DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంగళగిరి లో చిన్న జీయర్ స్వామిజి,  ధనుర్మాస వ్రత దీక్ష

*డిసెంబర్ 16 నుంచి దేశ విదేశాల్లో వైభవంగా ధనుర్మాస వేడుకలు*

*13 న గోదారంగనాధుల కళ్యాణం తో వ్రతం పరిపూర్ణం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 15, 2024 (డి ఎన్ ఎస్):* ఈనెల 16 నుంచి ప్రారంభమవుతున్న ధనుర్మాసోత్సవ వేడుకలు దేశ విదేశాల్లోని అన్ని వైష్ణవ

క్షేత్రాలు, ఆలయాలు, గృహాల్లో సోమవారం ఉదయం  వైభవంగా సంప్రదాయ పరంగా ప్రారంభమవుతున్నాయి. అపార రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు, ఎన్నో వేదపాఠశాలలు, అధ్యయన కేంద్రాల స్థాపకులు, శ్రీమదుభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ధనుర్మాస ఉత్సవాలను మంగళగిరి సమీపంలోని బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 16

నుంచి నిర్వహిస్తున్నారు. 
అపర రామానుజులుగా ఖ్యాతిగాంచిన చిన్న జీయర్ స్వామి అందించిన ధనుర్మాస వ్రత విధాన క్రమం అనుసరిస్తూ లక్షలాది మంది ఇళ్లలోనూ, దేవాలయాల్లోనూ వైభవంగా ఆచరిస్తున్నారు. స్వామి వద్ద మంత్రోపదేశం పొందిన లక్షలాది మంది తమ గృహాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఒక క్రమ విధానాన్ని కోశం రూపంలో

అందించడం ద్వారా నేర్చుకునే వారు సైతం సులభంగా వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. 
ఈ ఏడాది శ్రీకృష్ణ దీక్ష అందిస్తూ. . .మంచి సంకల్పం తో వ్రతాన్ని ఆచరించే విధంగా దీక్షలను అందిస్తున్నారు. 

ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గోడ అష్టోత్తర నామార్చన, తిరుప్పావై సేవాకాల గోష్టి, నివేదన, తీర్థగోష్టి, జీయర్

స్వామి తిరుప్పావై ప్రవచనం కొనసాగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5 :30 గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, అనంతరం చిన్న జీయర్ స్వామి ప్రవచనం జరుగనున్నాయి. 

జనవరి 10 న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, పర్వదినోత్సవం. ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది. 

విశేష పాశురాలు ఇవే: 16-12-2024 (    సోమవారం ) : మార్గజి

త్తింగళ్,  18-12-2024 ( బుధవారం ) : ఓంగి యులగళంద, 31-12-2024 ( మంగళవారం ): నాయగనాయ్ నిన్జ, 02-01-2025     ( గురువారం ) : ఉన్దు మదగళిత.  03-01-2025 ( శుక్రవారం ): కుత్తు విళక్కెరియ (దీపోత్సవం ) , 
07-01-2025 ( మంగళవారం ): మారి మలై ముజఇల్, 08-01-2025     (  బుధవారం ) :అన్టు ఇవ్వులగమ్ (నీరాజనం),  11-01-2025 (  శనివారం )    :కూడారై వెల్లుమ్ శీర్ ( క్షీరాన్న ప్రసాదం), 
/> 12-01-2025 ( ఆదివారం ): కఱవైగళ్ పిన్ శెస్టు, 13-01-2025 ( సోమవారం) : శిత్తుమ్ శిఱుకాలే (శాత్తు), వంగక్కడల్ కడైంద (శాత్తు), వ్రతం పూర్తి. అనంతరం అదే రోజు గోదా రంగనాధుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam