో గల వారిజ ఆశ్రమం లో  ఒక ప్రక్క వేద పాఠశాలను, అదే ప్రాంగణం లో దివ్య నేత్రులకు (అంధ విద్యార్థులకు) నేత విద్యాలయ పాఠశాలను

నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరందరికి ఉచిత విద్యను అందిస్తున్నట్టు తెలియచేసారు. గత 20 ఏళ్లు గా నేత్ర విద్యాలయ ద్వారా వందలాది మంది అత్యుత్తమ శిక్షణ పొంది, వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సైతం చేస్తున్నారు. విశాఖ లోని ఈ పాఠశాలలో ప్రస్తుతం 10 వ తరగతి వరకే ఉందని, రానున్న విద్యా సంవత్సరం నుంచి వారిజ ప్రాంగణంలోనే ఇంటర్, డిగ్రీ

కోర్సులను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వాటికి ప్రత్యేక భవనాలు నిర్మాణం సాగుతోందని వివరించారు. 

విదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో కంప్యూటర్ల ద్వారా నేత్ర విద్యాలయ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. అంధ విద్యార్థులకు  ఇంతటి అత్యుత్తమ విద్య విధానం అందిస్తున్న ఏకైక సంస్థ చిన్న జీయర్ స్వామి

వారి నేత్ర విద్యాలయ మాత్రమేనన్నారు. కంప్యూటర్లపై అసామాన్య ప్రతిభను చాటుతూ పరీక్షలు కూడా సహాయకులు లేకుండా హాజరవుతున్నారన్నారు.  

వీరు విద్య తో పాటు, క్రీడలు, పాటలు, పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపుతూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సైతం సాధించారన్నారు. గత ఏడాది శ్రీలంక, అమెరికా వేదికలపై సైతం తమ

ప్రతిభను చాటారన్నారు.  

ఈ పత్రిక సమావేశంలో వారిజ కమిటీ సభ్యులు, ఎం ఎస్ రాజు, సాతులూరి రామానుజం, టి. నారాయణ రెడ్డి, కాశి రాజు, బుస్కీ మాస్టర్, పి ఎస్ ఎన్ రాజు, వారిజ వేద పాఠశాల ఆచార్యులు సంతోష్ కుమార్, నేత్ర విద్యాలయ ఇంచార్జి శిరీష తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam