DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాకుంభమేళా... బోణి అదిరింది. మొదటి రోజే కోటి దాటింది

*కుంభ మేళలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం* 

*విశాఖపట్నం/ ప్రయాగ్ రాజ్, 13 జనవరి, 2025 (డి ఎన్ ఎస్):* అత్యంత పవిత్రమైన భవ్య దివ్య కుంభమేళా లో బోణి ఎదిరింది. మొదటి రోజు సాయంత్రానికే గంగాస్నానం చేసిన భక్తుల సంఖ్యా కోటి కి పైగా దాటినట్టు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన నాగ సాధువులు, అఖాడా సంత్ లు, విదేశీ

సాధువులు సహా లక్షలాదిగా ప్రముఖులు తొలి స్నానం ఆచరించారు. అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ కుంభ మేళ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. 144 ఏళ్ళ కు ఒకసారి వచ్చే ఈ మహా కుంభ మేళ లో స్నానాదికాలు చేసేందుకు కొందరు, పితృదేవతలకు పిండప్రదానం తర్పణాలు ఇచ్చేందుకు మరికొందరు, ఈ మహత్తర వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంకొందరు

వస్తుండగా, దీన్ని అడ్డుకునేందుకు దుష్ట రాక్షసులు దేశ విదేశాల సహకారంతో ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వాటన్నింటినీ ఎండగడుతూ  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకుంటున్న రక్షణ చర్యలు దిమ్మ తిరిగిపోతోంది. దేశం పరువు తీసేందుకు ప్రతిపక్షాలు, విద్రోహ శక్తులు చేస్తున్న కుట్రలకు  ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా

కఠిన చర్యలు తీసుకున్నారు. యోగి ఒక ముఖ్యమంత్రి గానే కాకుండా ఒక నాగ అఖాడా కు పీఠాధిపతి కూడా కావడం తో కుంభమేళా ఏర్పాట్లు ఎక్కడ లోపం జరగకుండా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

కుంభ మేళ హిందువులది మాత్రమే. .వారికే ప్రవేశం:.

కుంభ మేళ కేవలం హిందూ సంప్రదాయం కు మాత్రమే సంబంధించినదని, ఇతరులకు వ్యాపార

కార్యకలాపాలు చేసేందుకు అనుమతి లేదంటూ ముందుగానే ఆదేశాలు జారీ చేసారు. అయితే కొందరు సాదు, సంత్ లు చేసిన సూచనల మేరకు, అన్యమతస్తులు కుంభమేళా లో పాల్గొనాలి అంటే వారు ముందుగా గంగ స్నానం చేసి, తదుపరి శివునికి పూజలు చేయాలని నిబంధన పెట్టారు. వారు తెలిపిన అంశాలు ప్రకారం అన్యమతస్తులకు హిందూ ధర్మం పట్ల గానీ, దేవాలయాల పట్ల గాని

గౌరవం లేదని, లవ్ జిహాద్ లు, మతమార్పిళ్లు చెయ్యడం, హిందూ మహిళల పట్ల అఘాయిత్యాలు చెయ్యడం, సర్ తన్ సే జుదా, దేవీదేవతలు దోచించడం, అపహాస్యం చెయ్యడం, దేవాలయాలు కూల్చడం, వక్ఫ్ పేరిట హిందూ  భూ దోపిడీ ఆక్రమణలు చెయ్యడం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్నవాడు ఇవన్నీ చెయ్యడని తెలిపారు. వీటన్నింటి

నేపధ్యం లో అన్య మతస్తులు కుంభమేళా లో పాల్గొనాలి అన్నా, వ్యాపారం చెయ్యాలి అన్నా గంగ స్నానం, శివ పూజ కచ్చితంగా చేయాలన్నారు. దీనిపై ఎటువంటి వెసులుబాటు లేదన్నారు. కుంభ మేళ కేవలం సనాతన హిందూ సంప్రదాయం లో మాత్రమే ఉందని, ఇతర మతాలు పుట్టడం కంటే ముందే  నాటికే కొన్ని యుగాల నుంచి కుంభమేళాలు

జరుగుతున్నాయన్నారు. 

వీటన్నింటిని పటిష్టంగా అమలు చేస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ కుంభ మేళ విధుల్లో సైతం పూర్తిగా హిందూ ఉద్యోగులనే నియమించారు. ఎటువంటి ఘర్షణలు జరుగకుండా ఎఇ సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి తీసుకు వచ్చి, అసాంఘిక శక్తులు, హిందూ వ్యతిరేక మీడియా వర్గాలు, సోషల్ మీడియా

వర్గాల కదలికలపై దృష్టి పెట్టారు. 

ప్రయాగ్ రాజ్ రూపు రేఖలు మారిపోయాయి:

మహా కుంభ మేళ నేపథ్యంలో  ప్రయాగ్ రాజ్ జిల్లా మొత్తం రూపు రేఖలు మారిపోయాయి. ఎన్నో ముస్లిం కోలనీలు  సైతం ఎంతో అధునాతనంగా తయారు చేసారు. కొన్ని స్నానాల ఘాట్ లు ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో గట్టి భద్రతా ఏర్పాటు

చేసారు. 

ప్రభుత్వ పధకాలు వస్తున్నా..ఓటు మాత్రం వెయ్యరు:

రాష్ట్రం లో జరుగుతున్నా అభివృద్ధి ను చూసి స్థానికులు సైతం యోగి పరిపాలనకు పూర్తి మద్దతు పలుకుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్, పింఛను, సహా ప్రభుత్వ సంక్షేమ పధకాలు పూర్తిగా ఉచితంగానే వస్తున్నాయని, సొంత ఇళ్ళు కూడా దాదాపుగా అందరికి

వచ్చాయని తెలియచేస్తున్నారు. అయితే తమ కట్టుబాట్ల ప్రకారం ఓటు మాత్రం యోగి కి వేసేది లేదని కచ్చితంగా ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam