DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అజ్ఞాన భేరీ వేదికగా అసలు రంగు బట్ట బయలు

అంగన్వాడీ ప్లేస్ లో విద్యార్థులే టార్గెట్ 

విశాఖపట్నం, ఆగస్టు 23 ,2018 (DNS Online ): విశాఖ నగరం లో జరిగిన అజ్ఞాన భేరీగా తెలుగుదేశం పార్టీ అండ్ కో వేసిన బ్రహత్తర

ప్రణాళిక బట్ట బయలు అయ్యింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన పలు పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వేలు చెయ్యడానికి విద్యార్థులను వినియోగించే ప్రయత్నాలు

జరుగుతున్నట్టు పరోక్షంగా వేదిక పైనుంచే ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదలైంది. విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆఖరు లో నిర్వహించే ప్రాజక్టు లను ఈ

క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధంగా సూచన చేసి వీటికి మార్కులను కూడా ఇచ్చే విధంగా ప్రకటన చేసినప్పటికీ ఈ ప్రణాళిక వెనుక పార్టీ క్యాడర్ ను పెంచుకునే

ప్రక్రియే దిశా నిర్దేశంగా తెలుస్తోంది. ప్రతి విద్యార్థినీ క్షేత్ర స్థాయి ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ పధకాల అమలు పై ప్రచారం చేయించే విధంగా తప్పని సరిగా

విధించే కార్యక్రమాన్ని ఉన్నత విద్యా మండలి కి ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలుస్తోంది. అజ్ఞాన భేరి వేదిక పైనే ఉన్న అధికారులకు సూచించిన తర్వాతే ముఖ్యమంత్రి ఈ

ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. 

గతంలో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ప్రకటనలపై ప్రచారాన్ని సేకరించేందుకు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలను

వినియోగించేవారు. ఉచితంగా ఈ పార్టీ ప్రచారాన్ని చేసేందుకు వారు గతంలోనే ససేమిరా అనడంతో పాటు పెద్ద ఎత్తున నిరసనలు చెయ్యడం తో చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ

ప్రక్రియకు ఉచితంగా చెయ్యగలిగిన వారు విద్యార్థులే కావడం తో, వారికి మార్కులు పేరిట వారిని బిగిస్తే, కచ్చితంగా ఈ పని చేస్తారు అనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో

ఇల్లిల్లూ తిరిగి ప్రభుత్వ పధకాల అమలుతో పాటు, వారిని తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపే విధంగా విద్యార్థులకు దిశా నిర్దేశం కూడా జరిపేందుకు రంగం సిద్దం

చేసేసారు. పైగా ఈ పనికి మార్కులతో లింక్ పెడితే నోరెత్తకుండా పని జరిగిపోతుంది అనే ఉద్దేశం మాత్రం ఈ ప్రణాళిక వెనుక ఉన్న నిగూఢ రహస్యం. డబ్బులు ఖర్చు కాకుండా

ఉచితంగా ప్రచారం చెయ్యగలిగిన వాళ్ళు కేవలం విద్యార్థులు మాత్రమే. పైగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువత జనసేన పార్టీ పట్ల మోజుతో జనసేన అధినేత పవన్

కళ్యాణ్ పట్ల అభిమానంతో ఆ పార్టీ వైపు మ్రొగ్గు చూపుతున్నారు అనే సంకేతాలు రావడంతో వాళ్లకి అడ్డుకట్ట వెయ్యడానికి మొదలైంది ఈ జ్ఞానభేరి. ఇక్కడ జ్ఞానం ఇచ్చేది

తక్కువే కావడం ఇది పూర్తిగా అజ్ఞాన భేరీగా మారిపోయింది అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

అసలు జ్ఞాన భేరి కార్యక్రమం ప్రారంభించినదే తెలుగుదేశం

పార్టీని గ్రామీణ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు అన్నది వాస్తవం. ప్రధానంగా ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు పిలుచుకు వచ్చిన విద్యార్థులు అధిక భాగం గ్రామీణ

ప్రాంతాల నుంచీ వచ్చినవారే కావడం గమనార్హం.   

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #jnana bheri  #visakhapatnam  #vizag  #andhra pradesh  #ap #government  #chandra babu naidu  #andhra university  #au  #chandrababu naidu


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam