DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూ అభివృద్ధిలో ప్రజల పాత్ర కీలకం, విశాఖ క్యూరేటర్ మంగమ్మ 

*(DNS Report: సాయిరాం CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, డిసెంబర్ 27, 2024 (డి ఎన్ ఎస్ ):* ఆసియాలోనే అతి పెద్ద విస్తీర్ణం కల్గిన ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని విశాఖపట్నం జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు.  విశాఖపట్నం జూ ఇంచార్జి భాద్యతలు చేపట్టిన ఆమె డి ఎన్ ఎస్

న్యూస్ మీడియా కు తెలిపిన వివరాల ప్రకారం రానున్న కాలంలో జూ పార్క్ ను  మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని, సందర్శకులను ఆకట్టుకునేందుకు పలు వినూత్నం కార్యక్రమాలను చేపట్టనున్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులను ఆహ్వానించి, వన్య సంరక్షణ విధానం పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రానున్న

కాలంలో ప్రజలను సైతం భాగస్వాముల్ని చేస్తూ వన్య ప్రాణులపై అవగాహనా కల్పిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు  వ్యాసరచన, స్పాట్ పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. జూ అభివృద్ధి లో స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలను సైతం భాగస్వాముల్ని చేస్తామన్నారు. 
అటవీ, వన్య సంరక్షణ ఉప

అధికారిగా ఉన్న మంగమ్మకు పూర్తి ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది. గతంలో ఉత్తర ప్రాంత జోనల్ మేనేజర్ గాను, కృష్ణ జిల్లా అటవీ శాఖా అధికారిగాను, విజయవాడ డివిజన్ అటవీ శాఖా అధికారిగా, విధులు నిర్వహించారు.  వీరు 2012 లో అటవీ శాఖా లో చేరి, డెహ్రాడూన్ లో శిక్షణ పొందారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam