DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సు నిత్యం కోరుకునేవాళ్ళు బ్రాహ్మణులే

*కాసలనాడు బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సదస్సులో వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, డిసెంబర్ 16, 2024 (డి ఎన్ ఎస్):* సమాజంలోని అందరూ సుఖంగా ఉండాలి ని నిత్యం కోరుకునేవాళ్ళు బ్రాహ్మణులెనని కాసలనాడు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలియచేసారు. విశాఖపట్నం లో జరిగిన కాసలనాడు

బ్రాహ్మణ సంక్షేమ సంఘం  సభ్యుల ఆత్మీయ సమావేశం లో అధ్యక్షులు  శిష్ట్లా లక్ష్మీ నరసింహ మూర్తి , కార్యదర్శి శిష్ట్లా క్షీరసాగర్ లు మాట్లాడుతూ ప్రతి దేవాలయాల్లోనూ ఆరాధనలు అనంతరం సర్వే జనా సుఖినో భవంతు అని మంత్రం చెప్పడం జరుగుతుందన్నారు. సమాజం లోని ప్రజలు సుఖంగా ఉంటె. . ప్రజా జీవనం సక్రమంగా

జరుగుతుందన్నారు. 

విశాఖపట్నం ద్వారకానగర్ లో గల బివికె కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ కలయిక లో సమాజ సంక్షేమం కోసం సప్తఋషి పీఠం వేదపాఠశాల నిర్వాహకులు మావళ్లపల్లి మాధవ శర్మ నిర్వహణలో వేదసదస్యం జరిగింది. ఈ సభలో వేద విద్యార్థులు వేదపఠనం చేసారు.  వేద పండితులకు సముచిత రీతిన సత్కారం చేపట్టారు. కవి, రచయిత

దేవులపల్లి దుర్గాప్రసాద్ వ్యాఖ్యానం కార్యక్రమానికి నిండుతనం చేకూర్చింది. ఈ సందర్భంగా సంఘం సభ్యుల పిల్లలకు ప్రోత్సాహక విద్యా ఉపకారవేతనాలు అందజేశారు.  

ఈ సందర్భంగా త్వరలో  పున: ప్రారంభం కానున్న బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పథకాలు అర్హులైన లబ్దిదారులకు చేరేలా కృషి  చేస్తామని తెలిపారు. నూతనంగా

ప్రారంభమైన సంఘం కార్యాలయం నుంచి కార్యాచరణ విస్తృతంగా జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కాలనాధభట్ట శ్రీరామ శాంతి స్వరూప్ , మామిళ్లపల్లి నాగబాబు, మిస్సుల సూర్యనారాయణ, మిస్సుల సీతారామాంజనేయులు, నూకల నరసింహ మూర్తి, మిస్సుల మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో భాగంగా

మెదడుకు మేత గా కుటుంబ సభ్యులకు ఆటవిడుపుగా పురాణ ప్రశ్నలు,  చిన్న పిల్లలకు సంధించిన సరదా ప్రశ్నలు అందరిని ఆకట్టుకున్నాయి.  
యువ గాయని శిష్ట్లా అంజన సంస్కృతి  శాస్త్రీయ గాత్ర కచేరి శ్రోతలను మైమరపించింది. 
వివిధ రకాల వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక  కార్యక్రమాలను  కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు అంద

చేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam