DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ శంఖారావం విజయం తో అన్యకులు అతలాకుతలం

*పీఠాధిపతుల భరోసాతో  రెట్టించిన ఉత్సాహం లో హిందూ సైన్యం*  

*మన గుళ్ళు మనమే నిర్వహించుకుందాం.: చిన్న జీయర్ స్వామి* 

*సోషల్ మీడియాలో హిందూ సమాజంపై విరుచుకుపడుతున్న అన్యకులు* 
 
విశాఖపట్నం / విజయవాడ, 07 జనవరి 2025 (డి ఎన్ ఎస్): రెండు రోజుల క్రితం విజయవాడ కేంద్రంగా జరిగిన హైందవ శంఖారావం బహిరంగ

సభ అద్వితీయంగా విజయవంతం కావడంతో హైందవేతర వర్గాల్లో కలకలం మొదలయ్యినట్టు తెలుస్తోంది. దాని ప్రభావం సోషల్ మీడియా లో విస్తృతంగా కనపడుతోంది. సభకు హాజరైన పీఠాధిపతులను, నిర్వాహకులను, పాల్గొన్న హిందూ సైన్యాన్ని నోటికి వచ్చిన దుర్భాషలాడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. వీటికి తగిన సమాధానం చెప్తున్నా హిందువర్గాలపై నోటికి

వచ్చిన అసభ్య పదజాలం తో బెదిరింపులు సైతం చేస్తున్నారు. వీళ్ళ వైఖరి చూస్తే. . హైందవ శంఖారావం ఏ స్థాయిలో వాళ్ళని ప్రభావితం చేసిందో తెలుస్తోంది. 
ఇక ఇదే వేదిక నుంచి దేవాలయ పరిరక్షణ, హిందూ ధర్మ రక్షణ పై హిందూ సమాజానికి పీఠాధిపతులు ఇచ్చిన పిలుపు వ్యతిరేక వర్గాలను మరింత పెట్రేగిపోయేలా చేసింది. దీంతో ఇలాంటి పనికిరాని

సభలకు ఖర్చు చేసే కోట్లాది రూపాయలు పేదలకు పంచాలి అంటూ సోషల్ మీడియా లో కామెంట్లతో మరింత పేట్రేగిపోయారు. ఈ సభ పూర్తిగా హిందూ సమాజం తమ సొంత ఖర్చుతో నిర్వహించుకున్నది. ఏ ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, మా డబ్బుతో మెం సభ పెట్టుకుంటే మీ ఇబ్బంది ఏంటని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి అన్యమత ఉత్సవాలు జరుపడం

ఏంటని ప్రశ్నిస్తున్నారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక శక్తులకు చాలా ఘాటుగా తగిలాయి. సినిమాల్లో హిందూ ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు పెడితే చూస్తూ ఊరుకోమంటూ చేసిన హెచ్చరికలు సినీ వర్గాల్లో కలవరాన్ని కల్గించాయి. హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడమే లక్ష్యం గా పెట్టుకుని తీస్తున్న

సినిమా వర్గాలకు నిద్రపట్టడం లేదు. బహిరంగ సభలో హిందూ సైన్యానికి శ్రీరామ్ చేసిన సూచనలు అందరిలోనూ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. 

*మన గుళ్ళు మనమే నిర్వహించుకుందాం.: చిన్న జీయర్ స్వామి* 

ప్రభుత్వ పెత్తనం తో వందల ఏళ్ళ నుంచి దోచుకోబడుతున్న హిందూ దేవాలయాల  పరిరక్షణ ధర్మాచార్యులకే అప్పగించాలని అపర

రామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి సభలో హెచ్చరించారు. హైందవ శంఖారావం సభ వేదికగా హిందూ దేవాలయ పరిరక్షణ పై లక్షలాది హిందువులకు అయన మార్గదర్శకం చేసారు. ఒక్క దేవాలయం కూడా కట్టడం చేతగాని ప్రభుత్వాలకు, ఎవరో కట్టిన గుళ్లపై పెత్తనం చేసే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. శతాబ్దాల క్రితం రాజులూ, జమీన్ దార్ లు గుళ్ళు

కట్టి, వేలాది ఎకరాల భూములను వాటికీ విరాళంగా ఇచ్చారన్నారు. వాటిని రక్షించవలసిన ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయన్నారు. సుమారు 15 లక్షల ఎకరాల భూములు దేవాలయాలకు రాజులూ విరాళం ఇచ్చారని, అయితే నేడు కేవలం వందల సంఖ్యలో మిగిలాయన్నారు. ఈ భూములను ఎవరు ఆక్రమించినా, ఎన్ని చేతులు మారినా.. . వాటిని తిరిగి ఆ దేవాలయానికి స్వాధీనం

చెయ్యాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వాటిని అమలు చెయ్యవలసిన భాద్యత  రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందన్నారు. దీన్ని తక్షణం అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. దీనికోసం గ్రామా స్థాయి లో కమిటీలు వేసుకుని పోరాటం చేద్దామన్నారు. 
మానవాళి మనుగడకు రక్షణ కల్పించేది కేవలం హిందూ దేవాలయం మాత్రమేనన్నారు. బ్రిటిష్ కాలం

లో హిందూ వ్యవస్థను నాశనం చేసేందుకు ఏర్పాటు చేసిన చట్టాలకు రూపమే. . దేవాదాయ శాఖా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హిందూ సమాజానికి మాత్రం స్వతంత్రం రాలేదన్నారు. 

పలువురు ధర్మాచార్యులు మాట్లాడుతూ అసంబద్ధమైన చట్టాల పేరుతొ హిందూ వ్యవస్థను నాశనం చేసేందుకు నేటి ప్రభుత్వాలు తమవంతు సహకారాన్ని

అందిస్తున్నామన్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం కేవలం హిందూ సంబంధ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేసారు. దేవాలయాలు, ట్రస్టు ల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగాలను తక్షణం తొలగించాలని డిమాండ్ చేసారు. 

సెక్కులర్ అని చెప్పి ప్రభుత్వాలు కేవలం హిందూ గుళ్లను మాత్రమే ఆక్రమించుకుని, ఆలయ

ఆదాయాలను స్వాధీనం చేసుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. 
 
హైందవ శంఖారావం డిమాండ్స్ - ప్రతిజ్ఞ:

1 . శంకర, రామానుజ, మధ్వ ఆచార్యుల వంటి ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంగచత్వం, సంవదద్వం, ఛందో మనాంసి జానతామ్ 
అన్న పద్దతి లో కలిసి మెలిసి

నడుస్తాం.

2 . హిందూ దేవాలయాలపై సమాజంపై ధర్మం పై ఏ విధమైన దాడులు జరిగినా. . .మెం ప్రతి స్పందిస్తాం. 

3  అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకు తిరిగి స్వాధీనం చెందించటానికి తగిన రీతిలో ఆలయాలను రక్షించుకుంటాం.

4 హిందూ దేవాలయాలతో నిరంతరం సంబంధం కల్గి ఉండి, అన్ని కార్యక్రమాలలో భక్తి

శ్రద్దలతో పాల్గొంటాం.

5 . హిందూ దేవాలయాలను హిందూవులమైన మేమె నిర్మించుకున్నాం, కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనం లో హిందువులమే యోగ్యమైన పద్దతిలో నిర్వహించుకుంటాం. 

6 దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం జరుగుతున్నా ఈ జాతీయ మహోద్యమం లో భాగస్వాములం అవుతాం. నిరంతరం

కొనసాగిస్తాం.

7 కులము, జాతి, వర్గం, అష్టి, అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరం సమానమే. అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గం లో సమతాభావంతో జీవిస్తాము. 

8 మతమార్పిడి కి గురియై దారితప్పిన వారికి సరి అయినా అవగాహనా కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్టు చేయడానికి మా కర్తవ్యాన్ని

నిర్వహిస్తాం. 

9 సనాతన, వైదిక హైందవ ధర్మ రక్షణ కోసం మన, తనువూ, ధనం, శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam