DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆండాళ్ తల్లే అందరికి ఆదర్శం: త్రిదండి శఠకోపముని జీయర్ స్వామి 

*గోవిందుణ్ని చేరుకునేందుకు గోదా చూపిన మార్గమే ధనుర్మాసం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, డిసెంబర్ 16, 2024 (డి ఎన్ ఎస్):* మానవాళి మహత్తర స్థాయి కి చేరుకోవడంలో మన అందరికి ఆదర్శం ఆండాళ్ అమ్మవారేనని త్రిదండి శఠకోపముని జీయర్ స్వామి తెలియచేసారు. అత్యంత పవిత్రమైన ధనుర్మాస ప్రారంభ

సందర్బంగా వారు DNS మీడియా ద్వారా అనుగ్రహ భాషణం అందించారు. 

శ్రీమన్నారాయణుని చేరుకోడానికి అత్యంత సులభమైన సాధనం ధనుర్మాస వ్రతమని, దీన్ని గోదా దేవి తానూ స్వయంగా ఆచరించి చూపిందని స్వామి తెలియచేసారు. మనం కూడా గోదా ఆచరించి చూపిన ధనుర్మాసం వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రాపంచిక, ఆధ్యాత్మిక లక్ష్యాలను

చేరుకోవచ్చని వివరించారు. 

ప్రాపంచిక ఫలితాలైన సకల వర్షాలు, శాంతి యుత వాతావరణం, ప్రజల మధ్య సోదరభావం వెలువడే ఫలితాలను అందిస్తున్నారు. బలం లేని ఇటుకలు భవనానికి ముప్పు అని, ప్రజల్లో ఆధ్యాత్మిక పరమైన బలాన్ని కల్గించే విధంగా ఈ ధనుర్మాస వ్రతం ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజానికి మార్గదర్శిగా

నిలిచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు చూపిన మార్గంలో అందరం నడుద్దామని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిద్దామని తెలియచేసారు. 

ఇటీవలే తురీయాశ్రమ స్వీకారం చేసిన త్రిదండి శఠకోపముని జీయర్ స్వామి కర్ణాటక రాష్ట్రంలోని మేల్కొటే క్షేత్రంలో ఆనందాశ్రమ పాఠశాల కేంద్రంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని

కల్గించనున్నారు. సన్యాస దీక్ష తదుపరి ప్రముఖ దివ్యక్షేత్రాలను పర్యటించి, ఆయా క్షేత్రాల్లో వేంచేసిన పెరుమాళ్ళ దర్శించారు.   

ధనుర్మాస వైభవం తెలియచేస్తూ తొలి పాశుర విన్నపం చేసి, పాశుర అంతరార్ధం వివరించారు. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ఆరంభమవుతుందని, నెల రోజుల పాటు దీక్షగా

స్వామిని ప్రార్ధించడం ద్వారా స్వామిని చేరుకోవచ్చు అన్నారు. 
ఈ కాలంలోనే తమిళనాడు కు చెందిన గోదాదేవి ( ఆండాళ్) ఆచరించి చూపిందన్నారు. రోజుకో పాశురం ద్వారా నారాయణ స్వరూపాన్ని ఈ లోకానికి అందించిందన్నారు. 

పా: .
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్

గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !
"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి

పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని

వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి

తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర

వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం అని వివరించారు.  

ధనుర్మాస వేడుకల కార్యాచరణ :  . . 
ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గోదా అష్టోత్తర నామార్చన, తిరుప్పావై సేవాకాల గోష్టి, నివేదన,

తీర్థగోష్టి, తదుపరి జీయర్ స్వామి ప్రవచనం కొనసాగనున్నాయి. 

విశేష పాశురాలు ఇవే: 
16-12-2024 (    సోమవారం ) : మార్గజి త్తింగళ్,  18-12-2024 ( బుధవారం ) : ఓంగి యులగళంద, 31-12-2024 ( మంగళవారం ): నాయగనాయ్ నిన్జ, 02-01-2025     ( గురువారం ) : ఉన్దు మదగళిత.  03-01-2025 ( శుక్రవారం ): కుత్తు విళక్కెరియ (దీపోత్సవం ) , 
07-01-2025 ( మంగళవారం ): మారి మలై ముజఇల్,

08-01-2025     (  బుధవారం ) :అన్టు ఇవ్వులగమ్ (నీరాజనం),  11-01-2025 (  శనివారం )    :కూడారై వెల్లుమ్ శీర్ ( క్షీరాన్న ప్రసాదం), 
12-01-2025 ( ఆదివారం ): కఱవైగళ్ పిన్ శెస్టు, 13-01-2025 ( సోమవారం) : శిత్తుమ్ శిఱుకాలే (శాత్తు), వంగక్కడల్ కడైంద (శాత్తు), వ్రతం పూర్తి. అనంతరం అదే రోజు గోదా రంగనాధుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam